Ramayana Records: 9 రోజుల్లోనే కల్కి 2898 ఏడీ, పఠాన్ బాక్సాఫీస్ రికార్డులు తుడిచి పెట్టేసిన రామాయణ.. జోరు మామూలుగా లేదు

Ramayana Records: ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డుల లెక్కలను 'రామాయణం: పార్ట్ 1' అక్షరాలా తిరగరాస్తోంది. కేవలం 9 రోజుల్లోనే రూ. 1,110.70 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. 'కల్కి 2898 AD' (రూ. 1,042.25 కోట్లు), 'పఠాన్' (రూ. 1,055 కోట్లు) వసూళ్లను కేవలం 9 రోజుల్లోనే అధిగమించింది.

Published on: Nov 14, 2026, 09:30:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana Records: రామాయణం మూవీ బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా 9 రోజుల్లోనే కల్కి, పఠాన్ లాంటి సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ రూ.1100 కోట్ల మార్క్ ను కూడా దాటేసింది.

Ramayana Records: 9 రోజుల్లోనే కల్కి 2898 ఏడీ, పఠాన్ బాక్సాఫీస్ రికార్డులు తుడిచి పెట్టేసిన రామాయణ.. జోరు మామూలుగా లేదు (Screengrabs from YouTube)
Ramayana Records: 9 రోజుల్లోనే కల్కి 2898 ఏడీ, పఠాన్ బాక్సాఫీస్ రికార్డులు తుడిచి పెట్టేసిన రామాయణ.. జోరు మామూలుగా లేదు (Screengrabs from YouTube)

రామాయణ బాక్సాఫీస్ రికార్డులు ఇలా..

ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ సాక్నిల్క్ (Sacnilk) రిపోర్టు ప్రకారం.. రెండో శుక్రవారం (నవంబర్ 13 - 9వ రోజు) 'రామాయణం' చిత్రం భారత్‌లో రూ. 47.85 కోట్ల నెట్ (రూ. 57.15 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. గురువారం నాటి రూ. 53.50 కోట్లతో పోలిస్తే ఐదు భాషల్లో కలిపి కేవలం 10.6 శాతం స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదైంది. విదేశాల్లో 9వ రోజు మరో రూ. 25 కోట్లు రాబట్టింది.

భాషల వారీగా 9వ రోజు కలెక్షన్లు, షోల వివరాలు ఇలా ఉన్నాయి..

హిందీ: 18,377 షోలలో 29.9% ఆక్యుపెన్సీతో రూ. 36.25 కోట్ల నెట్ వసూలు చేసింది (దేశీయ వసూళ్లలో 75.8% వాటా).

మలయాళం: కేవలం 1,070 షోలలోనే ఏకంగా 60.1% అత్యధిక ఆక్యుపెన్సీ నమోదు చేసి రూ. 3.25 కోట్ల నెట్ సాధించింది.

కన్నడ: యశ్ క్రేజ్‌తో 850 షోలలో 35.7% ఆక్యుపెన్సీతో రూ. 3 కోట్లు రాబట్టింది.

తమిళం: 1,164 షోలలో 40.7% ఆక్యుపెన్సీతో రూ. 2.75 కోట్లు వసూలు చేసింది.

తెలుగు: 1,532 షోలలో 30% ఆక్యుపెన్సీతో రూ. 2.60 కోట్ల నెట్ రాబట్టింది.

మొత్తంగా 9వ రోజు ఐదు భాషల్లో కలిపి 22,993 షోలు ప్రదర్శితం కాగా, సగటున 32.1% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇప్పటివరకు భారత్‌లో మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 612.45 కోట్లకు (గ్రాస్ రూ. 732.20 కోట్లు), ఓవర్సీస్ గ్రాస్ రూ. 378.50 కోట్లకు చేరుకున్నాయి.

9 రోజుల కలెక్షన్ల ప్రయాణం: సోమవారం రూ. 107.50 కోట్ల సునామీ!

గురువారం (నవంబర్ 5) విడుదలైన ఈ చిత్రం మొదటి వారం (8 రోజుల్లో) భారత్‌లో రూ. 564.60 కోట్ల నెట్ వసూలు చేసింది. తొలి రోజు రూ. 64.85 కోట్లతో మొదలైన ఈ జైత్రయాత్ర.. మొదటి సోమవారం ఏకంగా రూ. 107.50 కోట్ల నెట్ వసూలు చేసి గరిష్ట స్థాయికి చేరింది.

ఆ తర్వాత మంగళవారం రూ. 94.10 కోట్లు, బుధవారం రూ. 70.65 కోట్లు, గురువారం రూ. 53.50 కోట్లు సాధించింది. విశేషమేమిటంటే మొదటి శుక్రవారం (రూ. 48.05 కోట్లు) వసూళ్లకు, రెండో శుక్రవారం (రూ. 47.85 కోట్లు) వసూళ్లకు మధ్య కేవలం రూ. 20 లక్షలు మాత్రమే తేడా ఉండటం సినిమాకున్న స్ట్రాంగ్ హోల్డ్‌కు నిదర్శనం.

7-10 వారాల రికార్డులు 9 రోజుల్లోనే ఖతం

'కల్కి 2898 AD', 'పఠాన్' చిత్రాలు తమ లైఫ్ టైమ్ వసూళ్లను సాధించడానికి 7 నుండి 10 వారాల సమయం తీసుకుంటే, 'రామాయణం' ఆ మార్కును కేవలం 9 రోజుల్లోనే దాటేసింది. ప్రస్తుతం రూ. 1,000 కోట్ల క్లబ్‌లో ఉన్న 11 భారతీయ చిత్రాల జాబితాలో 'రామాయణం' 9వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు దీని తదుపరి లక్ష్యం షారుఖ్ ఖాన్ 'జవాన్' (రూ. 1,160 కోట్లు - కేవలం రూ. 49.30 కోట్ల దూరంలో ఉంది).

రెండో శనివారం, ఆదివారాల్లో బుకింగ్స్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉండటంతో, 11 రోజులు పూర్తయ్యేసరికి 'రామాయణం' రూ. 1,250 కోట్ల మైలురాయిని దాటి టాప్-5 జాబితాలోకి దూసుకెళ్లడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ర్యాంక్సినిమా పేరుప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు (సుమారుగా)
1దంగల్ (Dangal)రూ. 2,070.30 కోట్లు
2ధురంధర్ 2 (Dhurandhar 2)రూ. 1,813.39 కోట్లు
3బాహుబలి 2 (Baahubali 2)రూ. 1,788.06 కోట్లు
4పుష్ప 2: ది రూల్ (Pushpa 2)రూ. 1,742.10 కోట్లు
5ఆర్ఆర్ఆర్ (RRR)రూ. 1,230.00 కోట్లు
6కేజీఎఫ్: చాప్టర్ 2 (KGF 2)రూ. 1,215.00 కోట్లు
7జవాన్ (Jawan)రూ. 1,160.00 కోట్లు
8రామాయణం: పార్ట్ 1 (9 రోజుల్లో)రూ. 1,110.70 కోట్లు
9పఠాన్ (Pathaan)రూ. 1,055.00 కోట్లు
10కల్కి 2898 AD (Kalki 2898 AD)రూ. 1,042.25 కోట్లు
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More