Ashu Reddy: పిచ్చోళ్లను చేసిన అషు రెడ్డి.. అది రియల్ ఎంగేజ్మెంట్ కాదు..సారీ చెప్తూ మరో పోస్ట్..మోసం చేసిందంటూ కామెంట్లు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రియల్ ఎంగేజ్మెంట్ కాదంటూ మరో పోస్ట్ పెట్టింది. జనాలను పిచ్చోళ్లను చేస్తూ సింపుల్ గా సారీ చెప్పేసింది. ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Published on: May 9, 2026, 16:24:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ashu Reddy: వామ్మో.. అషు రెడ్డి ఎంత పని చేసింది? ఎంగేజ్మెంట్ అని ఇంత మోసం చేస్తుందా? జనాలను పిచ్చోళ్లను చేస్తుందా?.. ఇప్పుడు అషుపై ఫైర్ అవుతున్న నెటిజన్లు చేస్తున్న కామెంట్లు ఇవి. ఇందుకో కారణం ఉంది. శుక్రవారం (మే 8) చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ తో ఫొటో పెట్టిన అషు.. శనివారం (మే 9) ట్విస్ట్ ఇచ్చింది.

నిఖిల్, అషు (instagram-Ashu Reddy)
నిఖిల్, అషు (instagram-Ashu Reddy)

ఎంగేజ్మెంట్ రియల్ కాదు

శుక్రవారం అషు రెడ్డి ఇన్ స్టాలో చేతికి ఎంగేజ్మెంట్ రింగ్, ఒక అబ్బాయి చేయి పట్టుకున్న ఫొటోలను పోస్టు చేసింది. దీంతో ఈ బిగ్ బాస్ బ్యూటీకి ఎంగేజ్మెంట్ అయిందని అందరూ అనుకున్నారు. చీటింగ్ కేసు విచారణ సాగుతున్న వేళ అషు ఎంగేజ్మెంట్ తో షాకిచ్చిందని భావించారు. కానీ అషునే దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. ఇది రియల్ ఎంగేజ్మెంట్ కాదని ఇవాళ పోస్టు పెట్టింది.

ఆ సిరీస్

ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరో. ప్రతి వారం కొత్త ఎపిసోడ్ రిలీజ్ అయ్యే ఈ సిరీస్ లో నిఖిల్ సరసన అషు రెడ్డి నటిస్తోంది.

షూటింగ్ లో

ఈ విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ షూటింగ్ లో భాగంగా నిఖిల్, అషు రెడ్డికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ ఫొటోలనే అషు నిన్న పోస్టు చేసి సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఈ రోజు అసలు వీడియో రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది. ఇందులో నిఖిల్ తో అషు ఎంగేజ్మెంట్ జరిగింది. సిరీస్ కోసం ఈ సీన్ షూట్ చేశారు.

నిజం కాదంటూ

‘‘సడెన్ గా మన కళ్లతో చూసేది, మన చెవులతో వినేది ఎప్పుడూ నిజం కాకపోవచ్చు. రియల్ గా అనిపించే ప్రతీది కూడా నిజమైంది కాదు. నమ్మే ముందు ఆలోచించండి. ఇవి వీఓడీ (విక్రమ్ ఆన్ డ్యూటీ) షూటింగ్ ఫొటోలు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా కొన్ని విషయాలు ఎలా జరుగుతాయో చాటేందుకే ఎగ్జాంపుల్ గా ఇలా చేశా. క్షమించాలి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా’’ అని ఇన్ స్టాలో అషు పేర్కొంది.

మోసం చేసిందంటూ

అషు రెడ్డి తాజాగా పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘మోసం చేశావ్’, ‘కేసు నుంచి డైవర్ట్ చేసేందుకే ఈ ప్రయత్నాలు’ అని కామెంట్లు చేస్తున్నారు. అషు ప్రస్తుతం ఓ ఎన్నారైని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో విచారణ ఎదుర్కుంటోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More