OTT Thriller: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సిరీస్.. అప్పుడే చూసేసిన మెగా హీరో.. సాయి ధరమ్ తేజ్ రివ్యూ!
OTT Thriller: ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ తెలుగు మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పై సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రశంసలు కురిపించారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిందంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన రివ్యూ వైరల్ గా మారింది. అసలు ఆ సిరీస్ ఏదో చూసేయండి.
OTT Thriller: ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ల హవా నడుస్తోంది. ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే ఆసక్తికరమైన కథాంశాలకు ఎక్కడలేని డిమాండ్ ఉంది. సరిగ్గా ఇలాంటి అంచనాలతోనే థ్రిల్లర్ ప్రియుల ముందుకు వచ్చిన తాజా వెబ్ సిరీస్ 'రుద్రవనం పీఎస్'. ఇవాళ (అక్టోబర్ 30) జీ5 (ZEE5)లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

సాయి ధరమ్ తేజ్ సాలిడ్ రివ్యూ
కొత్త కథలను, సిరీస్ లను ఇష్టపడే వారికి 'రుద్రవనం పీఎస్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ పై కేవలం సాధారణ ప్రేక్షకులే కాకుండా, సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ వెబ్ సిరీస్ గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ సిరీస్ మేకింగ్, నటీనటుల ప్రతిభపై తన రివ్యూ పోస్టు చేశారు.
తేజ్ చేసిన కామెంట్స్ ఏంటంటే?
"నేను ఇప్పుడే రుద్రవనం పీఎస్ చూశాను. ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ థ్రిల్లర్లలో ఇదొకటి! ఆద్యంతం కట్టిపడేసే కథనం, అద్భుతమైన నటీనటుల ప్రతిభ, అత్యుత్తమ సాంకేతిక విలువలు ఈ సిరీస్‌ను తప్పకుండా చూడాల్సిందిగా మార్చాయి. దర్శకుడు, నిర్మాతలు, అలాగే మొత్తం జీ5 బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు!" అంటూ తేజ్ ఎక్స్ లో రాసుకొచ్చారు.
తల లేని మొండెం
ఈ రుద్రవనం పీఎస్ సిరీస్ కథ అంతా 'రుద్రవనం' అనే ఓ మారుమూల గ్రామం, అక్కడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఊరిలో ఒక వ్యక్తి హఠాత్తుగా అదృశ్యమవ్వడం, అదే సమయంలో తల లేని మొండెం బయటపడటం లాంటి ఉత్కంఠభరితమైన అంశాలతో కథ మొదలవుతుంది.
ఈ మిస్టరీ కేసును ఛేదించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ శివకుమార్ పాత్రలో నరేష్ ఆగస్త్య అద్భుతంగా నటించారు. విచారణలో భాగంగా ఊరిలోని రాజకీయాలు, అవినీతి, ఎన్నో ఏళ్లుగా దాగి ఉన్న రహస్యాలను వెలికితీసే క్రమంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను టీవీ స్క్రీన్లకు కట్టిపడేస్తాయి. విలక్షణ నటుడు బెనర్జీ నటన కూడా ఈ సిరీస్ కు మరింత బలాన్ని చేకూర్చింది.
జీ5 లో ఫుల్ రెస్పాన్స్
టెక్నికల్ గా ఈ సిరీస్ మేకింగ్ స్థాయి చాలా ఉన్నతంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ లాంటి స్టార్ హీరో స్వయంగా ఈ రేంజ్ లో రివ్యూ ఇవ్వడంతో సిరీస్ పై మరింత హైప్ పెరిగింది. దానికి తోడు థ్రిల్లర్ ప్రియుల మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటంతో జీ5 ఓటీటీలో ఈ సిరీస్ కు వ్యూస్ దూసుకుపోతున్నాయి. మీరు వీకెండ్ లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలని అనుకుంటే 'రుద్రవనం పీఎస్' వెబ్ సిరీస్ ను ఏమాత్రం మిస్ కాకండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


