Peddi Box Office Day 3: మూడు రోజుల్లో రూ.191 కోట్ల వసూళ్లు.. రామ్ చరణ్ 'పెద్ది' కి రూ.1000 కోట్లు సాధ్యమేనా? అసలు లెక్క
Peddi Box Office Day 3: మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కేవలం 3 రోజుల్లోనే రూ.191.07 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ ఊపుతో సినిమా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? ట్రేడ్ అనలిస్ట్‌ల మ్యాథ్స్ ఏం చెబుతోంది? అనేది ఇక్కడ చూసేయండి.
Peddi Box Office Day 3: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్‌లో, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' బాక్సాఫీస్ జోరు కొనసాగుతోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేటను ఘనంగానే ప్రారంభించింది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

మూడో రోజు కలెక్షన్ల ట్రెండ్ (Peddi Day 3 Collections)
ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం మూడవ రోజైన శనివారం (జూన్ 6) నాడు దేశవ్యాప్తంగా మొత్తం 9,019 షోల ద్వారా 'పెద్ది' చిత్రం ఏకంగా రూ.28.85 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ సినిమా సాధించిన మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.149.07 కోట్లకు, అలాగే ఇండియా టోటల్ నెట్ కలెక్షన్లు రూ.125.25 కోట్లకు చేరాయి.
వరల్డ్ వైడ్ వసూళ్లు
మరోవైపు ఓవర్సీస్ (విదేశీ మార్కెట్) లోనూ మెగా హవా నడుస్తోంది. మూడో రోజు అక్కడ రూ.8.00 కోట్ల గ్రాస్ కలెక్ట్ అవ్వడంతో, టోటల్ ఓవర్సీస్ గ్రాస్ రూ.42.00 కోట్ల మార్కును తాకింది. మొత్తంగా చూసుకుంటే, కేవలం 3 రోజుల్లోనే 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.191.07 కోట్ల టోటల్ గ్రాస్ కలెక్షన్లను సాధించి రూ. 200 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది.
అంతేకాదు, బుక్ మై షో లో కేవలం రెండున్నర రోజుల్లోనే 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడై, అత్యంత వేగంగా ఈ మైలురాయిని దాటిన చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్' సరసన పెద్ది నిలిచింది.
రూ.1000 కోట్ల టార్గెట్ సాధ్యమేనా?
మూడు రోజుల్లోనే రూ.190 కోట్లకు పైగా గ్రాస్ సాధించడంతో పెద్ది సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా అనే ఆశ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కానీ, బాక్సాఫీస్ మ్యాథ్స్, ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం 'పెద్ది' చిత్రానికి రూ.1000 కోట్ల మార్కును అందుకోవడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు ఇవే..
1. డే-ఆన్-డే డ్రాప్స్
రూ.1000 కోట్ల క్లబ్ సాధించిన బాహుబలి-2, ఆర్‌ఆర్‌ఆర్, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాల ట్రెండ్ గమనిస్తే.. మొదటి రోజు కంటే రెండు, మూడు రోజుల్లో (వీకెండ్స్) కలెక్షన్లు భారీగా పెరిగాయి లేదా స్థిరంగా ఉన్నాయి. కానీ 'పెద్ది' విషయానికి వస్తే, పెయిడ్ ప్రీమియర్స్, మొదటి రోజు (గురువారం) వచ్చిన అంచనాలతో పోలిస్తే, శుక్రవారం (రూ. 26.90 కోట్లు నెట్), శనివారం (రూ. 28.85 కోట్లు నెట్) కలెక్షన్లు కొంత తగ్గుముఖం పట్టాయి. ఇది కేవలం ఫ్యాన్ బేస్ వల్ల వచ్చే 'ఫ్రంట్ లోడెడ్' ఓపెనింగ్స్ అని స్పష్టమవుతోంది.
2. మల్టీప్లయర్ లెక్కలు
ఒక సినిమా రూ.191 కోట్ల ఫస్ట్ వీకెండ్ గ్రాస్ నుంచి రూ. 1000 కోట్ల లైఫ్‌టైమ్ మార్క్‌ను టచ్ చేయాలంటే, దానికి కనీసం 5.2x మల్టీప్లయర్ (Weekend collections కి 5 రెట్లు ఎక్కువ లాంగ్ రన్ వసూళ్లు) అవసరం. ప్రస్తుతం వస్తున్న మిక్స్‌డ్ టాక్, స్క్రీన్‌ప్లేపై ఉన్న ల్యాగ్ కామెంట్స్ వల్ల ఈ స్థాయి మల్టీప్లయర్ సాధించడం కష్టమే.
3. నార్త్ ఇండియా మార్కెట్
సినిమా దాదాపు 189 నిమిషాల (3 గంటల 9 నిమిషాలు) భారీ రన్‌టైమ్‌తో రావడం థియేటర్లలో షోల సంఖ్యపై ప్రభావం చూపుతోంది. వీటికి తోడు, నార్త్ ఇండియా (హిందీ బెల్ట్) లో రామ్ చరణ్ క్రేజ్ ఉన్నప్పటికీ, మొదటి రెండు రోజుల్లో హిందీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. మూడో రోజు హిందీ నుంచి కేవలం రూ.2.80 కోట్ల నెట్ మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో సౌత్ మార్కెట్ వసూళ్లతోనే రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు.
4. వివాదాస్పద సీన్లు
సినిమాలోని కొన్ని అశ్లీల, గ్లామరస్ సీన్లపై సోషల్ మీడియాలో, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన డైరెక్టర్ బుచ్చిబాబు.. థియేటర్లలో ఆ సీన్లను ట్రిమ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మార్పులు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి హెల్ప్ అయినప్పటికీ, సినిమా మొదటి వారంలోనే రూ.300 కోట్ల బడ్జెట్ రికవరీ వైపు వెళ్తుందా లేదా అనేదే ఇప్పుడు మేకర్స్ ముందున్న అసలు టార్గెట్.
People Also Aks (FAQ)
ప్రశ్న: 'పెద్ది' సినిమా 3 రోజుల టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్ ఎంత?
జవాబు: 'పెద్ది' చిత్రం మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.191.07 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ప్రశ్న: బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమా హిట్ ఆ లేక ఫ్లాపా?
జవాబు: సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం క్లీన్ హిట్ (Clean Hit) స్టేటస్ అందుకోవాలంటే సోమవారం (వర్కింగ్ డే) నుంచి వచ్చే వసూళ్లు అత్యంత కీలకం.
ప్రశ్న: థియేటర్లలో 'పెద్ది' సినిమా నుంచి ఏ సీన్లు తొలగించారు?
జవాబు: హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, కొన్ని గ్లామర్ సీన్స్, హావభావాలపై ప్రేక్షకుల నుంచి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో.. డైరెక్టర్ బుచ్చిబాబు ఆ భాగాలను ట్రిమ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


