ఇండియన్ సినిమా టర్నింగ్ పాయింట్ ఇది.. మూవీ చూసిన తర్వాత మారిన మనషులమవుతాం.. ధురంధర్ సినిమాకు రామ్‌గోపాల్ వర్మ రివ్యూ
ధురంధర్ సినిమాకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ చూస్తే వెంటనే వెళ్లి సినిమా చూసేస్తారేమో. ఆ స్థాయిలో ఈ మూవీని, దీనిని తీసిన డైరెక్టర్ ను ఆర్జీవీ ఆకాశానికెత్తాడు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ ధురంధర్ సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది సాధారణ సినిమా కాదని, భారతీయ సినిమా గమనాన్నే మార్చేసే అద్భుతమని వర్ణిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇండియన్ సినిమాను మార్చే మూవీ
ధురంధర్ సినిమాపై ఇప్పటికే చాలా మంది సెల్రబిటీలు ప్రశంసలు కురిపించారు. అయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం శుక్రవారం (డిసెంబర్ 19) ఉదయం తన ఎక్స్‌లో ఓ సుదీర్ఘ రివ్యూ ఇస్తూ.. మూవీని ఆకాశానికెత్తాడు. ఇది ఇండియన్ సినిమాకు ఓ టర్నింగ్ పాయింట్ అని అతడు అనడం విశేషం.
“నార్త్ అయినా, సౌత్ అయినా సరే.. ఆదిత్య ధర్ ఒంటిచేత్తో భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 'ధురంధర్' అనేది జస్ట్ ఒక సినిమా కాదు.. అది సినిమా ప్రమాణాలను పెంచిన ఒక భారీ ముందడుగు. ఈ సినిమాలో ఉన్నది కేవలం భారీతనం మాత్రమే కాదు.. మనమెప్పుడూ చూడని ఒక కొత్త విజన్ ఉంది. ఆదిత్య ధర్ ఇక్కడ సీన్లను డైరెక్ట్ చేయలేదు.. పాత్రల మైండ్ సెట్‌ని, మన మైండ్ సెట్‌ని కూడా ఇంజనీరింగ్ చేశారు. ఈ సినిమా మన అటెన్షన్‌ని అడగదు.. డిమాండ్ చేసి మరీ లాక్కుంటుంది. ఫస్ట్ షాట్ నుంచే ఏదో జరగబోతోందనే ఫీలింగ్ మొదలవుతుంది. మనం కేవలం ప్రేక్షకుల్లా కాకుండా, అందులో జరుగుతున్న దాంట్లో భాగమైపోతాం” అని ఆర్జీవీ అన్నాడు.
ప్రతి సీన్‌లో ఓ టెన్షన్
అతడు తన రివ్యూను ఇంకా కొనసాగిస్తూ.. “ఈ సినిమా ఎక్కడా సాఫ్ట్ గా ఉండదు. రైటింగ్ చాలా పదునుగా ఉంటుంది. ఇందులో వినిపించే 'నిశ్శబ్దం' కూడా పెద్ద బాంబులా పేలుతుంది. కథ చెప్పడంలో పవర్ అంటే గట్టిగా అరవడం కాదని, ప్రెజర్ బిల్డ్ చేయడమని డైరెక్టర్‌కి బాగా తెలుసు. ఒక స్ప్రింగ్‌ని టైట్ చేస్తుంటే ఎప్పుడు తెగుతుందో తెలీని టెన్షన్ ప్రతి సీన్లో ఉంటుంది. అది పేలినప్పుడు ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు” అని చెప్పాడు.
ఆడియెన్స్ చాలా తెలివైన వాళ్లు
ఆదిత్య ధర్ ఈ సినిమాను తీసిన విధానం చూస్తే అతడు ఆడియెన్స్ చాలా తెలివైన వాళ్లు అని నమ్మినట్లు అనిపిస్తోందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డాడు. “ఇందులో నటన మనకు నచ్చడం కోసం ఉండదు.. థియేటర్ దాటి వచ్చాక కూడా మనల్ని వెంటాడుతుంది. పాత్రల గతం ఏంటో డైరెక్టర్ స్పూన్ ఫీడింగ్ చేయరు.. వాళ్ళ గాయాలను చూసి మనమే అర్థం చేసుకోవాలని ఆడియన్స్ ని నమ్మారు. సాధారణంగా డైరెక్టర్లు ఆడియన్స్ కి ఏం అర్థం కాదని భావిస్తారు.. కానీ ఆదిత్య ధర్ మాత్రం ఆడియన్స్ ఇంటెలిజెంట్ అని నమ్మి, గౌరవించి తీశారు" అని ఆర్జీవీ అన్నాడు.
టెక్నికల్ బ్రిలియన్స్
ఇక ఈ సినిమాలో టెక్నీషియన్స్ పని తీరు గురించి కూడా ఆర్జీవీ మాట్లాడాడు. “టెక్నికల్ గా చూస్తే.. మెయిన్ స్ట్రీమ్ సినిమా లెక్కలన్నీ ఈ సినిమా మార్చేసింది. సీన్లను అందంగా చూపించడానికి కాదు.. మనల్ని వెంటాడటానికి వాడారు. ఏదో చూస్తున్నట్టు కాకుండా.. వేటాడుతున్నట్టు కెమెరా తిరుగుతుంది. యాక్షన్ విషయానికి వస్తే చప్పట్ల కోసం కొరియోగ్రఫీ చేసినట్టు ఉండదు.. నిజంగా వయొలెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందో అలా రియలిస్టిక్ గా చూపించారు” అని వర్మ అన్నాడు.
అన్నిటికంటే ముఖ్యంగా.. ఈ సినిమా తీయాలన్న ఉద్దేశమే గొప్పదని, ట్రెండ్స్ ఫాలో అవ్వడానికో, డబ్బుల కోసమో తీసింది కాదని చెప్పాడు. మనం హాలీవుడ్ ని కాపీ కొట్టక్కర్లేదు, మన నేటివిటీతోనే ఇంటర్నేషనల్ రేంజ్ సినిమా తీయొచ్చని ఆదిత్య ధర్ నిరూపించాడని వర్మ అభిప్రాయపడ్డాడు.
టైటిల్స్ పడుతున్నప్పుడు.. ఏదో ఎంటర్టైన్ అయ్యాం అనిపించదు.. మనం మారిపోయాం అనిపిస్తుంది.. మనలాంటి ఫిల్మ్ మేకర్స్ అందరూ నిలబడే పునాదిని మార్చేసే సత్తా ఉన్న డైరెక్టర్ ఆదిత్య ధర్ అంటూ అతన్ని రామ్ గోపాల్ వర్మ ఆకాశానికెత్తాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


