Ram Gopal Varma: ఆ సినిమా తీసిన అపార్ట్‌మెంట్ 24 ఏళ్లుగా ఖాళీగానే ఉంది.. ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్ చూసే ఆ హీరోయిన్‌కు ఛాన్స్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ 2002లో తీసిన భూత్ మూవీ ఎంతలా భయపెట్టిందో మనకు తెలుసు. ఆ సినిమా ఏ అపార్ట్‌మెంట్ లో తీశారో ఇప్పటికీ అది ఖాళీగానే ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ వెల్లడించాడు. అంతేకాదు ఆ మూవీలో ఊర్మిళకు ఛాన్స్ ఇవ్వడానికి కారణమేంటో కూడా చెప్పాడు.

Published on: Mar 16, 2026, 08:50:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తీసిన హారర్ క్లాసిక్ 'భూత్' (Bhoot) విడుదలై రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ ఆ సినిమా పేరు చెబితే ప్రేక్షకుల్లో ఒక రకమైన వణుకు పుడుతుంది. తాజాగా ముంబైలో జరిగిన ‘రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో ఈ మూవీ గురించి వర్మ కొన్ని ఆసక్తికరమైన, భయానకమైన విషయాలను పంచుకున్నాడు. అవేంటో చూడండి.

Ram Gopal Varma: ఆ సినిమా తీసిన అపార్ట్‌మెంట్ 24 ఏళ్లుగా ఖాళీగానే ఉంది.. ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్ చూసే ఆ హీరోయిన్‌కు ఛాన్స్
Ram Gopal Varma: ఆ సినిమా తీసిన అపార్ట్‌మెంట్ 24 ఏళ్లుగా ఖాళీగానే ఉంది.. ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్ చూసే ఆ హీరోయిన్‌కు ఛాన్స్

లోఖండ్‌వాలా ప్లాట్.. ఇప్పటికీ మిస్టరీనే!

ముంబై నేపథ్యంగా సాగే హారర్ థ్రిల్లర్ మూవీ భూత్ ను ఏదో పాత బంగళాలో కాకుండా, ఒక సాధారణ అపార్ట్‌మెంట్‌లో చిత్రీకరిస్తేనే ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతుందని రామ్ గోపాల్ వర్మ భావించాడు. ఈ క్రమంలో ముంబైలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న ఒక ఫ్లాట్ లో కేవలం 30 రోజుల్లోనే మెజారిటీ షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఆ ప్లాట్ గురించి వర్మ చెప్పిన ఒక విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

"మేము ఆ సినిమాను 2002లో షూట్ చేశాం. సినిమా విడుదలయ్యాక ఆ అపార్ట్‌మెంట్ ప్లాట్ చాలా ఫేమస్ అయ్యింది. కానీ విచిత్రం ఏమిటంటే.. షూటింగ్ ముగిసినప్పటి నుండి ఇప్పటివరకు అంటే దాదాపు 24 ఏళ్లుగా ఆ ప్లాట్ ఖాళీగానే ఉంది. అందులో ఉండటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. లోఖండ్‌వాలాలోని ఆ బిల్డింగ్ పేరు నాకు గుర్తు లేదు. కానీ ఇప్పటికీ అది అలాగే ఉంది" అని వర్మ వివరించాడు.

ఊర్మిళను ఎంపిక చేయడానికి కారణం అదే

ఈ సినిమాలో దెయ్యం పట్టిన మహిళగా ఊర్మిళ మతోండ్కర్ నటన అద్భుతం. ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేయడం వెనుక ఉన్న కారణాన్ని వర్మ వెల్లడించాడు. 'రంగీలా' సినిమాలోని 'హై రామా' పాటలో ఊర్మిళ ఎరుపు రంగు డ్రెస్ వేసుకుని జాకీ ష్రాఫ్ వైపు ఒక రకమైన ఇంటెన్సిటీతో చూస్తుంది. ఆ క్లోజప్ షాట్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ వర్మ మెదడులో బలంగా నాటుకుపోయింది. ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్ చూశాకే, ఊర్మిళ ఈ హారర్ పాత్రను పండించగలదని ఆయన ఫిక్స్ అయ్యాడట.

'భూత్' విశేషాలు

భూత్ మూవీ 2002లో షూటింగ్ జరుపుకుంది. ఇందులో అజయ్ దేవగణ్, ఊర్మిళ మతోండ్కర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్, తనూజ ఇతర కీలక పాత్రలు పోషించారు.

2003లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, ఊర్మిళకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. 2012లో మనీషా కోయిరాల ప్రధాన పాత్రలో 'భూత్ రిటర్న్స్' పేరుతో సీక్వెల్ కూడా వచ్చింది.

హారర్ సినిమాలకు పెట్టింది పేరైన ఆర్జీవీ.. త్వరలో తన మరో హిట్ ఫ్రాంచైజీ ‘సర్కార్ 4’ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మళ్లీ ఈ పొలిటికల్ క్రైమ్ డ్రామాలో కనిపించబోతున్నారు. దీంతోపాటు ది సిండికేట్ మరో పాన్ ఇండియా లెవెల్ మూవీని కూడా ఆర్జీవీ తీయనున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More