Ramayana Collection Records: మన దేశంలో రామాయణానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ ఇతిహాస చిత్రం దానికి తగ్గట్టే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దీపావళి సెలవులను క్యాష్ చేసుకున్న ఈ మూవీ.. మొదటి 8 రోజుల్లోనే రూ.1000 కోట్ల (గ్రాస్) క్లబ్‌లో చేరింది.
సౌత్ ఈస్ట్ ఆసియాలో

రామాయణం కేవలం ఇండియాకే పరిమితం కాలేదు.. ఆసియాలోని దాదాపు 300కు పైగా ప్రాంతీయ వర్షన్లలో ఈ ఇతిహాసం ప్రాచుర్యంలో ఉంది. ఇండోనేషియాలో కకావిన్ రామాయణ, బాలినీస్ రామకవచ తదితర పేర్లతో శతాబ్దాలుగా రామాయణం వారి సంస్కృతిలో భాగమైంది. అందుకే అక్కడ రామాయణం మూవీ ప్రీమియర్స్ ద్వారానే ఏకంగా లక్ష డాలర్లు (సుమారు రూ.1 కోటి) వసూలు చేసి, ఇండోనేషియాలో ఒక ఇండియన్ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది.
థాయ్‌లాండ్‌లో ఇలా
అలాగే థాయ్‌లాండ్‌లో 'రామకీన్' పేరుతో రామాయణం ఫేమస్. అక్కడ ఈ చిత్రం వారం రోజుల్లోనే 1 మిలియన్ డాలర్లు (రూ.9 కోట్లు) కొల్లగొట్టింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఉన్న కంబోడియాలో 'రీమ్‌కర్' పేరుతో రామాయణాన్ని స్కూల్ సిలబస్‌లో బోధిస్తారు. అక్కడ తొలి వీకెండ్‌లోనే 1.5 లక్షల డాలర్లు రాబట్టగా, పొరుగున ఉన్న మలేషియాలో కేవలం వారం లోపే 9 లక్షల డాలర్లు (రూ.8 కోట్లు) వసూలు చేసి ఔరా అనిపించింది.
వియత్నాంలో క్రేజ్
సాధారణంగా వియత్నాంలో ఇండియన్ సినిమాలకు పెద్ద మార్కెట్ లేదు. అక్కడ మన సినిమాలు 20 వేల డాలర్లు (రూ.15-18 లక్షలు) రాబట్టడమే గగనం. కానీ 'రామాయణం' ఆ రికార్డును తొలి రోజే బ్రేక్ చేసి, ఇప్పటివరకు ఏకంగా 3.5 లక్షల డాలర్లు (రూ.3 కోట్లు) వసూలు చేసింది.
వియత్నాంను 1500 ఏళ్ల పాటు పాలించిన చంపా రాజవంశం హిందూ సంస్కృతిని ఆదరించింది. అక్కడ 1300 ఏళ్ల నాటి వాల్మీకి మహర్షి ఆలయం ఉండటం విశేషం. దానికి తోడు అక్కడ స్కూల్స్, కాలేజీల్లో రామాయణాన్ని ప్రపంచ సాహిత్య పాఠ్యాంశంగా బోధిస్తారు. అందుకే ఈ సినిమాకు అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు.
నేపాల్‌లో 'బాహుబలి 2' రికార్డులపై గురి
{{/usCountry}}వియత్నాంను 1500 ఏళ్ల పాటు పాలించిన చంపా రాజవంశం హిందూ సంస్కృతిని ఆదరించింది. అక్కడ 1300 ఏళ్ల నాటి వాల్మీకి మహర్షి ఆలయం ఉండటం విశేషం. దానికి తోడు అక్కడ స్కూల్స్, కాలేజీల్లో రామాయణాన్ని ప్రపంచ సాహిత్య పాఠ్యాంశంగా బోధిస్తారు. అందుకే ఈ సినిమాకు అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు.
నేపాల్‌లో 'బాహుబలి 2' రికార్డులపై గురి
{{/usCountry}}నేపాల్‌లో మన సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అయితే 'రామాయణం' అక్కడ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఎక్స్‌టెండెడ్ ఓపెనింగ్ వీక్‌లో 12.80 కోట్ల నేపాల్ రూపాయలు (రూ.8 కోట్లు) కలెక్షన్లు వసూలు చేసింది.
ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ అయిన 'ఆర్ఆర్ఆర్', 'పఠాన్', 'జవాన్' ఫుల్ రన్ కలెక్షన్లను నేపాల్ లో రామాయణం క్రాస్ చేసింది. త్వరలోనే ఇది 'బాహుబలి 2' పేరిట ఉన్న 25.20 కోట్ల (NPR) ఆల్ టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.