Ramayana First Reviews: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'రామాయణ: పార్ట్ 1' (Ramayana: Part 1) థియేట్రికల్ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ విజువల్ వండర్ ప్రీమియర్ షోల నుంచే వరల్డ్ వైడ్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి అత్యుత్తమ రేటింగ్‌లను అందుకంటోంది.
లార్డ్ ఆఫ్ ద రింగ్ లెవెల్లో..

ప్రపంచ ప్రఖ్యాత 'ది గార్డియన్' (The Guardian) మూవీ క్రిటిక్ పీటర్ బ్రాడ్‌షా ఈ 3 గంటల నిడివితో కూడిన విజువల్ స్పెక్టకిల్‌ను “అత్యంత మనోరంజకమైన భారతీయ ఎపిక్ మెలోడ్రామా” అని అభివర్ణించారు.
హాలీవుడ్ క్లాసిక్స్ అయిన ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, డిస్నీ ‘ది లయన్ కింగ్’ సినిమాల స్థాయి విజువల్స్, అద్భుతమైన ల్యాండ్‌స్కేప్స్‌తో నితేష్ తివారీ ఈ చిత్రాన్ని మలిచారని ఆయన ప్రశంసించారు.
న్యూయార్క్ మూవీ గురు క్రిటిక్ ఏవీ ఆఫర్ కూడా సినిమాలోని లొకేషన్లు, కాస్ట్యూమ్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ను హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.
రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయి పల్లవి..
భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించడం ఎంతటి సవాలుతో కూడుకున్నదో అందరికీ తెలిసిందే. అయితే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నితేష్ తివారీ ఈ ఎపిక్‌ను భక్తి శ్రద్ధలతో, భారీ స్థాయిలో తెరకెక్కించారు.
"రామాయణ" ప్రదర్శనలపై విమర్శకుల టాక్
- శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్: శాంత స్వభావం, తన గంభీరత, అద్భుతమైన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకున్నాడు.
- సీతాదేవిగా సాయి పల్లవి: తనదైన ఓ మెస్మరైజింగ్ ప్రెజెన్స్, స్వచ్ఛమైన అభినయంతో పాత్రకు ప్రాణం పోసింది.
- రావణాసురుడిగా యశ్: తన స్క్రీన్ ప్రజెన్స్, ఇంటెన్స్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో థియేటర్లలో విజిళ్లు వేయిస్తున్నాడు.
{{/usCountry}}- రావణాసురుడిగా యశ్: తన స్క్రీన్ ప్రజెన్స్, ఇంటెన్స్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో థియేటర్లలో విజిళ్లు వేయిస్తున్నాడు.
{{/usCountry}}- లక్ష్మణుడిగా రవి దూబే: నిష్కల్మషమైన విశ్వసనీయత, ఆవేశంతో కూడిన పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్.
ఈ రామాయణ మూవీకి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బీజీఎం ప్రతీ సన్నివేశాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిందని ప్రముఖ క్రిటిక్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ సమయంలో వచ్చే బీజీఎం థియేటర్లలో రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందంటున్నారు.
మొదటి రోజే రూ. 150 కోట్లు? రూ. 3000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్
నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యశ్ మాన్‌స్టర్ మైండ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో విడుదలవుతోంది.
ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం.. 'రామాయణ: పార్ట్ 1' మొదటి రోజు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 100 నుంచి 150 కోట్ల గ్రాస్ సాధించే అవకాశాలున్నాయి. లాంగ్ రన్‌లో ఈ చిత్రం రూ. 1,000 కోట్ల నుంచి ఏకంగా రూ. 3,000 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్లను రాబట్టి ఆల్ టైమ్ రికార్డులను సృష్టిస్తుందని చిత్ర సీనియర్ డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే సినీప్రియులు, డివోషనల్ ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ లభిస్తుండటంతో, భారతీయ సినీ చరిత్రలోనే ఈ ఎపిక్ మూవీ ఒక సరికొత్త మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.