Rajinikanth jailer 2: సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) జైలర్ 2తో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు వస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2). ఈ చిత్రం అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
రజినీకాంత్ కామెంట్లు

ఇటీవల నిర్వహించిన ‘జైలర్ 2 సూపర్ షో’ ఈవెంట్‌లో రజినీకాంత్ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక క్రేజీ అప్‌డేట్‌ను పంచుకున్నారు. బాలీవుడ్ లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించడానికి పెట్టిన వింత కండీషన్ గురించి రజినీ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
నా వల్ల కాదు బాబోయ్
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, మిథున్ చక్రవర్తి జైలర్ 2 చిత్రం ద్వారా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. సినిమాలో ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం మూవీ యూనిట్ మొదట మిథున్‌ను సంప్రదించినప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించారట. "నేను రజినీకాంత్ సినిమాలో విలనా? ఆయన చేతిలో తన్నులు తినాలా? నా వల్ల కాదు బాబోయ్, వెళ్ళిపోండి" అంటూ ప్రొడక్షన్ టీమ్‌తో సరదాగా అన్నట్లు రజినీ గుర్తుచేసుకున్నారు.
మిథున్ చక్రవర్తి పెట్టిన కండీషన్
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక సమ్మిట్‌లో రజినీకాంత్ స్వయంగా మిథున్ చక్రవర్తిని కలిశారు. ఆ సమయంలో మిథున్ రజనీతో.. "నువ్వు చెబితే నేను ఈ సినిమా కచ్చితంగా చేస్తా. కానీ నాకు ఒకే ఒక్క కండీషన్. సినిమాలో నీ క్యారెక్టర్ టైగర్ ముత్తువేల్ పాండియన్ నన్ను కొట్టకూడదు, అలాగే తుపాకీతో కాల్చకూడదు" అని కండీషన్ పెట్టారట.
ఈ వింత షరతు విన్న రజినీకాంత్ నవ్వుకుంటూ.. "సరే, నేను డైరెక్టర్ని అడిగి చెబుతాను" అని హామీ ఇచ్చి ఆయనను ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చినట్లు సంచలన విషయాలను బయటపెట్టారు. ఒక భారీ యాక్షన్ సినిమాలో విలన్ క్యారెక్టర్ హీరో చేతిలో దెబ్బలు తినకూడదనే షరతు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
జైలర్ 2 మూవీ క్రేజీ అప్డేట్స్
{{/usCountry}}ఈ వింత షరతు విన్న రజినీకాంత్ నవ్వుకుంటూ.. "సరే, నేను డైరెక్టర్ని అడిగి చెబుతాను" అని హామీ ఇచ్చి ఆయనను ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చినట్లు సంచలన విషయాలను బయటపెట్టారు. ఒక భారీ యాక్షన్ సినిమాలో విలన్ క్యారెక్టర్ హీరో చేతిలో దెబ్బలు తినకూడదనే షరతు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
జైలర్ 2 మూవీ క్రేజీ అప్డేట్స్
{{/usCountry}}2023లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ జైలర్ 2 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సీక్వెల్‌ను మరింత మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, ముత్తువేల్ పాండియన్ రిటైర్మెంట్ తర్వాతి సరికొత్త పోరాట నేపథ్యంతో తెరకెక్కించారు.
ఈ సారి సినిమాను మరింత రిచ్‌గా, విజువల్ వండర్‌గా చూపించేందుకు రజినీకాంత్ కెరీర్‌లోనే మొదటిసారిగా IMAX ఫార్మాట్‌లో కూడా భారీ స్థాయిలో జైలర్ 2ను విడుదల చేస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఇప్పటికే మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
సర్‌ప్రైజ్ క్యామియోలు
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ జైలర్ 2 చిత్రంలో రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా మీనన్ తమ పాత పాత్రలను రిపీట్ చేస్తుండగా.. కొత్తగా ఎస్.జె. సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజారమూడు కీలక పాత్రల్లో జాయిన్ అయ్యారు. వీటితో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, విజయ్ సేతుపతి ప్రత్యేక కామియో పాత్రల్లో మెరిసి థియేటర్లలో రచ్చ లేపడానికి సిద్ధంగా ఉన్నారు.