Peddi: ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. సినిమాకు వచ్చిన పబ్లిక్ టాక్, పాజిటివ్ బజ్ అడ్వాన్స్ బుకింగ్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించింది.
బుక్‌మైషో క్రాష్.. రికార్డ్ లెవల్ టికెట్ సేల్స్

‘పెద్ది’ సినిమా బుక్‌మైషోలో (BookMyShow) సరికొత్త రికార్డులు సెట్ చేస్తోంది. నిన్న ఒక్కరోజే ప్లాట్‌ఫామ్ మీద గంటకు 40 వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయంటే ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా బుక్‌మైషోలో ఏకంగా 6.53 లక్షల టికెట్ సేల్స్ క్రాస్ చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా వీకెండ్స్‌లో మాత్రమే కనిపించే ఈ రేంజ్ రద్దీ.. మిడ్-వీక్‌లో రిలీజైన ఒక సినిమాకు రావడం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అరుదైన రికార్డ్ అని చెప్పాలి. దీంతో తొలిరోజు పెద్ది మూవీ రూ.100 కోట్లకుపైగా వసూళ్లతో తన బాక్సాఫీస్ వేట మొదలుపెట్టింది. చరణ్ కెరీర్లో ఇదే బెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. వీకెండ్ లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కలెక్షన్ల సునామీకి అసలు కారణాలు ఇవే..
కేవలం రామ్ చరణ్ స్టార్ డమ్ మాత్రమే కాకుండా ఈ సినిమా ఇంతలా ఆడియన్స్‌ను థియేటర్లకు లాగడానికి బలమైన కారణాలు ఉన్నాయి.
బుచ్చిబాబు టేకింగ్: 'ఉప్పెన' లాంటి డెబ్యూ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఎంచుకున్న రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ ఆడియన్స్‌కు కొత్త ఫీల్ ఇచ్చింది.
చరణ్ మేకోవర్: గ్లామరస్ రోల్స్ పక్కనపెట్టి, ఒక పారా అథ్లెట్‌గా మునుపెన్నడూ లేని విధంగా చరణ్ కనిపించడం మేజర్ ప్లస్ పాయింట్.
{{/usCountry}}చరణ్ మేకోవర్: గ్లామరస్ రోల్స్ పక్కనపెట్టి, ఒక పారా అథ్లెట్‌గా మునుపెన్నడూ లేని విధంగా చరణ్ కనిపించడం మేజర్ ప్లస్ పాయింట్.
{{/usCountry}}రెహమాన్ మ్యాజిక్: ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
వీటికి తోడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గ్లామర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం రాబోయే వీకెండ్ నాటికి (శని, ఆదివారాల్లో) కలెక్షన్ల పరంగా వరల్డ్‌వైడ్‌గా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం పక్కా అని ఇండస్ట్రీ టాక్.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
బుక్‌మైషోలో రామ్ చరణ్ 'పెద్ది' సినిమా టికెట్ సేల్స్ రికార్డ్ ఏంటి?
ఈ సినిమాకు బుక్‌మైషోలో గంటకు 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో 6.53 లక్షలకు పైగా టికెట్ సేల్స్ నమోదై సంచలనం సృష్టిస్తోంది.
'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించిన హీరోయిన్ ఎవరు?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాలో 'అచ్చియమ్మ' అనే గ్రామీణ యువతి పాత్రలో నటించి మెప్పించింది.
'పెద్ది' ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి?
సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ (Peddi public talk) రెస్పాన్స్ రావడం, అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉండటంతో ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.