Ramayana Break Even: రూ.5 వేల కోట్లు.. రామాయణ బ్రేక్ఈవెన్ టార్గెట్ సాధ్యమేనా? అత్యధిక వసూళ్ల మూవీ కంటే రెండున్నర రెట్లు

Ramayana Break Even: 'రామాయణం పార్ట్-1' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అయితే రూ.2,000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే (Break-even) ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.5,000 కోట్లు రాబట్టాలనే విశ్లేషణలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Published on: Nov 9, 2026, 14:58:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana Break Even: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ 'రామాయణం పార్ట్-1' (Ramayana Part 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు రూ.2,000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్రను లిఖిస్తోంది.

Ramayana Break Even: రూ.5 వేల కోట్లు.. రామాయణ బ్రేక్ఈవెన్ టార్గెట్ సాధ్యమేనా? అత్యధిక వసూళ్ల మూవీ కంటే రెండున్నర రెట్లు (Screengrab from YouTube/T-Series)
Ramayana Break Even: రూ.5 వేల కోట్లు.. రామాయణ బ్రేక్ఈవెన్ టార్గెట్ సాధ్యమేనా? అత్యధిక వసూళ్ల మూవీ కంటే రెండున్నర రెట్లు (Screengrab from YouTube/T-Series)

అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే ఏకంగా రూ.5,000 కోట్లు (సుమారు 500 మిలియన్ డాలర్లు) వసూలు చేయాల్సి ఉంటుంది. హాలీవుడ్ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రాల స్థాయిలో ఉన్న ఈ టార్గెట్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత అసాధ్యమైన సవాలుగా నిలిచింది.

ఏమిటీ రూ.5000 కోట్ల బ్రేక్ ఈవెన్ లెక్క?

ఫిల్మ్ బిజినెస్ విశ్లేషకుల నియమాల ప్రకారం, ఒక సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను చేరుకోవడానికి దాని నిర్మాణ వ్యయం కంటే 2.5 రెట్లు ఎక్కువ వసూలు చేయాల్సి ఉంటుంది. థియేటర్ల షేర్లు, పంపిణీదారుల కమిషన్లు, పబ్లిసిటీ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఫార్ములా వర్తిస్తుంది.

రామాయణ ప్రొడక్షన్ బడ్జెట్: రూ.2,000 కోట్లు (అంచనా)

అంచనా వేసిన బ్రేక్ ఈవెన్ టార్గెట్: రూ.5,000 కోట్లు (2.5x బడ్జెట్)

అయితే డిజిటల్ ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, ఇంటర్నేషనల్ డబ్బింగ్ హక్కుల ద్వారా వచ్చే భారీ ఆదాయం నిర్మాతల వ్యయాన్ని కొంతవరకు భర్తీ చేస్తుంది. కాబట్టి రూ.5,000 కోట్లు అనేది థియేట్రికల్ వర్త్ అంచనా మాత్రమే.

భారతీయ సినిమాల ఆల్-టైమ్ రికార్డులు ఎలా ఉన్నాయి?

ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల రికార్డులను పరిశీలిస్తే, రూ.2,100 కోట్లకు పైగా మార్కును దాటిన సినిమా ఒక్కటి కూడా లేదు.

1. దంగల్ (Dangal): ఆల్ టైమ్ రికార్డుతో రూ.2,000 కోట్ల క్లబ్‌లో ఉంది.

2. ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar: The Revenge - 2026): దాదాపు రూ.1,852 కోట్ల వసూళ్లు సాధించింది.

3. బాహుబలి 2 (Baahubali 2): ప్రపంచవ్యాప్తంగా రూ.1,810 కోట్లతో మూడో స్థానంలో ఉంది.

4. పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule): రూ.1,800 కోట్ల గ్రాస్‌ను సాధించింది.

5. ఆర్‌ఆర్ఆర్ / కేజీఎఫ్ 2 / జవాన్ / కల్కి 2898 AD: ఈ చిత్రాలు రూ.1,000 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల మధ్య వసూలు చేశాయి.

రామాయణం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 'దంగల్' రికార్డు కంటే మరో రూ.3,000 కోట్లు అదనంగా అంటే అంతకన్నా రెండున్నర రెట్లు ఎక్కువ రాబట్టాల్సి ఉంటుంది.

తొలి 4 రోజుల వసూళ్ల ప్రభంజనం

అసాధ్యమైన టార్గెట్ అనిపిస్తున్నప్పటికీ.. 'రామాయణం పార్ట్-1' బాక్సాఫీస్ దగ్గర వేగంగా అడుగులు వేస్తోంది. బాక్సాఫీస్ ట్రాకర్ 'Sacnilk' అధికారిక గణాంకాల ప్రకారం, కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.507.20 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.

ఇండియా నెట్ (India Nett) : రూ.238.85 కోట్లు

ఇండియా గ్రాస్ (India Gross): రూ.285.20 కోట్లు

ఓవర్సీస్ గ్రాస్ (Overseas Gross): రూ.222.00 కోట్లు

వరల్డ్‌వైడ్ గ్రాస్ (Worldwide Gross): రూ.507.20 కోట్లు

దీపావళి పండుగ సెలవుల రోజుల్లోనూ మైండ్ బ్లోయింగ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. నాలుగో రోజైన ఆదివారం ఒక్కరోజే ఇండియాలో రూ.56.15 కోట్ల నెట్ సాధించింది.

అసాధ్యాన్యాన్ని సుసాధ్యం చేయగలదా?

నమిత్ మల్హోత్రాకి చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యశ్ కి చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించిన ఈ రామాయణ మొదటి భాగంలోనే ప్రేక్షకుల మనసులను దోచుకుంది. హాలీవుడ్ దిగ్గజాలు హన్స్ జిమ్మర్, ఎఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం, విజువల్స్ ఈ సినిమాను ప్రపంచ స్థాయి వేదికపై నిలబెట్టాయి.

లాంగ్ రన్ లో నార్త్ ఇండియా, సౌత్ భాషలు, అంతర్జాతీయ మార్కెట్లలో నిలకడగా రాబడితే, 'రామాయణం' భారతీయ సినీ చరిత్రలో ఇంతకుముందెన్నడూ చూడని విస్మయకరమైన రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అది ఎంత వరకూ సాధ్యమన్నది రానున్న రెండు వారాల్లో తేలనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More