ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌లకు బాగా నచ్చిన మూవీ.. ఎవర్‌గ్రీన్ శివ రీరిలీజ్ ట్రైలర్ చూశారా?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ మూవీ అంటూ అల్లు అర్జున్.. ఈ సినిమా ముందు, తర్వాత అంటూ రాజమౌళి.. తనపై చాలా ప్రభావం చూపిన మూవీ అంటూ ప్రభాస్ ఆకాశానికెత్తుతూ రామ్ గోపాల్ వర్మ, నాగార్జున శివ మూవీ రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.

Nov 4, 2025, 20:10:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అటు అభిమానులు, ఇటు సెలబ్రిటీలను ఒకే స్థాయిలో ఉర్రూతలూగించి, ఇండియన్ సినిమా దశ, దిశనే మార్చేసిన మూవీగా నిలిచింది శివ. రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్, నాగార్జున యాక్షన్ తో ఈ మూవీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడీ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రీరిలీజ్ కానుంది. దానికి ముందు మంగళవారం (నవంబర్ 4) ట్రైలర్ రిలీజ్ చేశారు.

ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌లకు బాగా నచ్చిన మూవీ.. ఎవర్‌గ్రీన్ శివ రీరిలీజ్ ట్రైలర్ చూశారా?
ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌లకు బాగా నచ్చిన మూవీ.. ఎవర్‌గ్రీన్ శివ రీరిలీజ్ ట్రైలర్ చూశారా?

శివ రీరిలీజ్ ట్రైలర్

రామ్‌గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ శివ. 1990లో రిలీజైన ఈ మూవీని 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా.. అందులో ఈ సినిమాపై రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాని, మణిరత్నం, చిరంజీవిలాంటి వాళ్లు తమ అభిప్రాయాలు చెప్పడం చూడొచ్చు.

శివ మూవీకి ముందు, ఆ తర్వాత అనొచ్చు అంటూ రాజమౌళి అన్నాడు. ఈ సినిమాను ఓ పది సార్లు చూసుంటానని మహేష్ బాబు.. ఈ మూవీ తనపై ఎంతగానో ప్రభావం చూపిందని ప్రభాస్.. మోస్ట్ ఐకానిక్ మూవీ అని అల్లు అర్జున్.. ఇదో చిరస్మరణీయమైన మూవీ అని చిరంజీవిలాంటి వాళ్లు శివ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆ తర్వాత మూవీ ట్రైలర్ చూపించారు. ఇందులో ఆ మూవీలోని కొన్ని ఐకానిక్ సీన్లను చూడొచ్చు.

శివ మూవీ గురించి..

శివ మూవీ డిసెంబర్ 7, 1990లో రిలీజైంది. ఇందులో నాగార్జున, అమల లీడ్ రోల్స్ లో నటించగా.. చిన్నా, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్ల భరణిలాంటి వాళ్లు కూడా నటించారు. స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ తిరిగే సినిమా ఇది. ఇందులో శివ పాత్రలో నాగార్జున, ఆశ పాత్రలో అమల నటించారు. ఈ సినిమాలో సైకిల్ చెయిన్ సీన్ ఎవర్‌గ్రీన్ గా నిలిచింది.

ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నింటికీ మించి రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్, టేకింగ్ ఇండియన్ సినిమాలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. వర్మను టాప్ డైరెక్టర్లలో ఒకడిగా చేసింది. తొలి సినిమాతోనే అతని రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు క్షణక్షణం, గోవిందా గోవిందా, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి సినిమాలతో

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More