Ram Gopal Varma Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ 'ది ఎంప్రెస్' (The Empress) ప్రకటన తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. శ్రీదేవితో తనకు ఉన్న అనుబంధం, ఆమె నటన వెనుకున్న మ్యాజిక్ గురించి మాట్లాడుతూ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
"చనిపోయిన వారి గురించి నేను అస్సలు ఆలోచించను!"

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల శ్రీదేవి జయంతి సందర్భంగా ధీరజ్ యు. కుమార్ రాసిన 'ది ఎంప్రెస్' పుస్తకం కవర్ పేజీని లాంచ్ చేశారు. ఈ పుస్తకంలో రామ్ గోపాల్ వర్మ ఒక ప్రత్యేకమైన చాప్టర్ రాశారు. అయితే శ్రీదేవి జయంతి రోజున ఆమెను గుర్తు చేసుకున్నారా అని అడిగితే ఆర్జీవీ తనదైన శైలిలో మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
"నేను చనిపోయిన వారి గురించి ఎప్పుడూ ఆలోచించను. ఒకసారి వారు వెళ్లిపోతే ఇక నా లైఫ్ నుంచి వెళ్లిపోయినట్లే. చనిపోయిన వారిని తలచుకోవడం కంటే నా వర్క్ పైన ఫోకస్ పెట్టడమే నాకు ఇష్టం. ప్రస్తుతం నేను హర్షవర్ధన్ రాణెతో 'పోలీస్ కంపెనీ' షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాను" అని వర్మ స్పష్టం చేశారు.
'ది ఎంప్రెస్' కాదు.. 'స్క్రీన్ క్వీన్' అయితే బాగుండేది!
ఈ బయోపిక్ పేరు 'ది ఎంప్రెస్' అని తనకు మొదట్లో తెలియదని వర్మ చెప్పారు. శ్రీదేవికి 'స్క్రీన్ క్వీన్' అనే టైటిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని, ఆమె తర్వాతే ఎవరైనా అని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకంలో తను రాసిన చాప్టర్ అందరి కంటే బెస్ట్ అని చాలా మంది చెబుతున్నారని వర్మ కామెంట్ చేశారు.
శ్రీదేవి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, తెరపై ఆమె చేసిన మ్యాజిక్ ఏంటో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని ఆర్జీవీ అన్నారు. ముఖ్యంగా 'మిస్టర్ ఇండియా' సినిమాలో చార్లీ చాప్లిన్ సీక్వెన్స్ వెనుక ఉన్న నటన, క్రాఫ్ట్ ఊహించడం ఎవరి వల్ల కాదని, తాను డైరెక్ట్ చేసిన యాక్టర్స్‌లో ఆమె నంబర్ వన్ అని కొనియాడారు.
'క్షణ క్షణం' అనుభవాలు.. 7 నక్షత్రాల హోటల్ లాంటిది
{{/usCountry}}శ్రీదేవి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, తెరపై ఆమె చేసిన మ్యాజిక్ ఏంటో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని ఆర్జీవీ అన్నారు. ముఖ్యంగా 'మిస్టర్ ఇండియా' సినిమాలో చార్లీ చాప్లిన్ సీక్వెన్స్ వెనుక ఉన్న నటన, క్రాఫ్ట్ ఊహించడం ఎవరి వల్ల కాదని, తాను డైరెక్ట్ చేసిన యాక్టర్స్‌లో ఆమె నంబర్ వన్ అని కొనియాడారు.
'క్షణ క్షణం' అనుభవాలు.. 7 నక్షత్రాల హోటల్ లాంటిది
{{/usCountry}}శ్రీదేవితో కలిసి వర్మ తీసిన క్లాసిక్ థ్రిల్లర్ 'క్షణ క్షణం' ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. "నాకు ఆమెను ఒకే ఒక్కసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ అది నాకు చాలు. ప్రతి సీన్‌కు ఆమె దగ్గర 15 నుంచి 20 రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఉండేవి. ఆమెతో వర్క్ చేయడం అంటే 7-స్టార్ హోటల్‌లో స్టే చేసినట్లే ఉంటుంది" అని వర్మ చెప్పారు.
శ్రీదేవిని మొదటిసారి చెన్నైలోని ఆమె ఇంట్లో కలిసిన క్షణాలను వర్మ రివీల్ చేశారు. "ఆమె నన్ను కలవడానికి గదిలోకి రావడం, ఫ్లైట్ టైమ్ అవుతోందని హడావుడిగా ప్యాకింగ్ చేసుకుంటూ రూమ్‌లోకి వచ్చి వెళ్లడం నాకింకా గుర్తుంది. ఆమె ప్రవేశించిన ప్రతిసారి ఒక చల్లటి తాజా గాలి వేగంగా వచ్చినట్లు అనిపించేది. ఒక్కసారైనా ఆమె మళ్లీ ఈ భూమి మీదకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అప్పుడే మానవాళికి ఆమె నిజంగా ఈ లోకంలో ఉండిందనే విషయం నమ్మకం కుదురుతుంది" అని ఆర్జీవీ ఎమోషనల్ అయ్యారు.
రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్, శ్రీదేవిపై ఆయనకున్న ఆరాధన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.