...
...
Next Story

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ నుంచి డైరెక్టర్ సుందర్ ఔట్.. పోస్ట్ చేసి డిలీట్ చేసిన ఖుష్బూ.. అసలేం జరిగింది?

రజనీకాంత్, కమల్ హాసన్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ సుందర్ సి. తప్పుకున్నాడు. ఈ విషయాన్ని చెబుతూ అతడు రాసిన లేఖను అతని భార్య, నటి ఖుష్బూ ట్వీట్ చేసి తర్వాత డిలీట్ చేయడం గమనార్హం. దీంతో దీనిపై సస్పెన్స్ నెలకొంది.

Published on: Nov 13, 2025, 15:24:45 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

దశాబ్దాల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ తిరిగి కలిసి పనిచేయబోతున్నారనే ప్రకటనతో అభిమానులు ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి నిరాశపరిచే వార్త వెలువడింది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న, రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 'తలైవా 173' చిత్రం నుంచి దర్శకుడు సుందర్ సి తప్పుకున్నాడు.

సుందర్ సి ప్రకటన, అభిమానులకు క్షమాపణ

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ నుంచి డైరెక్టర్ సుందర్ ఔట్.. పోస్ట్ చేసి డిలీట్ చేసిన ఖుష్బూ.. అసలేం జరిగింది?
రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ నుంచి డైరెక్టర్ సుందర్ ఔట్.. పోస్ట్ చేసి డిలీట్ చేసిన ఖుష్బూ.. అసలేం జరిగింది?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను సుందర్ సి డైరెక్ట్ చేస్తున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అంతలోనే అతడు తప్పుకున్నాడన్న వార్త వైరల్ అవుతోంది. బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో సుందర్ సి పేరుగాంచాడు. దీంతో అతడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న ప్రకటనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో అతడు రజనీకాంత్‌తో కలిసి 'అరుణాచలం' వంటి హిట్ చిత్రాన్ని కూడా అందించాడు.

అయితే సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడనే షాకింగ్ న్యూస్ వచ్చింది. నటి, సుందర్ సి భార్య అయిన ఖుష్బూ సుందర్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన ఒక అనౌన్స్‌మెంట్ ద్వారా ఈ వార్తను ధృవీకరించింది. అయితే ఆ తర్వాత ఆమె ఆ పోస్టును డిలీట్ చేయడం గమనార్హం.

ప్రకటనలో ఏముందంటే?

"అనూహ్యమైన, అనివార్యమైన పరిస్థితుల కారణంగా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తలైవా 173 నుంచి తప్పుకోవాలనే కష్టమైన నిర్ణయం తీసుకున్నాను. నిజానికి ఈ ప్రాజెక్ట్ నాకు నిజంగా ఒక కల నెరవేరిన క్షణం. కానీ జీవితంలో మన కలలకు భిన్నంగా ఉన్నప్పటికీ, మన కోసం నిర్దేశించిన మార్గాన్ని అనుసరించాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి" అని తెలిపాడు.

అయితే సుందర్ సి తాను ఎందుకు వైదొలిగారనే ఖచ్చితమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సంఘటనపై కమల్ హాసన్ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక వార్త లేదా ప్రకటన ఇంకా రాలేదు.

మరి కొత్త డైరెక్టర్ ఎవరు?

రజనీకాంత్, కమల్ హాసన్ ప్రాజెక్టుకు మొదట్లోనే అడ్డంకి ఎదురైంది. నిజానికి 'తలైవా 173' సినిమాను పొంగల్ 2027కి విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు సుందర్ సి తప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్ వేరే దర్శకుడితో ముందుకు వెళ్తుందా లేక ఆగిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇండస్ట్రీలో వస్తున్న ఊహాగానాల ప్రకారం ఈ కామెడీ యాక్షన్ మూవీ కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe