ఏ మగ డైరెక్టర్ ఆమె ముందు నిలవలేడు.. అసలు ఆమె ఇలా తీసిందంటే నమ్మలేకపోతున్నాను: రామ్ గోపాల్ వర్మ టాక్సిక్ టీజర్ రివ్యూ
యశ్ టాక్సిక్ మూవీ టీజర్ గురించి రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గీతూ మోహన్ దాస్ అనే ఓ లేడీ డైరెక్టర్ ఇలా తీసిందంటే తనకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని అతడు అనడం విశేషం. ఏ మగ డైరెక్టర్ ఆమె ముందు నిలవలేడని అన్నాడు.
రాకింగ్ స్టార్ యశ్ (Yash) పుట్టినరోజు (జనవరి 8) సందర్భంగా రిలీజ్ అయిన 'టాక్సిక్' మూవీ టీజర్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. కారులో రొమాన్స్, చేతిలో గన్, నోట్లో సిగరెట్‌తో యశ్ చూపించిన స్వాగ్ మామూలుగా లేదు. అయితే ఈ టీజర్ చూసిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) షాక్ అయ్యాడు. ఈ సినిమా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ టేకింగ్ చూసి.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. "మగ డైరెక్టర్లు కూడా ఆమె ముందు పనికిరారు" అంటూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

టాక్సిక్ టీజర్‌పై ఆర్జీవీ ఇలా..
యశ్ 19వ సినిమాగా వస్తున్న 'టాక్సిక్' టీజర్ సోషల్ మీడియాను రెండుగా డివైడ్ చేసింది. కొందరు ఇది టూ మచ్ వైలెన్స్ అంటుంటే, ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే టీజర్ ఉందని చాలా మంది అంటున్నారు.
అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ మాత్రం వైరల్ అవుతోంది. అతడు డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఫోటోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. "యశ్ 'టాక్సిక్' టీజర్ చూశాక నాకు ఎలాంటి సందేహం లేదు.. గీతూ మోహన్‌దాస్ ‘ఉమెన్ ఎంపవర్‌మెంట్’కు నిజమైన నిదర్శనం. ఈమెతో పోలిస్తే ఏ మగ డైరెక్టర్ కూడా అంత మగాడు కాదు. ఆమె ఈ రేంజ్ వైలెన్స్ ఎలా తీసిందో నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
టాక్సిక్ టీజర్‌లో ఏముంది?
యశ్ నటించిన టాక్సిక్ మూవీ టీజర్ ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఒక శ్మశానంలో అంత్యక్రియలు జరుగుతుండగా.. అక్కడికి ఒక కారు వస్తుంది. కారు లోపల యశ్ ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు.
కారు దిగి, షర్ట్ లేకుండా కోటు వేసుకుని.. నోట్లో సిగరెట్, చేతిలో గన్ పట్టుకుని శ్మశానంలో ఉన్న రౌడీలను కాల్చి పారేస్తాడు. చివర్లో యశ్ చెప్పే "డాడీస్ హోమ్" (Daddy’s home) అనే డైలాగ్ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది.
టాక్సిక్ సినిమా విశేషాలు
గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ వస్తోంది. ఇందులో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి వాళ్లు నటిస్తున్నారు. టీజర్‌లో యశ్ తో ఉన్నది ఎవరనేది సస్పెన్స్.
గతంలో 'లయర్స్ డైస్', నివిన్ పాలీతో 'మూతోన్' వంటి క్లాస్ సినిమాలు తీసిన గీతూ మోహన్‌దాస్.. యశ్ తో ఇలాంటి మాస్ గ్యాంగ్‌స్టర్ సినిమా తీయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ టాక్సిక్ మార్చి 19న థియేటర్లలోకి రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


