Ramayana Collections: అసలు తగ్గేదేలే.. 10 రోజుల్లో రామాయణం కలెక్షన్ల విధ్వంసం.. బద్దలైన రికార్డులు.. అక్కడ ఫస్ట్ సినిమా!

Ramayana Collections: బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్‌ కపూర్, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన 'రామాయణం' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం పది రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1228 కోట్లు వసూలు చేసింది.

Published on: Nov 15, 2026, 12:44:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana Collections: బాలీవుడ్ విలక్షణ దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మైథలాజికల్ ఎపిక్ డ్రామా 'రామాయణం'. దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. తొలి ఆట నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో శ్రీరాముడిగా ర‌ణ్‌బీర్‌ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.

అసలు తగ్గేదేలే.. 10 రోజుల్లో రామాయణం కలెక్షన్ల విధ్వంసం.. బద్దలైన రికార్డులు.. అక్కడ ఫస్ట్ సినిమా! (x/WorldOfRamayana)
అసలు తగ్గేదేలే.. 10 రోజుల్లో రామాయణం కలెక్షన్ల విధ్వంసం.. బద్దలైన రికార్డులు.. అక్కడ ఫస్ట్ సినిమా! (x/WorldOfRamayana)

రామాయణం 10 రోజుల కలెక్షన్

బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' ప్రభంజనం ఏమాత్రం తగ్గడం లేదు. ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, 10వ రోజు (శనివారం) ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా 23,451 షోల ద్వారా రూ.72.90 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో ఇండియాలో ఈ సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ రూ.819.50 కోట్లకు చేరుకున్నాయి.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సత్తా చాటుతున్న రామాయణం చిత్రం ఇప్పటివరకు రూ.408.50 కోట్లు రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే, కేవలం పది రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1228 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ఆ రెండు సినిమాల తర్వాతే..

వెయ్యి కోట్ల క్లబ్‌లో 'రామాయణం' చాలా వేగంగా అడుగుపెట్టింది. కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. భారతీయ సినిమా చరిత్రలో 'పుష్ప 2: ది రూల్', 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలు మాత్రమే 7 రోజుల్లో ఈ మైలురాయిని చేరుకోగా, ఆ తర్వాత 8 రోజుల్లో 'రామాయణం' ఈ ఘనత సాధించింది.

ఆ రికార్డులు ఔట్

ఈ క్రమంలో 10 రోజుల్లో వెయ్యి కోట్లు సాధించిన 'బాహుబలి 2', 16 రోజుల్లో సాధించిన 'ఆర్ఆర్ఆర్', 18 రోజుల్లో సాధించిన 'కేజీఎఫ్: చాప్టర్ 2' రికార్డులను రామాయణం బ్రేక్ చేసింది. షారుఖ్ ఖాన్ చిత్రాలు 'జవాన్' (18 రోజులు), 'పఠాన్' (27 రోజులు) కంటే కూడా చాలా వేగంగా ఈ మార్క్‌ను అందుకుంది.

ఇఫీ (IFFI)లో అరుదైన ఘనత

బాక్సాఫీస్ విజయాలతో పాటు 'రామాయణం' సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా నవంబర్ 20న ప్రారంభం కానున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2026లో బ్రిక్స్ (BRICS) విభాగంలో ప్రదర్శితం కానున్న తొలి చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న సినిమా కథలను, శైలులను భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ బ్రిక్స్ సెగ్మెంట్‌ను నిర్వహిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More