Ram Charan: ఇట్లు అర్జున ఈవెంట్లో రామ్ చరణ్ టంగ్ స్లిప్.. కాకా మూవీ లీక్స్.. రంగస్థలం కామెంట్స్ వైరల్!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఇట్లు అర్జున మూవీ మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన చెర్రీ.. రంగస్థలంలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. అలాగే కాకా సినిమాలో అనస్వర రాజన్ పాత్ర గురించి కూడా చరణ్ మాట్లాడారు. 

Published on: Nov 10, 2026, 09:32:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ram Charan: మహేష్ రెడ్డి తనయుడు అనీష్ హీరోగా పరిచయం అవుతున్న కొత్త సినిమా 'ఇట్లు అర్జున'. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల నిర్మాత కాగా, కింగ్ నాగార్జున సమర్పిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఇట్లు అర్జున ఈవెంట్లో రామ్ చరణ్ టంగ్ స్లిప్.. కాకా మూవీ లీక్స్.. రంగస్థలం కామెంట్స్ వైరల్!
ఇట్లు అర్జున ఈవెంట్లో రామ్ చరణ్ టంగ్ స్లిప్.. కాకా మూవీ లీక్స్.. రంగస్థలం కామెంట్స్ వైరల్!

రంగస్థలం 'చిట్టిబాబు'పై చరణ్ టంగ్ స్లిప్

ఇట్లు అర్జున ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతున్న సమయంలో ఒక చిన్న తప్పు దొర్లడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇట్లు అర్జున సినిమాలో హీరో అనీష్ మూగవాడిగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. "రంగస్థలం సినిమాలో నేను చేసిన మూగవాడి పాత్ర కంటే, ఈ సినిమాలో అనీష్ చేస్తున్న మూగవాడి క్యారెక్టర్ ఇంకా పెద్ద హిట్ అవ్వాలి" అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

అయితే వాస్తవానికి రంగస్థలంలో చరణ్ పోషించిన చిట్టిబాబు క్యారెక్టర్ కు వినికిడి లోపం ఉంటుంది (చెవిటివాడు). కానీ ఫ్లోలో చరణ్ దాన్ని మూగవాడు అనడంతో, ఫ్యాన్స్ సరదాగా ఆ వీడియో క్లిప్ ను కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అనస్వర రాజన్ పై ప్రశంసలు

ఇదే వేదికపై రామ్ చరణ్ ఈ ఇట్లు అర్జున సినిమా హీరోయిన్ అనస్వర రాజన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె నటన అద్భుతంగా ఉందని, భవిష్యత్తులో ఆమె టాలీవుడ్ లో మంచి స్థాయికి వెళ్తుందని కొనియాడారు. ఇట్లు అర్జున సినిమాలో అనీష్, అనస్వర రాజన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని, వాళ్ల కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

'చిరు లీక్స్' లాగా చేయను

అనస్వర రాజన్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా 'కాకా'లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై చరణ్ స్పందిస్తూ వేదికపై నవ్వులు పూయించారు. "అనస్వర మా నాన్నగారి కాకా సినిమాలో కూడా అద్భుతమైన పాత్ర చేస్తోంది. అయితే మా నాన్నగారిలాగా 'చిరు లీక్స్' పేరుతో నేను ఆమె క్యారెక్టర్ ఏంటనేది ఇప్పుడే లీక్ చేయను" అని సరదాగా కామెంట్ చేశారు.

అలాగే "ఈ సంక్రాంతికి కాకా సినిమాతో మేం పక్కాగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం" అని చరణ్ ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఈవెంట్లో మెగా అభిమానుల అరుపులతో హోరెత్తిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ స్పీచ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More