Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం కొత్త రిలీజ్ డేట్ ఇదే.. తమన్ ట్వీట్‌తో డేట్ లీక్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే!
Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ వాయిదా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ చిత్రం మూడు సార్లు పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో తమన్ అనుకోకుండా లీక్ చేసిన ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నిజానికి ఈ శుక్రవారం (అక్టోబర్ 9, 2026) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఆదర్శ కుటుంబం రిలీజ్
వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సారి గురూజీ త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఎలా తీర్చుదిద్దుతున్నారనే క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఈ మూవీ రిలీజ్ ను పదే పదే పోస్ట్ పోన్ చేయడం నిరాశ కలిగిస్తోంది. ముందు 2026 సమ్మర్, ఆ తర్వాత అక్టోబర్ 2, అనంతరం అక్టోబర్ 9.. ఇలా సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు.
కొత్త రిలీజ్ డేట్ ఏంటీ?
అక్టోబర్ 9న కచ్చితంగా ఆదర్శ కుటుంబం మూవీని థియేటర్లకు తీసుకొస్తామని మొన్నటివరకూ మేకర్స్ బలంగా చెప్పారు. కానీ ఈ డేట్ కు కూడా తీసుకురాలేమని తాజాగా ప్రకటించారు. మరోసారి మూవీ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నిర్మాత నాగవంశీ ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో మునిగిపోయారు.
తమన్ ట్వీట్ తో
అయితే, ఈ నిరాశను పటాపంచలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ సినిమా రీ-రికార్డింగ్ పనుల గురించి అప్‌డేట్ ఇస్తూ, పొరపాటున కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో రాసేశారు. ఆ ట్వీట్ ప్రకారం సినిమా అక్టోబర్ 30, 2026న విడుదల కాబోతున్నట్లు లీక్ అయింది.
ఆ తర్వాత తమన్ వెంటనే అప్రమత్తమై ఆ డేట్‌ను డిలీట్ చేసి, పోస్ట్‌ను ఎడిట్ చేశారు. అయితే అప్పటికే నెటిజన్లు ఎడిట్ హిస్టరీ ద్వారా అసలు విషయాన్ని కనిపెట్టేశారు.
ఫ్యాన్స్ ఖుష్
ఈ ఊహించని లీక్‌తో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అక్టోబర్ చివరి శుక్రవారం నాడు 'ఆదర్శ కుటుంబం' థియేటర్లలో సందడి చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. ఈ కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి త్వరలోనే ఒక అఫీషియల్ పోస్టర్ వచ్చే అవకాశం ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


