RGV: ఆర్జీవీకి బిగ్ షాక్- 29 కోట్లు చెల్లించాలని నోటీసులు- ఎలాంటి సినిమాలు చేయొద్దని ఓటీటీలు, నిర్మాతలకు హెచ్చరికలు!

Ram Gopal Varma Gets Legal Notice: సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తీవ్ర న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. 2010 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఎక్లేటెంట్ ఫిల్మ్స్ ఆయనకు రూ. 29.67 కోట్ల నోటీసు పంపడమే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

Published on: Nov 1, 2026, 14:56:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ram Gopal Varma Gets 29 Cr Legal Notice: టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. 2010 నాటి ఒక పాత ఒప్పందం ప్రాతిపదికగా ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఎక్లేటెంట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్' వర్మకు భారీ లీగల్ నోటీసు జారీ చేసింది.

ఆర్జీవీకి బిగ్ షాక్- 29 కోట్లు చెల్లించాలని నోటీసులు- ఎలాంటి సినిమాలు చేయొద్దని ఓటీటీలు, నిర్మాతలకు హెచ్చరికలు!
ఆర్జీవీకి బిగ్ షాక్- 29 కోట్లు చెల్లించాలని నోటీసులు- ఎలాంటి సినిమాలు చేయొద్దని ఓటీటీలు, నిర్మాతలకు హెచ్చరికలు!

అక్టోబర్ 30 నాటికి

అసలు మొత్తంతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ. 29.67 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. అక్టోబర్ 15న ఈ నోటీసు పంపిన నిర్మాణ సంస్థ, అక్టోబర్ 30 నాటికి బకాయిలు చెల్లించాలని గడువు విధించింది.

15 ఏళ్ల నాటి ఒప్పందం.. బొంబాయి హైకోర్టు తీర్పు

ఈ వివాదానికి మూలాలు 2010 నాటి అగ్రిమెంట్‌లో ఉన్నాయి. 2010 ఏప్రిల్ 10న రామ్ గోపాల్ వర్మ, ఎక్లేటెంట్ ఫిల్మ్స్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అనంతరం 2013 ఏప్రిల్ 17న బొంబాయి హైకోర్టు కూడా ఈ ఒప్పందాన్ని సమర్థించింది.

అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఆర్జీవీ నిర్మించే, దర్శకత్వం వహించే లేదా రచయితగా వ్యవహరించే ఏ ప్రాజెక్టుకైనా ఎక్లేటెంట్ ఫిల్మ్స్ నుంచి రాతపూర్వక నిరభ్యంతర పత్రం (NOC) తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే, వర్మ ఈ నిబంధనలను పాటించకుండా పలు సినిమాలు పూర్తి చేశారని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. అందుకే ఒప్పంద ఉల్లంఘన కింద అసలు బకాయికి రూ. 11.38 కోట్ల వడ్డీని జతచేసి మొత్తంగా రూ. 29.67 కోట్లు రికవరీ చేయాలని న్యాయపోరాటానికి దిగింది.

సినీ పరిశ్రమకు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు హెచ్చరిక

కేవలం రామ్ గోపాల్ వర్మకు నోటీసు ఇవ్వడమే కాకుండా, సినీ పరిశ్రమలోని ప్రధాన భాగస్వాములకు కూడా ఎక్లేటెంట్ ఫిల్మ్స్ స్పష్టమైన సంకేతాలు పంపింది. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బ్రాడ్‌కాస్టర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎవరూ రామ్‌ గోపాల్ వర్మతో కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార లావాదేవీలు జరపవద్దని 'కంప్లీట్ సినిమా' వంటి ట్రేడ్ వర్గాల ద్వారా స్పష్టం చేసింది.

ఒప్పందంలోని లీగల్ క్లాజుల ఆధారంగా ఆయన సినిమాల ఆర్థిక ప్రయోజనాలు, ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు, థియేట్రికల్ రెవెన్యూలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఆర్జీవీ రాబోయే సినిమాల పరిస్థితేంటి?

ప్రస్తుతం రామ్‌ గోపాల్ వర్మ 'పోలీస్ కంపెనీ' అనే భారీ క్రైమ్ డ్రామాపై దృష్టి సారించారు. హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్‌కు చెందిన భూషణ్ కుమార్‌తో కలిసి వర్మ నిర్మిస్తున్నారు.

సుమారు 300 మంది గ్యాంగ్‌స్టర్ల ఎన్‌కౌంటర్ల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2027 జూన్ 4న విడుదల కానుంది. ఇందులో ఫర్దీన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, పరేష్ రావల్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు మనోజ్ బాజ్‌పాయ్‌తో 'పోలీస్ స్టేషన్ మే భూత్' అనే మరో ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది.

స్పందించని రామ్ గోపాల్ వర్మ

తాజాగా ఆర్జీవీపై వ్యక్తమవుతున్న న్యాయపరమైన చిక్కుల వల్ల ఈ సినిమాల విడుదల, డిజిటల్ రైట్స్ విక్రయంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ లీగల్ నోటీసుపై రామ్‌ గోపాల్ వర్మ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More