Sudheer Kavya Shree: సుడిగాలి సుధీర్‌తో పెళ్లి..కావ్యశ్రీ ఏమందో తెలుసా? కన్నీళ్లు తుడిచిన సుధీర్..సుమకు సర్ప్రైజ్
Sudheer Kavya Shree: సుడిగాలి సుధీర్ కు ఉన్న బుల్లితెర ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీకి కూడా మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరూ ఈ మధ్య కలిసి షోలలో కనిపిస్తున్నారు. దీంతో వీళ్ల మ్యారేజీపై ప్రచారం జోరందుకుంది. తాజాగా ఈ టాపిక్ పై కావ్యశ్రీ రియాక్టయింది.
Sudheer Kavya Shree: ఇప్పుడు తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్, కావ్యశ్రీ బాగా పాపులర్ జోడీగా మారుతున్నారనే కామెంట్లు వస్తున్నాయి. వీళ్లు తరచుగా టీవీ, ఓటీటీ షోలలో కలిసి కనిపించడంతో పాటు వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవుతుండటమే కారణం. తాజాగా మరోసారి ఈ జంట ట్రెండింగ్ లోకి వచ్చింది.

కావ్యతో సుధీర్
ఆహా ఓటీటీలో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె వంట షో ఆరో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వంట షో లేటెస్ట్ ఎపిసోడ్ కు సుడిగాలి సుధీర్ సెలబ్రిటీ గెస్ట్ గా వచ్చాడు. ఫుడ్ ఇన్ స్పెక్టర్ అంటూ సెట్ లో హడావుడి చేశాడు. ఇదే క్రమంలో అక్కడ యాదమ్మ రాజుతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్న కావ్యశ్రీతో సుధీర్ చేసిన సందడి వైరల్ గా మారింది.
కావ్యశ్రీ కన్నీళ్లు తుడిచిన సుధీర్
కావ్యకు ఉల్లిపాయలు ఎలా కట్ చేయాలో సుధీర్ చూపించాడు. ఉల్లిపాయలు కొస్తే కావ్యకు కన్నీళ్లు వచ్చాయి. వాటిని సుధీర్ తుడవడం క్యూట్ గా అనిపించింది. ఇలా ఈ జంట చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె లేటెస్ట్ ఎపిసోడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
సుధీర్ తో పెళ్లి
గతంలో బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తో కావ్యశ్రీ రిలేషన్ షిప్ లో ఉందని, ఆ తర్వాత బ్రేకప్ అయిందనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడే కావ్యశ్రీ, సుధీర్ జంట బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా మొదలెట్టారు.
అయితే ప్రాజెక్ట్ కె ఆరో సీజన్ తాజా ఎపిసోడ్ లో సుధీర్ తో పెళ్లి గురించి కావ్య రియాక్టయింది. ఈ షోకు యాంకర్ గా ఉన్న సుమ.. ఆ సెలబ్రిటీలు విన్న క్రేజీ గాసిప్ గురించి చెప్పమని అడిగింది. అప్పుడు సుధీర్ తో తనకు పెళ్లి అని అంటున్నారని కావ్యశ్రీ చెప్పింది. ఈ మాటలు విని సుధీర్ కూడా నవ్వేశాడు. అంటే ఇది గాసిప్ అని కావ్యశ్రీ చెప్పేసింది.
సుమకు సర్ ప్రైజ్
ఇక స్టార్ యాంకర్, పరిచయం అక్కర్లేని సుమకు ఈ ఎపిసోడ్ లో మేకర్స్ ఓ సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సుమ యాంకరింగ్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాళ్ల అమ్మను సెట్స్ కు తీసుకొచ్చారు. అమ్మను చూసి సుమ షాక్ అయ్యారు. వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే సుమ ఏజ్ ఎంత అని వాళ్ల అమ్మను అడిగితే.. ఆవిడను చెప్పకుండా సుమ అడ్డుకోవడం నవ్వులు పూయించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


