...
...
Next Story

Dhurandhar 2 Song: వీళ్లంతా దొంగలు.. నా పాటను చోరీ చేశారు.. ధురంధర్ 2 మేకర్స్‌పై విరుచుకుప‌డ్డ డైరెక్ట‌ర్‌

Dhurandhar 2 Song: 'త్రిదేవ్' సినిమాలోని ఐకానిక్ సాంగ్ 'తిర్చి టోపీవాలే'ను అనుమతి లేకుండా 'ధురంధర్ 2'లో వాడటంపై దర్శకుడు రాజీవ్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దొంగతనమేనంటూ ఆయన విరుచుకుపడ్డారు.

Published on: Apr 12, 2026, 05:29:51 IST
Advertisement

Dhurandhar 2 Song: బాలీవుడ్ క్లాసిక్ చిత్రం ‘త్రిదేవ్’లోని ఎవర్‌గ్రీన్ సాంగ్ ‘ఓయ్ ఓయ్.. తిర్చి టోపీవాలే’ సాంగ్ ను ధురంధర్ 2లో వాడటం వివాదానికి దారితీసింది. గత నెలలో విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలో ఈ పాటను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ త్రిదేవ్ దర్శకుడు, ప్రముఖ నిర్మాత రాజీవ్ రాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆయన కోర్టును ఆశ్రయించగా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర యూనిట్‌పై విరుచుకుపడ్డారు.

ఇది దొంగతనమే

ధురంధర్ 2 మేకర్స్ పై డైరెక్టర్ ఫైర్
ధురంధర్ 2 మేకర్స్ పై డైరెక్టర్ ఫైర్

ధురంధర్ 2లో తిర్చి టోపీవాలే సాంగ్ వాడటంపై రాజీవ్ రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఇది పక్కా దొంగతనం. ఒకరి పాటను దొంగలించి, దాన్ని మార్చి మరో సినిమాలో వాడుకోవడం అనేది డబుల్ చోరీ కిందకే వస్తుంది. నా దృష్టిలో ఇది నేరం. కోర్టులో వారు తాము దొంగతనం చేయలేదని వాదించవచ్చు.

కానీ నేరం జరిగింది కాబట్టే నేను కోర్టు మెట్లు ఎక్కాను. నా పాటను దొంగిలించారని నేను నిరూపిస్తాను. న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం వేచి చూస్తున్నాను" అని రాజీవ్ రాయ్ స్పష్టం చేశారు.

ఎలా వాడుకుంటారు?

'త్రిదేవ్' ఆడియో హక్కులు తమ వద్ద ఉన్నాయని, అందుకే ఆ పాటను 'ధురంధర్'లో వాడుకునే హక్కు తమకు ఉందని టి-సిరీస్ వాదిస్తోంది. అయితే, దీనిపై రాజీవ్ రాయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఆడియో హక్కులు ఉంటే కేవలం మ్యూజిక్ ఆల్బమ్‌లలో వాడుకోవాలి కానీ, వేరే సినిమాలో ఒక సన్నివేశంలో పాటగా ఉపయోగించే హక్కు ఉండదని ఆయన వాదిస్తున్నారు.

హక్కులు నావే

1989లో విడుదలైన ‘త్రిదేవ్’ చిత్రంలో మాధురీ దీక్షిత్, సోనమ్, సంగీత బిజిలానీలపై చిత్రీకరించిన ‘తిర్చి టోపీవాలే’ సాంగ్ అప్పట్లో ఒక సంచలనం. ఆనంద్ బక్షీ సాహిత్యం అందించగా, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికీ శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది. అయితే, ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ క్లైమాక్స్‌లో ఈ పాటను ఉపయోగించడంతో పాటు, రీమిక్స్ వెర్షన్‌ను కూడా ఆల్బమ్‌లో చేర్చారు. తన అనుమతి లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పాటను వాడటంపై రాజీవ్ రాయ్ తన నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రాజీవ్ రాయ్ కు చెందిన ‘త్రిమూర్తి ఫిల్మ్స్’.. ఈ వివాదంలో జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ (ధురంధర్ నిర్మాతలు), ఆ సినిమా మ్యూజిక్ రైట్స్ కలిగిన టి-సిరీస్‌పై దావా వేసింది.

త్రిదేవ్ వర్సెస్ ధురంధర్

అప్పట్లో రాజీవ్ రాయ్ తండ్రి గుల్షన్ రాయ్ నిర్మించిన ‘త్రిదేవ్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. నసీరుద్దీన్ షా, సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్ వంటి భారీ తారాగణంతో వచ్చిన ఆ సినిమా మ్యూజిక్ పరంగా కూడా చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు వివాదంలో ఉన్న ‘ధురంధర్’ చిత్రాన్ని ఆదిత్య ధర్ తెరకెక్కించగా రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ తదితరులు నటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe