Aadarsha Kutumbam Twitter Review: ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?

Aadarsha Kutumbam Twitter Review: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన భారీ చిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' (AK47). ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ట్విట్టర్ లో మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి.

Published on: Oct 30, 2026, 09:16:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Aadarsha Kutumbam Twitter Review: 'ఆదర్శ కుటుంబం' సినిమాకు వెంకటేష్ అతిపెద్ద బలం. తన ట్రేడ్ మార్క్ కామిక్ టైమింగ్‌తో సినిమాను తన భుజాలపై మోశారు. ముఖ్యంగా కాగ్నిజెంట్ ఐటీ ఉద్యోగిగా నటించిన కమెడియన్ సత్య కామెడీ ఈ సినిమాకు మరో మేజర్ హైలైట్. ఫస్ట్ హాఫ్‌లో లైట్ హార్టెడ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది.

ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? (x/haarikahassine)
ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? (x/haarikahassine)

ఆదర్శ కుటుంబం రివ్యూ

త్రివిక్రమ్ డైరెక్షన్ తో విక్టరీ వెంకటేష్ నటించిన ఫస్ట్ సినిమా కావడంతో ఆదర్శ కుటుంబం హౌజ్ నంబర్ 47పై హైప్ నెలకొంది. కానీ ఇవాళ (అక్టోబర్ 30) రిలీజైన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తోంది. ట్విట్టర్ రివ్యూల్లో నెటిజన్లు డిఫరెంట్ ఒపీనియన్ చెప్తున్నారు.

విలన్ గ్యాంగ్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల సీన్స్ అదిరిపోయాయని నెటిజన్లు చెబుతున్నారు. రావు రమేష్, రఘుబాబు కూడా తమదైన శైలిలో నవ్వించారు. నారా రోహిత్ పాత్ర బాగున్నా, నివేతా పేతురాజ్ ట్రాక్ మాత్రం కథలో కావాలని ఇరికించినట్లు అనిపిస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. శ్రీనిధి శెట్టి యాక్టింగ్ పై కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి.

ఫస్ట్ హాఫ్ హిట్.. సెకండాఫ్ డ్రాగ్!

సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు చెబుతున్న ప్రధాన లోపం సెకండాఫ్. ఫస్ట్ హాఫ్ డీసెంట్ కామెడీతో, అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ముగుస్తుంది. కానీ రెండో సగంలో కథనాన్ని త్రివిక్రమ్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. సెకండాఫ్ బాగా సాగదీసినట్లు ఉండటం, ఎమోషన్స్ పెద్దగా పండకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి.

త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అక్కడక్కడా పేలినా.. సరైన బౌండ్ స్క్రిప్ట్ లేకుండా కేవలం బేసిక్ స్టోరీ లైన్ మీద ఎప్పటికప్పుడు సీన్స్ రాసుకుంటూ వెళ్లినట్లు అనిపిస్తోందని కొందరు ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

తమన్ మ్యూజిక్ ఎలా ఉందంటే?

ఈ మధ్య కాలంలో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) పక్కాగా జెన్ జెడ్ (Gen Z) ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో బాగా కుదిరిందనే పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ లో బీజీఎమ్ అదరగొట్టినా.. పాటలు మాత్రం మ్యాజిక్ చేయలేకపోయాయి. కేవలం 'నారాయణమ్మ' సాంగ్ మాత్రమే వినడానికి బాగుందని చెబుతున్నారు. కాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

త్రివిక్రమ్ ఎక్స్‌పెరిమెంట్

'గుంటూరు కారం' తరహాలోనే ఈ సినిమాలోనూ దర్శకుడు త్రివిక్రమ్ విభిన్నమైన, కన్‌ఫ్యూజన్‌తో కూడిన కామెడీని ట్రై చేశారు. కొన్ని ఐడియాలు బాగానే వర్కౌట్ అయినా, సినిమా అంతా ఒక సరైన రిథమ్‌లో సాగలేదు. చాలా హడావుడిగా సినిమాను చుట్టేసిన ఫీలింగ్ వస్తుందని ట్విట్టర్ ఆడియన్స్ అంటున్నారు.

మొత్తానికి ఆదర్శ కుటుంబం (AK47) సినిమా గురించి చెప్పాలంటే.. ఇది బిలో-యావరేజ్ నుంచి యావరేజ్ గా నిలిచే చిత్రమని టాక్. తమిళంలో వచ్చిన బ్లాస్ట్, దృశ్యం సినిమాలను కలిపితే ఆదర్శ కుటుంబం అని ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

ఫైనల్ గా చెప్పాలంటే మాత్రం.. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా.. వెంకటేష్ వింటేజ్ కామెడీ కోసం, సత్య టైమింగ్ కోసం ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ లో ఒకసారి సరదాగా చూసేయొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More