Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 60 అడుగుల కటౌట్.. రజినీకాంత్ 'ధర్మన్'లోనూ ఛాన్స్!
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ మామూలుగా లేదు. ఒకవైపు ‘మూకుతి అమ్మన్ 2’ సినిమా కోసం చెన్నైలో ఏర్పాటు చేసిన 60 అడుగుల భారీ కటౌట్ తో నయన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన 'ధర్మన్' చిత్రంలో నటించే ఛాన్స్ కూడా పట్టేశారు.
Nayanthara: నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న భక్తిరస ఫాంటసీ చిత్రం 'మూకుతి అమ్మన్ 2'. ఈ సినిమా నవంబర్ 6, 2026న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమాను 'మహాశక్తి' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ నేపథ్యంలో నయనతార క్రేజ్ ను చాటేలా ఏర్పాటు చేసిన కటౌట్ వైరల్ గా మారింది.

ఇండియన్ సినీ చరిత్రలో తొలిసారి
నయనతార స్టార్ డమ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి చెన్నైలోని చెంబరక్కంలో ఉన్న వేల్స్ థియేటర్స్ వద్ద ఏర్పాటు చేసిన కటౌట్ ఒక ఉదాహరణ. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నయన్ కు ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. భారతదేశ సినీ చరిత్రలో ఒక హీరోయిన్ కు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
సోషల్ మీడియాలో వైరల్
సాధారణంగా ఇలాంటి భారీ కటౌట్ కల్చర్ కేవలం బడా హీరోల సినిమాలకు మాత్రమే చూస్తుంటాం. కానీ ఒక హీరోయిన్ కు ఈ రేంజ్ లో కటౌట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ అరుదైన ఫీట్ పై నటి రెజీనా కసాండ్రా కూడా స్పందిస్తూ నయనతారపై ప్రశంసల వర్షం కురిపించారు. హీరోలతో సమానంగా నయనతార సాధించిన ఈ ఘనత ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
ధర్మన్ సినిమాలో బంపర్ ఆఫర్
మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్విత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధర్మన్' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశారు నయనతార. జైలర్ 2 సూపర్ హిట్ తర్వాత రజినీకాంత్ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను లోకనాయకుడు కమల్ హాసన్ (రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్) నిర్మిస్తుండటం విశేషం.
ఈ క్రేజీ ప్రాజెక్టులో నయన్ లీడ్ రోల్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రజినీకాంత్, నయనతార కాంబినేషన్ లో వస్తున్న ఆరో సినిమా ఇది. చంద్రముఖి, దర్బార్ వంటి చిత్రాల తర్వాత వీరు మరోసారి కలిసి నటిస్తుండటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పొంగల్ 2027 టార్గెట్
రజినీకాంత్ 'ధర్మన్' చిత్రం ఒక భారీ మల్టీస్టారర్ గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల, రాశీ ఖన్నా, సిమ్రాన్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ భారీ చిత్రాన్ని 2027 పొంగల్ (సంక్రాంతి) కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి నయనతార అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ, ఇటు బడా హీరోల కమర్షియల్ చిత్రాలతోనూ దూసుకెళ్తూ బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


