రామ్ చరణా రాహుల్ రామకృష్ణా.. అర్జున్ థియేటర్ విగ్రహం చూసి దారుణంగా ఆడుకుంటున్న ట్రోలర్స్.. సారీ చెప్పిన మెగా ఫ్యాన్స్

Ram Charan Idol Arjun Theatre: రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (Peddi) జూన్ 4న రిలీజ్ కాబోతున్న క్రమంలో.. కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది చరణ్ పోలికలతో అస్సలు మ్యాచ్ అవ్వకపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.

Jun 3, 2026, 15:04:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan Idol Arjun Theatre: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్, జూన్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అప్పుడే రచ్చ మొదలుపెట్టారు.

కూకట్‌పల్లి అర్జున్ థియేటర్ దగ్గర రామ్ చరణ్ విగ్రహం.. దారుణంగా ఆడుకుంటున్న ట్రోలర్స్.. సారీ చెప్పిన మెగా ఫ్యాన్స్
కూకట్‌పల్లి అర్జున్ థియేటర్ దగ్గర రామ్ చరణ్ విగ్రహం.. దారుణంగా ఆడుకుంటున్న ట్రోలర్స్.. సారీ చెప్పిన మెగా ఫ్యాన్స్

ఈ క్రమంలోనే తమ హీరో మీద ఉన్న అభిమానాన్ని చూపించుకోవడానికి హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఫేమస్ ‘అర్జున్ థియేటర్’ దగ్గర ఫ్యాన్స్ ఒక స్పెషల్ విగ్రహాన్ని (Statue) ఏర్పాటు చేశారు. కానీ ఫ్యాన్స్ కష్టం కాస్తా సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోయింది.

చరణ్ విగ్రహమే.. కానీ ఫేస్ కట్ వేరే!

పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ రగ్గడ్ మాస్ లుక్‌ను బేస్ చేసుకుని ఈ విగ్రహాన్ని డిజైన్ చేయించారు. అయితే ఆ విగ్రహం ఓపెన్ చేసిన వెంటనే నెటిజన్ల మైండ్ బ్లాక్ అయింది. అది ఏ యాంగిల్‌లోనూ రామ్ చరణ్‌లా లేకపోవడమే దానికి కారణం. ఇంకేముంది.. ఎక్స్ వేదికగా మీమ్స్ రాయుళ్లు రంగంలోకి దిగి ఓ రేంజ్‌లో ఆడుకోవడం స్టార్ట్ చేశారు.

ఒక నెటిజన్ వెటకారంగా.. "సూపర్ అన్నా, ఇంతకీ అది ఎవరి విగ్రహం?" అని అడగ్గా.. మరొకరు "వాళ్లు చేయించింది రామ్ చరణ్ విగ్రహం.. కానీ చూస్తే రాహుల్ రామకృష్ణలా ఉంది" అంటూ సెటైర్లు వేశారు. ఇంకొందరైతే అది మలయాళ యాక్టర్ జోజు జార్జ్ విగ్రహంలా ఉందంటూ ఫోటోలు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు.

వెనకేసుకొచ్చిన టీమ్.. సారీ చెప్పిన ఫ్యాన్స్

ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రామ్‌కు 'ఆర్సీ యువశక్తి' ప్రెసిడెంట్, ‘మైఖేల్’, ‘A1 ఎక్స్‌ప్రెస్’ సినిమాల ప్రొడ్యూసర్ పసుపులేటి శివ (శివ చెర్రీ) ముఖ్య అతిథిగా వెళ్లారు. ట్రోల్స్ డోస్ పెరగడంతో ఆయన ఫ్యాన్స్ కష్టాన్ని సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు.

"దూరం నుంచి కామెంట్ చేయడం చాలా ఈజీ. కానీ ఫ్యాన్స్ చేసే ప్రతి పని వెనుక నిజమైన ప్రేమ, కష్టం ఉంటాయి. ఈ ఈవెంట్‌ను లోకల్ కూకట్‌పల్లి ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ట్విట్టర్‌లో కొన్ని నెగెటివ్ కామెంట్స్ చూశాను, కానీ వాళ్ళ ఎమోషన్‌ను, డెడికేషన్‌ను మనం అర్థం చేసుకోవాలి" అని శివ చెర్రీ చెప్పుకొచ్చారు.

మరోవైపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కూకట్‌పల్లి రామ్ చరణ్ ఫ్యాన్స్ క్లబ్ (KUKATPALLYRCFC) మాత్రం జరిగిన మిస్టేక్‌ను ఒప్పుకుంటూ పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పింది. "మేము అందరికీ హృదయపూర్వకంగా సారీ చెబుతున్నాము. రామ్ చరణ్ గారిపై మాకున్న ఇష్టాన్ని స్పెషల్‌గా చూపించాలనే ఈ విగ్రహాన్ని పెట్టాం. కానీ దురదృష్టవశాత్తూ ఎగ్జిక్యూషన్ అనుకున్నట్లుగా రాలేదు. ఇది ఒక 'మిస్‌ఫైర్'. ఎవరి మనోభావాలనైనా, సనాతన ధర్మాన్ని కానీ కించపరచాలనే ఉద్దేశం మాకు అస్సలు లేదు. మా ప్రయత్నం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి" అని ఫ్యాన్స్ క్లబ్ క్లారిటీ ఇచ్చింది.

‘పెద్ది’ ప్రీ-రిలీజ్ హైప్

ఈ ట్రోల్స్ పక్కన పెడితే.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కోసం ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే పెద్ది ప్రీరిలీజ్ బిజినెస్, యూఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

సినిమా రన్‌టైమ్ లాక్ అవ్వడం, సెన్సార్ రిపోర్టు కూడా పాజిటివ్‌గా రావడంతో.. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

రామ్ చరణ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏ థియేటర్ దగ్గర ఏర్పాటు చేశారు?

హైదరాబాద్, కూకట్‌పల్లిలోని ఫేమస్ అర్జున్ థియేటర్ (Arjun Theatre) దగ్గర మెగా ఫ్యాన్స్ ఈ విగ్రహాన్ని పెట్టారు.

రామ్ చరణ్ విగ్రహాన్ని నెటిజన్లు ఏయే యాక్టర్స్‌తో పోల్చారు?

ఈ విగ్రహం అస్సలు రామ్ చరణ్‌లా లేదంటూ.. మలయాళ యాక్టర్ జోజు జార్జ్, తెలుగు యాక్టర్స్ నవీన్ చంద్ర, రాహుల్ రామకృష్ణ ఫేస్ కట్స్‌తో నెటిజన్లు పోల్చారు.

'పెద్ది' సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? (Peddi release date)

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 4, 2026 న గ్రాండ్‌గా వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో జూన్ 3 నుంచే స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు స్టార్ట్ అవుతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More