Ramayana Collection: ఒక్కరోజే 107 కోట్లు- 5 రోజుల్లోనే బాహుబలి, జైలర్ లైఫ్‌టైమ్ కలెక్షన్స్ అవుట్- ఇదీ రామాయణం బాక్సాఫీస్
Ramayana Box Office Collection Day 5: రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటించిన 'రామాయణం' మూవీ బాక్సాఫీస్ వద్ద నయా చరిత్ర సృష్టించింది. ఐదో రోజైన సోమవారం రోజున రూ. 107.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి రెండో హిందీ సినిమాగా రికార్డుకెక్కింది. అలాగే, బాహుబలి లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను బ్రేక్ చేసేసింది.
Ramayana 5 Days Worldwide Collection: భారతీయ చిత్రసీమలో మరో సంచలనం నమోదైంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన దృశ్య కావ్య చిత్రం 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

సోమవారం రికార్డులు తిరగరాసిన రామాయణం
శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా దక్షిణాది భామ సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా ఐదో రోజైన సోమవారం (నవంబర్ 9) రికార్డులను తిరగరాసింది. దివాళీ పండుగ సెలవుల కంటిన్యూటీని పక్కాగా వాడుకుంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసింది.
సోమవారం ఒక్కరోజే రూ. 100 కోట్ల నెట్
నవంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన రామాయణం సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 128 కోట్ల గ్రాస్ వసూలు చేసి మంచి బోణీ కొట్టింది. నాలుగు రోజుల ఓపెనింగ్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును అందుకంది.
దాదాపు రూ. 1600 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల అపారమైన నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న రామాయణం సినిమాకు వీకెండ్ వసూళ్లు కొంత సాధారణంగానే అనిపించినా, సోమవారం మాత్రం ఊహించని స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి.
భారత్‌లో ఒక్క సోమవారమే రూ. 107.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. హిందీ సినిమా చరిత్రలో ఒకే రోజు వంద కోట్ల నెట్ సాధించిన రెండో చిత్రంగా రికార్డుకెక్కింది రామాయణ సినిమా. దీంతో దేశీయంగా ఐదు రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూ. 346 కోట్లకు (గ్రాస్ రూ. 413 కోట్లు) చేరాయి.
బాహుబలి-1, జైలర్ రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి
ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ. 663 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన 'రామాయణం', ఆల్-టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమాల జాబితాలో ఒకే రోజు 13 స్థానాలు ఎగబాకి టాప్-25లోకి ప్రవేశించింది.
ఈ క్రమంలో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి: ది బిగినింగ్' (రూ. 650 కోట్లు), రజినీకాంత్ 'జైలర్' (రూ. 605 కోట్లు), సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' (రూ. 621 కోట్లు) వంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను ఐదే ఐదు రోజుల్లో దాటేసింది. అంతకుముందు 'ఆదిపురుష్' వసూళ్లను దివాళీ రోజునే వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే.
ఓవర్సీస్‌లోనూ ఊపు.. 2028లో రెండో భాగం
అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్ సంస్థ ఏకంగా 59,000 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఇది మన భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్. ఉత్తర అమెరికాలో 12.2 మిలియన్ డాలర్లు, ఇతర దేశాల్లో 11 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం విదేశీ మార్కెట్లలో మొత్తం 26.7 మిలియన్ డాలర్ల (రూ. 220 కోట్లకు పైగా) కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజి (DNEG), యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి దూబే అలరించారు. మొదటి భాగం ఇప్పుడు థియేటర్లను ఊపేస్తుండగా, రెండో భాగాన్ని 2028 దివాళి కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


