Ramayana OTT: ఓటీటీలోకి రామాయణం.. స్ట్రీమింగ్ డేట్ పై షాకిచ్చిన ప్రొడ్యూసర్.. 1800 కోట్ల మూవీ ఓటీటీ రిలీజ్ ఇలా!

Ramayana OTT: రామాయణం పార్ట్ 1 మూవీ థియేటర్లలో అదరగొడుతోంది. రికార్డు కలెక్షన్లలో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా షాకిచ్చాడు. ఆయన ఏమన్నారో ఇక్కడ చూసేయండి.  

Published on: Nov 29, 2026, 17:05:13 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana OTT: నవంబర్ 5న థియేటర్లలో రిలీజైన విజువల్ వండర్ ‘రామాయణం పార్ట్ 1’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీస్ లో ఈ సినిమా సెకండ్ ప్లేస్ కు చేరుకుంది.

ఓటీటీలోకి రామాయణం.. స్ట్రీమింగ్ డేట్ పై షాకిచ్చిన ప్రొడ్యూసర్.. 1800 కోట్ల మూవీ ఓటీటీ రిలీజ్ ఇలా! (x/WorldOfRamayana)
ఓటీటీలోకి రామాయణం.. స్ట్రీమింగ్ డేట్ పై షాకిచ్చిన ప్రొడ్యూసర్.. 1800 కోట్ల మూవీ ఓటీటీ రిలీజ్ ఇలా! (x/WorldOfRamayana)

రామాయణం ఓటీటీ

రామాయణం మూవీ థియేటర్లలో రిలీజై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి. బాలీవుడ్ సినిమాలకు సాధారణంగా 4 నుంచి 8 వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ ఈ రామాయణం ఓటీటీ రిలీజ్ పై ఇంకా ఎలాంటి అప్డేడ్ లేదు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను కూడా ఇంకా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు అమ్మకపోవడం గమనార్హం.

ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే?

రామాయణం మూవీ ఏ ఓటీటీలోకి వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామాయణం ఓటీటీ రిలీజ్ పై ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా క్లారిటీనిచ్చారు. ఈ మూవీ ఇప్పట్లో ఓటీటీలోకి రాదని డిజిటల్ ఆడియన్స్ కు పెద్ద షాకిచ్చారు.

థియేటర్లలోనే చూడాలని

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామాయణం మూవీ ఓటీటీ రిలీజ్ పై ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ రామాయణం పార్ట్ 1 సినిమాను రిలీజ్ చేసే ఆలోచన తమకు లేదని నమిత్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఈ మహా కావ్యాన్ని ప్రేక్షకులు థియేటర్లలోనే చూడాలని నమిత్ కోరారు.

డిజిటల్ రైట్స్ పై క్లారిటీ

ఇక రామాయణం మూవీ ఓటీటీ రైట్స్ ను జియోహాట్‌స్టార్‌ భారీ ధరకు దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 18 లేదా 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఇంకా ఎవరికీ అమ్మలేదని నమిత్ మల్హోత్రా వెల్లడించారు.

‘‘ఇప్పటివరకూ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇంకా ఎవరికీ అమ్మలేదు. సినిమా థియేటర్లలో రన్ అవుతున్నంతకాలం ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ పైనే చూడాలని కోరుకుంటున్నా. ఏదో ఒక రోజు అయితే కచ్చితంగా ఓటీటీలోకి వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఆ ప్లాన్స్ లేవు. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ తోనూ డీల్ కుదుర్చుకోలేదు’’ అని నమిత్ పేర్కొన్నారు.

వెయిట్ చేయాల్సిందే

రామాయణం ప్రొడ్యూసర్ కామెంట్లు చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేలా కనిపించడం లేదు. ఫస్ట్ ఈ చిత్రం ఓటీటీ డీల్ కుదరాలి. ఆ తర్వాతే స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.