Thaman: తమన్ మళ్లీ దొరికేశాడా? ఈ సారి సొంత పాట ట్యూన్ కాపీ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు!
Thaman: టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ పై మళ్లీ ట్రోల్స్ మోత మొదలైంది. ఆదర్శ కుటుంబం నుంచి సెకండ్ సింగిల్ ‘మాలా’ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో తమన్ పై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. తన సొంత సాంగ్ ట్యూన్ ను కాపీ కొట్టి ఈ పాటలో వాడేశారంటూ నెటిజన్లు తమన్ ను ఆడేసుకుంటున్నారు.
Thaman: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం' (హౌజ్ నెంబర్ 47 - #AK47). ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘మాలా వచ్చా చూడు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

తమన్ పై ట్రోల్స్
ఆదర్శ కుటుంబం మూవీ నుంచి రెండో పాటగా ‘మాలా వచ్చా చూడు’ లిరికల్ సాంగ్ రీసెంట్ గా రిలీజైంది. నివేదా పేతురాజ్ గ్లామర్, వెంకీ మామ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ పాటకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే, విజువల్స్ పరంగా ఈ సాంగ్ అలరిస్తున్నప్పటికీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్యూన్ మాత్రం వివాదంలో చిక్కుకుంది.
సొంత పాటనే కాపీ కొట్టాడా?
ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే నెటిజన్లు ఇందులోని మ్యూజిక్ బీట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ను పసిగట్టారు. గతంలో తమన్ అందించిన బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ 'ప్రతి రోజూ పండగే' చిత్రంలోని 'ఓ బావ' సాంగ్ ట్యూన్‌ను యాజిటీజ్‌గా దించేసాడంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కనీసం ట్యూన్ మార్చడానికి కూడా ట్రై చేయకుండా తన సొంత పాటనే తమన్ ఇక్కడ రీసైకిల్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రెండు పాటల క్లిప్పింగ్స్‌ను పక్కపక్కన పెట్టి మీమ్స్, ట్రోల్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.
ఆదర్శ కుటుంబం కథేంటి?
టైటిల్‌కు తగ్గట్టే ఇది ఒక సంపూర్ణమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. బయటకు ఎంతో పర్ఫెక్ట్గా, ఆదర్శంగా కనిపించే 'హౌజ్ నెంబర్ 47' అనే ఇంట్లోని ఒక కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే ఊహించని ఒక సంఘటన వల్ల ఆ కుటుంబంలో దాగి ఉన్న రహస్యాలు ఎలా బయటపడ్డాయి, ఆదర్శంగా కనిపించే ముసుగు వెనుక ఉన్న అసలు నిజాలను కుటుంబ సభ్యులు ఎలా ఎదుర్కొన్నారు అనే ఆసక్తికరమైన అంశాలతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని మలిచారు.
ఇందులో వెంకటేశ్ తన ఇంటికి సంబంధించిన పనులన్నీ స్వయంగా చేసుకునే 'చిట్టిబాబు' అనే బాధ్యతాయుతమైన కుటుంబ పెద్ద పాత్రలో కనిపిస్తున్నారు. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డార్క్ అండర్ టోన్ కలిగిన సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.
వరుస వాయిదాలు.. రిలీజ్ ఎప్పుడు?
మొదట ఈ ఆదర్శ కుటుంబం సినిమాను 2026 సమ్మర్ రేసులో నిలపాలని భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 2న, అనంతరం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర జాప్యం జరగడం వల్ల సినిమా విడుదలను వాయిదా వేశారు.
ప్రస్తుతం ఈ సినిమాను అక్టోబర్ 30, 2026 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. నిర్మాత నాగవంశీ ఇటీవల స్పందిస్తూ.. అక్టోబర్ 21 లేదా 22న ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని, అదే వేదికపై హీరో వెంకటేశ్‌తోనే అధికారికంగా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేయిస్తామని క్లారిటీ ఇచ్చారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


