Vishwak Sen: 21 ఏళ్లకే పైసల్లేవని గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది.. సినిమా నుంచి తీసేశారు.. వెక్కి వెక్కి ఏడ్చా: విశ్వక్ సేన్

Vishwak Sen: ఈఎన్ఈ రిపీట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో విశ్వక్ సేన్. కెరీర్ లో కొంతకాలంగా సరైన హిట్ దక్కని విశ్వక్.. ఇప్పుడు సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్ లోని స్ట్రగుల్స్ ను షేర్ చేసుకున్నాడు. ఆయన ఎమోషనల్ స్పీచ్ వైరల్ గా మారింది. 

Published on: Nov 25, 2026, 09:47:48 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ అంటే రఫ్ గా ఉంటాడు, బోల్డ్ గా మాట్లాడతాడనే పేరుంది. ఆయన చేసిన సినిమాలు కావొచ్చు లేదా బయట మాటల ప్రభావం కావొచ్చు. కానీ విశ్వక్ సేన్ లోనూ ఓ ఎమోషనల్ యాంగిల్ ఉంది. తాజాగా ఈఎన్ఈ రిపీట్ మూవీ సక్సెస్ మీట్ లో అది బయటకు వచ్చింది.

21 ఏళ్లకే పైసల్లేవని గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది.. సినిమా నుంచి తీసేశారు.. వెక్కి వెక్కి ఏడ్చా: విశ్వక్ సేన్
21 ఏళ్లకే పైసల్లేవని గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది.. సినిమా నుంచి తీసేశారు.. వెక్కి వెక్కి ఏడ్చా: విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ స్ట్రగుల్స్

కష్టాలు దాటితేనే ఎవరైనా సక్సెస్ అందుకుంటారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. సినీ ఇండస్ట్రీలో సెట్ కావడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. చాలా ఇబ్బందులు ఎదురుకున్నాడు. తాజాగా ఈఎన్ఈ రిపీట్ సక్సెస్ మీట్ లో ఈ విషయాలను విశ్వక్ సేన్ బయటపెట్టాడు.

21 ఏళ్లకే బ్రేకప్

తాను 17 ఏళ్ల నుంచే స్ట్రగుల్స్ ఫేస్ చేశానని విశ్వక్ సేన్ వెల్లడించాడు. 21 ఏళ్లకే తన దగ్గర డబ్బులు లేవని గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్లిపోయిందని అతను చెప్పాడు. ‘‘21 ఏళ్లకు నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమె నా దగ్గర పైసలు లేవని వదిలేసింది’’ అని విశ్వక్ సేన్ ఈఎన్ఈ రిపీట్ సక్సెస్ మీట్ లో తెలిపాడు.

సినిమా నుంచి తీసేశారు

‘‘అప్పుడే ఓ సినిమా ఉండే. ఆ సినిమాలో ఫస్ట్ మంత్ నేనే ఫస్ట్ హీరో. రెండో నెలలో సెకండ్ హీరోను చేశారు. మూడో నెలలో మూడో హీరో చేశారు. నాలుగో నెలలో నన్ను నాలుగో హీరో చేస్తే ఆఫీస్ నుంచి వెళ్లిపోదామనుకున్నా.

కానీ నిజంగానే నాలుగో హీరోను చేశారు. అయినా నోర్మూసుకుని గట్టిగా నిలబడి చేద్దాం అనుకున్నా. కానీ డైరెక్టర్ ఏ ఈక్వెషన్స్ కు హర్ట్ అయ్యాడో ఏమో. నా యాక్టింగ్ వల్ల మాత్రం కాదు. 20 రోజుల తర్వాత ఆఫీసులో కొత్త వ్యక్తి కనిపించాడు. ఆ సినిమాలో అసలు నేను లేనని చెప్పారు. నన్ను తీసేసిన ఆఫీసుకు నేను 20 రోజులు వెళ్లానన్నమాట’’ అని విశ్వక్ సేన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

వెక్కి వెక్కి ఏడ్చా

‘‘నా దగ్గర ఉన్న పాకెట్ మనీ, అప్పు చేసి వాళ్లకు మందు తాగించేవాణ్ని. మర్యాద చేసేవాణ్ని. నా పిల్ల వదిలేసినప్పుడు కూడా ఏడవలేదు. కానీ సినిమా నుంచి తీసేసిన తర్వాత ఇంటికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా. రెండు మూడు రాత్రులు అలాగే ఏడ్చా. నా తల్లిదండ్రులు నన్ను అలా చూడలేకపోయారు’’ అని విశ్వక్ సేన్ వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.