Ram Charan Bodyguard: రామ్ చరణ్ బాడీగార్డ్ మాములోడు కాదు భయ్యో.. ఎంఎంఏ ఫైటర్.. అతనికి రోజుకు ఎన్ని లక్షల జీతమో తెలుసా?

Ram Charan Bodyguard: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో ఆయన బాడీగార్డ్ కెవిన్ కుంటా వైరల్ గా మారుతున్నాడు. రామ్ చరణ్ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్న ఈ బాడీగార్డ్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతని గురించి పూర్తి వివరాలు మీకోసం.

Published on: May 30, 2026, 14:13:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan Bodyguard: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'పెద్ది' దేశవ్యాప్త ప్రమోషన్లలో ఎంతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ టూర్ లో చరణ్ రగ్గడ్ లుక్ ఒకవైపు ట్రెండ్ అవుతుంటే, ఆయనతో పాటు నీడలా నడుస్తున్న బాడీగార్డ్ కూడా వైరల్ గా మారాడు. నెటిజన్లు ప్రస్తుతం ఈ కొత్త బాడీగార్డ్ గురించే ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

వైరల్ గా రామ్ చరణ్ బాడీగార్డ్
వైరల్ గా రామ్ చరణ్ బాడీగార్డ్

రామ్ చరణ్ బాడీగార్డ్

రామ్ చరణ్ బాడీగార్డ్ గురించి షాక్ అవుతారు. అవును.. అతను మామూలోడు కాదు. అతని పేరు కెవిన్ కుంటా. అతనో ఎంఎంఏ ఫైటర్. ఆఫ్రికన్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అతను. ఇటలీ ఎంఎంఏ బెల్ట్ కూడా సాధించాడు. ఇక అతనికి రోజుకు రామ్ చరణ్ లక్షల్లో జీతం ఇస్తున్నాడనే వార్తలు వైరల్ గా మారాయి.

రోజుకు లక్షల్లో జీతిం?

రిపబ్లిక్ మీడియా కథనం ప్రకారం, పబ్లిక్ ఈవెంట్స్, ప్రమోషన్ల సమయంలో రామ్ చరణ్ రక్షణ కోసం కెవిన్ కుంటాకు రోజుకు రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రచారం కనుక నిజమైతే, భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే సెలబ్రిటీ బాడీగార్డుల జాబితాలో కెవిన్ కుంటా చేరిపోతాడు.

ఇటీవల జరిగిన పెద్ది ప్రమోషనల్ ఈవెంట్లలో చరణ్ చుట్టూ ఉన్న జనసమూహాన్ని, భద్రతను ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ కెవిన్ కనిపించాడు. అతని పొడవైన విగ్రహం, గంభీరమైన లుక్స్, ప్రశాంతమైన ప్రవర్తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో క్షణాల్లో వైరల్ అయ్యాయి.

స్టైల్ లోనూ అదుర్స్

కేవలం బాడీగార్డ్‌గానే కాకుండా కెవిన్ కుంటా డ్రెస్సింగ్ స్టైల్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సాధారణంగా ప్రయాణాల్లో రామ్ చరణ్ క్యాజువల్ దుస్తుల్లో కనిపిస్తుంటే, కెవిన్ మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సూట్లు, షార్ప్ ఫార్మల్ వేర్‌లో ఎంతో స్టైలిష్‌గా మెరుస్తున్నాడు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఈవెంట్లలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న "మోస్ట్ స్టైలిష్ సెలబ్రిటీ బాడీగార్డ్స్"లో కెవిన్ ఒకరని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆ దేశం నుంచి

ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ కుంటా ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో నివసిస్తున్నారు. ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) అభిమానులకు అతని పేరు సుపరిచితమే. 2021లో ఇటలీ జాతీయ ఎమ్‌ఎమ్‌ఏ జట్టుకు కూడా ఆయన ప్రాతినిధ్యం వహించాడు.

ఫైటింగ్ స్పోర్ట్స్‌తో పాటు అంతర్జాతీయంగా వీఐపీలు, ప్రముఖ సెలబ్రిటీల రక్షణ బాధ్యతల్లో అతనికి దశాబ్ద కాలంగా మంచి అనుభవం ఉంది. అతని సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూస్తే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, ఫిట్‌నెస్, హెవీ జిమ్ సెషన్‌లకు సంబంధించిన వీడియోలు కనిపిస్తాయి, ఇవి అతని క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయి.

జూన్ 4న థియేటర్లలోకి 'పెద్ది'

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూన్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరు?

కెవిన్ కుంటా గాంబియా దేశానికి చెందిన ఒక ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్. ఆయన 2021లో ఇటలీ జాతీయ ఎమ్‌ఎమ్‌ఏ జట్టు తరఫున ఆడారు. ప్రస్తుతం అంతర్జాతీయ సెలబ్రిటీల సెక్యూరిటీ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నాడు.

2. కెవిన్ కుంటాకు రోజుకు ఎంత జీతం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది?

మీడియా నివేదికల ప్రకారం, 'పెద్ది' సినిమా ప్రమోషన్ల సమయంలో రామ్ చరణ్ వ్యక్తిగత రక్షణ కోసం కెవిన్ కుంటాకు రోజుకు రూ. 2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

3. రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'పెద్ది' చిత్రం జూన్ 4, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More