చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.
Legacy Release: ఈఎన్ఈ రిపీట్ సక్సెస్ జోష్-మరో సినిమా కంప్లీట్ చేసిన విశ్వక్ సేన్-ఈ పొలిటికల్ థ్రిల్లర్ రిలీజ్ ఎప్పుడంటే?
Legacy Release: ‘ఈఎన్ఈ రిపీట్’ బ్లాక్‌బస్టర్ విజయంతో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ జోష్‌లోనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లెగసీ’ షూటింగ్ కు కంప్లీట్ చేసేశాడు. ఈ విషయాన్ని చెప్తూ విశ్వక్ పోస్టు చేసిన పోస్టర్ వైరల్ గా మారింది.
Legacy Release: గత కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్న విశ్వక్ సేన్‌కు ‘ఈఎన్ఈ రిపీట్’ రూపంలో భారీ విజయం దక్కింది. నవంబర్ 19న విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

జోష్ లో విశ్వక్ సేన్
ఈఎన్ఈ రిపీట్ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో విశ్వక్ సేన్ కెరీర్‌కు కొత్త ఊపు వచ్చింది. తన కెరీర్ కు అవసరమైన హిట్ ను ఈ నగరానికి ఏమైంది 2 మూవీ అందించింది. ఇప్పుడు అదే విజయ పరంపరను ఆయన తన తదుపరి చిత్రం ‘లెగసీ’తోనూ కొనసాగిస్తాడా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
షూటింగ్ పూర్తి
ఈఎన్ఈ రిపీట్ ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న విశ్వక్ సేన్ అభిమానులకు మరో క్రేజీ అప్డేట్ అందింది. ఆయన హీరోగా నటిస్తున్న ‘లెగసీ’ షూటింగ్ మొత్తం అధికారికంగా పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. షూటింగ్ ముగియడంతో విడుదల కోసం కౌంట్‌డౌన్ మొదలైందని మేకర్స్ వెల్లడించారు.వాస్తవానికి ఈ చిత్రాన్ని డిసెంబర్ 4, 2026నే విడుదల చేయాలని ఫస్ట్ అనుకున్నారు.
కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా లెగసీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడేమో పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తూ ఫిబ్రవరి 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
అధికారం, ప్రేమ, రాజకీయాలు
అధికారం, ప్రేమ, రక్తసంబంధం, రాజకీయాలు అనే నాలుగు బలమైన అంశాల చుట్టూ ‘లెగసీ’ కథ తిరగనుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పెట్టిన ‘పాలిటిక్స్ ఈజ్ పర్సనల్’ అనే ట్యాగ్‌లైన్ కథలోని తీవ్రతను, ఎమోషన్‌ను స్పష్టం చేస్తోంది. రాజకీయ పోరాటాలు కుటుంబ బంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని ఇందులో ఉత్కంఠభరితంగా చూపించనున్నారు.ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తోంది.
వీరితో పాటు రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, బాలీవుడ్ ప్రముఖ నటుడు కేకే మీనన్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ స్థాయి నటీనటులు ఉండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
‘పిండం’ దర్శకుడి రెండో చిత్రం
గతంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పిండం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా ఇది. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు గోవింద్ వసంత సంగీతం అందిస్తుండటం పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
‘ఈఎన్ఈ రిపీట్’తో తిరిగి ఫామ్ అందుకున్న విశ్వక్ సేన్.. ఈ పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాతో వరుసగా రెండో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

E-Paper
