Ram Charan Janmashtami: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. తమ ముగ్గురు పిల్లలతో కలిసి చరణ్-ఉపాసన దంపతులు ఇంట్లోనే భక్తిశ్రద్ధలతో ఈ పూజలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో బుల్లి పిల్లలను శ్రీకృష్ణుడు, రాధారాణి గెటప్పుల్లో అలంకరించడం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంట్లోని దేవుడి మందిరంలో సంప్రదాయ దుస్తుల్లో పిల్లలు భక్తిపారవశ్యంలో మునిగిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి.
క్లిన్ కారాతో పాటు ట్విన్స్ శివ రామ్, అన్వీర.. నెట్టింట సందడి
తమ ఇంట్లో పిల్లలతో కలిసి పూజ చేస్తున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. “కల నిజమైంది.. ఆనందంగా ఉంది.. ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే క్యాప్షన్ తో ఉపాసన ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మొదటి సంతానంగా కుమార్తె క్లిన్ కారా (Klim Kaara) జన్మించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ జంటకు కవల పిల్లలు జన్మించారు. ఒక బాబు, ఒక పాప కాగా.. వారికి శివ రామ్ (Shiva Ram), అన్వీర (Anveera) అని పేర్లు పెట్టారు.
సినిమా షూటింగ్‌లు, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ చరణ్ తన ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. ముగ్గురు పిల్లల రాకతో చిరంజీవి ఇంట పండగ కళ రెట్టింపైందని, బుల్లి కృష్ణుడి రూపంలో మెగా వారసుడు ఇంట్లో సందడి చేయడం చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూనే క్యూట్ మూమెంట్స్ షేర్
పిల్లల ప్రైవసీ విషయంలో రామ్ చరణ్, ఉపాసన చాలా కేర్ తీసుకుంటారు. మొదటి నుంచి క్లిన్ కారా ముఖం పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నట్టే, ఇప్పుడు కవల పిల్లల విషయాల్లోనూ ప్రైవసీ మెయింటెన్ చేస్తున్నారు.
{{/usCountry}}పిల్లల ప్రైవసీ విషయంలో రామ్ చరణ్, ఉపాసన చాలా కేర్ తీసుకుంటారు. మొదటి నుంచి క్లిన్ కారా ముఖం పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నట్టే, ఇప్పుడు కవల పిల్లల విషయాల్లోనూ ప్రైవసీ మెయింటెన్ చేస్తున్నారు.
{{/usCountry}}అయితే పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి స్పెషల్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో కొత్త తరం పిల్లల రాకతో అటు మెగా కాంపౌండ్‌లోనూ, ఇటు ఫ్యాన్స్‌లోనూ ఒక కొత్త ఉత్సాహం కనిపస్తోంది.
ఒకవైపు సినిమాలు.. మరోవైపు ప్రొడక్షన్, ఫ్యామిలీ బ్యాలెన్స్
గ్లోబల్ హిట్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ తన ప్రాజెక్ట్‌లను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ దెబ్బ తీసినా.. ఈ మధ్యే పెద్దితో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు రామ్ చరణ్.
ఇప్పుడిక తనకు రంగస్థలంలాంటి బ్లాక్‌బస్టర్ అందించిన సుకుమార్ తో మరో మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు. అయితే సుకుమార్ కాంబినేషన్ కావడంతో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ఇక చరణ్ ఈ మధ్యే తన చేతికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. పెద్ది షూటింగ్ సమయంలో మణికట్టుకు అయిన గాయానికి ఆయన సర్జరీ చేయించుకున్నారు.
చరణ్ ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో పండగలను జరుపుకోవడంలో చరణ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన కృష్ణాష్టమి పిక్స్ మెగా అభిమానులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అసలైన కనుల పండువగా నిలిచాయి.