Ram Pothineni Dharman: అఫీషియల్.. కోలీవుడ్‌లోకి రామ్ పోతినేని గ్రాండ్ ఎంట్రీ.. రజినీకాంత్ ధ‌ర్మ‌న్ నుంచి వీడియో వైర‌ల్‌!

Ram Pothineni Dharman: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కోలీవుడ్ ఎంట్రీపై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించేశారు. రజినీకాంత్ తో రామ్ పోతినేని స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ మూవీని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.

Published on: Nov 8, 2026, 18:36:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ram Pothineni Dharman: బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించారు. టాలెంటెడ్ యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో 'ధర్మన్' అనే పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో రజనీకాంత్ నటిస్తున్నారు.

అఫీషియల్.. కోలీవుడ్‌లోకి రామ్ పోతినేని గ్రాండ్ ఎంట్రీ.. రజినీకాంత్ ధ‌ర్మ‌న్ నుంచి వీడియో వైర‌ల్‌! (x)
అఫీషియల్.. కోలీవుడ్‌లోకి రామ్ పోతినేని గ్రాండ్ ఎంట్రీ.. రజినీకాంత్ ధ‌ర్మ‌న్ నుంచి వీడియో వైర‌ల్‌! (x)

కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్

క్రేజీ ప్రాజెక్టు ధర్మన్ లో తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని భాగం కావడం విశేషం. ఈ చిత్రంతోనే రామ్ తమిళ చిత్రసీమకు (Kollywood) అధికారికంగా పరిచయం కానున్నారు. రజినీకాంత్ లాంటి లెజెండరీ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం రామ్ కెరీర్ లో అతిపెద్ద మైలురాయి అని చెప్పవచ్చు. రజనీకి సరిసమానంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలో రామ్ కనిపించనున్నారు.

వైరల్ వీడియో

ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ చిత్ర బృందం ఒక సాలిడ్ ప్రొమోను కూడా రిలీజ్ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ (నవంబర్ 8) వీడియోను వదిలింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ప్రొమోలో రామ్ లుక్, యాటిట్యూడ్ చూస్తుంటే ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం ఖాయం.

కమల్ హాసన్ నిర్మాణంలో

'ధర్మన్' సినిమాను మరో దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసింది. టర్మరిక్ మీడియా, ఆర్. మహేంద్రన్ లతో కలిసి ఆయన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కమల్ హాసన్ లాంటి లెజెండ్ ప్రొడక్షన్ అంటే క్వాలిటీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కళ్లు చెదిరేలా ఉంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, టాలీవుడ్ క్యూట్ సెన్సేషన్ శ్రీలీల, గ్లామర్ బ్యూటీ రాశీ ఖన్నా, సీనియర్ నటి సిమ్రాన్, ప్రముఖ కమెడియన్ యోగి బాబు వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో సందడి చేయనున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్

రజనీకాంత్ సినిమా అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM) థియేటర్ల స్పీకర్లు పగిలిపోయేలా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. దానికి తగ్గట్టుగానే 'ధర్మన్' చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జైలర్ లాంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్ తర్వాత రజనీకాంత్, అనిరుధ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియో పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే అనిరుధ్ ఈ మూవీ కోసం అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసినట్లు టాక్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More