...
...
Next Story

Ram Charan: సర్‌ప్రైజ్.. టాక్సిక్ మూవీ హీరోయిన్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీని ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్.. హుమాపై ప్రశంసలు

Ram Charan: రామ్ చరణ్ ఓ హిందీ సినిమాకు రివ్యూ ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది కూడా టాక్సిక్ మూవీలో నటించిన బాలీవుడ్ నటి హుమా ఖురేషీ లేటెస్ట్ మూవీ బేబీ డూ డై డూ కావడం విశేషం. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది?

Published on: Jul 7, 2026, 20:31:46 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సడెన్ గా ఓ బాలీవుడ్ సినిమాను ప్రమోట్ చేస్తూ తన ఎక్స్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ సెన్సేషన్ గా మారింది. ఎలాంటి బజ్ లేకుండా థియేటర్లలోకి వచ్చిన నియో-నాయిర్ యాక్షన్ థ్రిల్లర్ 'బేబీ డూ డై డూ' (Baby Do Die Do) మూవీ టీమ్ కు చరణ్ కంగ్రాట్స్ చెప్పడం వెనుక అసలు ప్లాన్ ఏంటని నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

చరణ్ ట్వీట్.. ఫ్యాన్స్‌లో ఆసక్తి

Ram Charan: సర్‌ప్రైజ్.. టాక్సిక్ మూవీ హీరోయిన్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీని ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్.. హుమాపై ప్రశంసలు
Ram Charan: సర్‌ప్రైజ్.. టాక్సిక్ మూవీ హీరోయిన్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీని ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్.. హుమాపై ప్రశంసలు

నిజానికి ఇండస్ట్రీలో మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలను ఎంకరేజ్ చేయడంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడూ ముందుంటాడు. భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ వచ్చినా వెంటనే సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తుంటాడు.

కానీ ఇప్పుడు సీన్ వేరు. డైరెక్టర్ నచికేత్ సమంత్ (Nackhiet Samant) తెరకెక్కించిన 'బేబీ డూ డై డూ' సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. అసలు ఈ సినిమా ఒకటుందనే విషయం కూడా చాలా మంది ఆడియన్స్ కు తెలియదు. బాక్సాఫీస్ దగ్గర చాలా లిమిటెడ్ కలెక్షన్స్ తో ఇది రన్ అవుతోంది.

టాక్సిక్ హీరోయిన్ హుమా నటించిన మూవీ

ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి (Huma Qureshi), ఆమె సోదరుడు సాకిబ్ సలీమ్ (Saqib Saleem) నటించిన ఈ మూవీ గురించి చరణ్ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా అందరి అటెన్షన్ దీనిపై పడింది.

"బేబీ డూ డై డూ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు వింటున్నాను. హుమా ఖురేషి ఎప్పటిలాగే తన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఆమె, తన బ్రదర్ సాకిబ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. మొత్తం టీమ్ కు కంగ్రాట్స్" అంటూ చరణ్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.

చరణ్‌తో నటించబోతోందా?

ఏదేమైనా చరణ్ చేసిన ఈ ఒక్క పోస్ట్ తో 'బేబీ డూ డై డూ' సినిమాకు నేషనల్ వైడ్ ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన చరణ్ సపోర్ట్ దొరకడంతో.. ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు సౌత్ జనాలు కూడా ఈ నియో-నాయిర్ థ్రిల్లర్ లో ఏముందో చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

బేబీ డూ డై డూ మూవీ విశేషాలు

* సినిమా పేరు: బేబీ డూ డై డూ

* జానర్: నియో నాయిర్ యాక్షన్ థ్రిల్లర్

* నటీనటులు: హుమా ఖురేషీ, సాఖిబ్ సలీమ్

* డైరెక్టర్: నచికేత్ సామంత్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe