Aadarsha Kutumbam: శాంసన్, అభిషేక్, తిలక్‌లాగే సినిమా సిక్సర్లు కొడుతుందన్న వెంకటేష్-ఆదర్శ కుటుంబానికి తుపాను టెన్షన్!
Aadarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియా యువ స్టార్లలాగా తమ సినిమా బాక్సాఫీస్ వద్ద సిక్సర్లు, సెంచరీలు కొడుతుందని వెంకీ మామ అన్నారు. అయితే, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఏపీలో తుపాను టెన్షన్ కలిగిస్తోంది.
Aadarsha Kutumbam: వెంకటేష్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా జరిగిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన తన సినిమా విజయంపై ఉన్న నమ్మకాన్ని క్రికెట్ భాషలో చెప్పారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్ ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యాయని అన్నారు.

వెంకటేష్ కామెంట్స్
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. అక్టోబర్ 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం (అక్టోబర్ 27) రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో వెంకటేష్ స్పీచ్ వైరల్ గా మారింది.
"ఈ మధ్య మన టీమిండియా కుర్రాళ్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ గ్రౌండ్ లోకి దిగితే సిక్సర్లు, ఫోర్లతో ఎలా మోత మోగిస్తున్నారో.. థియేటర్లలో మా 'ఆదర్శ కుటుంబం' కూడా అలాగే సిక్సర్లు, సెంచరీలు కొడుతుంది" అని వెంకటేష్ చేసిన కామెంట్స్ కు ఫ్యాన్స్ నుంచి విజిల్స్ దద్దరిల్లాయి.
బాక్సాఫీస్ వద్ద సెంచరీ పక్కా!
ఆదర్శ కుటుంబం సినిమా అవుట్ పుట్ పట్ల చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ డ్రామా, క్లీన్ కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయమని మేకర్స్ నమ్ముతున్నారు.
టీమిండియా బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి సెంచరీలు సాధిస్తున్నట్లే, ఈ సినిమా కూడా ఎలాంటి పోటీ లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించి బాక్సాఫీస్ వద్ద ఈజీగా వంద కోట్ల క్లబ్ (సెంచరీ) చేరుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఏపీలో తుపాను ఎఫెక్ట్
అయితే ఆదర్శ కుటుంబం సినిమా యూనిట్ కు ఒక ఊహించని షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 30న 'ఆదర్శ కుటుంబం' భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కానీ, సరిగ్గా ఇదే సమయానికి ఆంధ్రప్రదేశ్ లో తుపాను ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే అర్నబ్ తుపాను ప్రభావం మొదలైంది. కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉండటంతో.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఓపెనింగ్స్ కు షాక్ తప్పదా?
సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ వర్షాలు, తుపానుల సమయంలో బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించరు. మరోవైపు మొదటి మూడు రోజులు ఆదర్శ కుటుంబం సినిమాకు అత్యంత కీలకం. ఒకవేళ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటే, ఏపీలో సినిమా ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం పడే ఛాన్స్ ఉంది.
మరి వెంకీ మామ చెప్పినట్లు కంటెంట్ లో స్టఫ్ ఉంటే.. తుపానును సైతం లెక్కచేయకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సిక్సర్లు కొడుతుందా? లేదా వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలో వసూళ్లకు బ్రేకులు పడతాయా? అనేది అక్టోబర్ 30న తేలిపోనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


