Ramayana Break Even: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ 'రామాయణం పార్ట్-1' (Ramayana Part 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు రూ.2,000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్రను లిఖిస్తోంది.

అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే ఏకంగా రూ.5,000 కోట్లు (సుమారు 500 మిలియన్ డాలర్లు) వసూలు చేయాల్సి ఉంటుంది. హాలీవుడ్ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రాల స్థాయిలో ఉన్న ఈ టార్గెట్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత అసాధ్యమైన సవాలుగా నిలిచింది.
ఏమిటీ రూ.5000 కోట్ల బ్రేక్ ఈవెన్ లెక్క?
ఫిల్మ్ బిజినెస్ విశ్లేషకుల నియమాల ప్రకారం, ఒక సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను చేరుకోవడానికి దాని నిర్మాణ వ్యయం కంటే 2.5 రెట్లు ఎక్కువ వసూలు చేయాల్సి ఉంటుంది. థియేటర్ల షేర్లు, పంపిణీదారుల కమిషన్లు, పబ్లిసిటీ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఫార్ములా వర్తిస్తుంది.
రామాయణ ప్రొడక్షన్ బడ్జెట్: రూ.2,000 కోట్లు (అంచనా)
అంచనా వేసిన బ్రేక్ ఈవెన్ టార్గెట్: రూ.5,000 కోట్లు (2.5x బడ్జెట్)
అయితే డిజిటల్ ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, ఇంటర్నేషనల్ డబ్బింగ్ హక్కుల ద్వారా వచ్చే భారీ ఆదాయం నిర్మాతల వ్యయాన్ని కొంతవరకు భర్తీ చేస్తుంది. కాబట్టి రూ.5,000 కోట్లు అనేది థియేట్రికల్ వర్త్ అంచనా మాత్రమే.
భారతీయ సినిమాల ఆల్-టైమ్ రికార్డులు ఎలా ఉన్నాయి?
ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల రికార్డులను పరిశీలిస్తే, రూ.2,100 కోట్లకు పైగా మార్కును దాటిన సినిమా ఒక్కటి కూడా లేదు.
{{/usCountry}}ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల రికార్డులను పరిశీలిస్తే, రూ.2,100 కోట్లకు పైగా మార్కును దాటిన సినిమా ఒక్కటి కూడా లేదు.
{{/usCountry}}1. దంగల్ (Dangal): ఆల్ టైమ్ రికార్డుతో రూ.2,000 కోట్ల క్లబ్‌లో ఉంది.
2. ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar: The Revenge - 2026): దాదాపు రూ.1,852 కోట్ల వసూళ్లు సాధించింది.
3. బాహుబలి 2 (Baahubali 2): ప్రపంచవ్యాప్తంగా రూ.1,810 కోట్లతో మూడో స్థానంలో ఉంది.
4. పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule): రూ.1,800 కోట్ల గ్రాస్‌ను సాధించింది.
5. ఆర్‌ఆర్ఆర్ / కేజీఎఫ్ 2 / జవాన్ / కల్కి 2898 AD: ఈ చిత్రాలు రూ.1,000 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల మధ్య వసూలు చేశాయి.
రామాయణం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 'దంగల్' రికార్డు కంటే మరో రూ.3,000 కోట్లు అదనంగా అంటే అంతకన్నా రెండున్నర రెట్లు ఎక్కువ రాబట్టాల్సి ఉంటుంది.
తొలి 4 రోజుల వసూళ్ల ప్రభంజనం
అసాధ్యమైన టార్గెట్ అనిపిస్తున్నప్పటికీ.. 'రామాయణం పార్ట్-1' బాక్సాఫీస్ దగ్గర వేగంగా అడుగులు వేస్తోంది. బాక్సాఫీస్ ట్రాకర్ 'Sacnilk' అధికారిక గణాంకాల ప్రకారం, కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.507.20 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.
ఇండియా నెట్ (India Nett) : రూ.238.85 కోట్లు
ఇండియా గ్రాస్ (India Gross): రూ.285.20 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ (Overseas Gross): రూ.222.00 కోట్లు
వరల్డ్‌వైడ్ గ్రాస్ (Worldwide Gross): రూ.507.20 కోట్లు
దీపావళి పండుగ సెలవుల రోజుల్లోనూ మైండ్ బ్లోయింగ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. నాలుగో రోజైన ఆదివారం ఒక్కరోజే ఇండియాలో రూ.56.15 కోట్ల నెట్ సాధించింది.
అసాధ్యాన్యాన్ని సుసాధ్యం చేయగలదా?
నమిత్ మల్హోత్రాకి చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యశ్ కి చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించిన ఈ రామాయణ మొదటి భాగంలోనే ప్రేక్షకుల మనసులను దోచుకుంది. హాలీవుడ్ దిగ్గజాలు హన్స్ జిమ్మర్, ఎఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం, విజువల్స్ ఈ సినిమాను ప్రపంచ స్థాయి వేదికపై నిలబెట్టాయి.
లాంగ్ రన్ లో నార్త్ ఇండియా, సౌత్ భాషలు, అంతర్జాతీయ మార్కెట్లలో నిలకడగా రాబడితే, 'రామాయణం' భారతీయ సినీ చరిత్రలో ఇంతకుముందెన్నడూ చూడని విస్మయకరమైన రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అది ఎంత వరకూ సాధ్యమన్నది రానున్న రెండు వారాల్లో తేలనుంది.