RGV Digital Clone: చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటా.. తన డిజిటల్ క్లోన్ ను పరిచయం చేసిన ఆర్జీవీ.. అచ్చం రాములాగే ఆన్సర్స్

RGV Digital Clone: రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఆయన ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది. తాజాగా మరో సంచలన ట్వీట్ తో ఆర్జీవీ ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నారు. తాను చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటానంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అచ్చం తనలాగే మాట్లాడే డిజిటల్ క్లోన్‌ను పరిచయం చేశారు.

Published on: Nov 24, 2026, 12:54:36 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ASK RGV Digital Clone: ఎప్పుడూ విభిన్నమైన ఆలోచనలతో, ముక్కుసూటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో అందరి దృష్టిని ఆకర్షించారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆర్జీవీ, తన డిజిటల్ రూపం గురించి చేసిన తాజా ట్వీట్ సినీ, టెక్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటా.. తన డిజిటల్ క్లోన్ ను పరిచయం చేసిన ఆర్జీవీ.. అచ్చం రాములాగే ఆన్సర్స్ (x/RGVzoomin)
చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటా.. తన డిజిటల్ క్లోన్ ను పరిచయం చేసిన ఆర్జీవీ.. అచ్చం రాములాగే ఆన్సర్స్ (x/RGVzoomin)

చనిపోయినా బతికే ఉంటా

తాను చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటానంటూ రామ్ గోపాల్ వర్మ ఇవాళ (నవంబర్ 24) ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇది నిజంగా అద్భుతమని పేర్కొంటూ, హరి గాడిపూడి అనే ఏఐ ఇంజనీర్ తన కోసం ఒక ప్రత్యేకమైన డిజిటల్ క్లోన్‌ను తయారు చేశాడని ఆయన ప్రకటించారు.

ఈ డిజిటల్ క్లోన్ కేవలం సాధారణ చాట్‌బాట్ లాంటిది కాదని, పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా దాన్ని రూపొందించారని ఆర్జీవీ వివరించారు. మరో మాటలో చెప్పాలంటే భౌతికంగా తాను ఈ లోకంలో లేకపోయినా, ఈ డిజిటల్ క్లోన్ రూపంలో ఎప్పటికీ సజీవంగానే ఉంటానని ఆర్జీవీ పేర్కొన్నారు.

రాము స్టైల్‌లోనే సమాధానం!

‘Ask RGV’ అనే పేరుతో ఉన్న ఈ ఏఐ డిజిటల్ క్లోన్ ప్రధాన ప్రత్యేకత గురించి ఆర్జీవీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ అంశం పైనైనా ఈ డిజిటల్ క్లోన్‌ను ప్రశ్నిస్తే అది వెంటనే స్పందిస్తుందని తెలిపారు. పైగా ఆ సమాధానం సాధారణంగా కాకుండా, అచ్చం రామ్ గోపాల్ వర్మ మాట్లాడే శైలిలో, ఆయన నమ్మకాలు, ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేశారు.

సినిమాలు, రాజకీయాలు, జీవిత తత్వం, సమాజం.. ఇలా ఏ విషయం గురించైనా ఆర్జీవీ తనదైన విలక్షణమైన దృక్కోణంతో స్పందిస్తుంటారు. ఇప్పుడు అదే ఫిలాసఫీ, అదే ధోరణితో ఈ ఏఐ క్లోన్ సమాధానాలు ఇస్తుంది.

నెట్టింట వైరల్

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్జీవీ అసలు కామెంట్లకే తట్టుకోవడం కష్టంగా ఉంటే, ఇక ఆయన ఏఐ డిజిటల్ క్లోన్ ఇచ్చే సమాధానాలు ఏ స్థాయిలో ఉంటాయోనంటూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ఆర్జీవీ డిజిటల్ క్లోన్ గా డిఫరెంట్ టైప్స్ లో ప్రశ్నలు అడుగుతున్నారు.

మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత వేగంగా కొత్త పుంతలు తొక్కుతుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని టెక్ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి హరి గాడిపూడి రూపొందించిన ఈ డిజిటల్ క్లోన్‌తో ఆర్జీవీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.