Vishwak Sen: సంస్కారం, మంచితనం అనేవి వయసుతో పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ పై విశ్వక్ సేన్ ఫైర్.. పోస్టు వైరల్!

Vishwak Sen: టాలీవుడ్ లో ఏ విషయం అయినా బోల్డ్ అండ్ ఓపెన్ గా మాట్లాడే హీరో విశ్వక్ సేన్ కు కోపమొచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ వీఎస్ఎన్ మూర్తిపై విశ్వక్ ఫైర్ అయ్యాడు. వయసుతో పాటు సంస్కారం, మంచితనం పెరగాలి తప్పా తగ్గకూడదంటూ విశ్వక్ ఎక్స్ లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. 

Published on: Nov 20, 2026, 17:35:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vishwak Sen: సోషల్ మీడియాలో హీరో విశ్వక్ సేన్ యాక్టివ్ గానే ఉంటాడు. తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటాడు. అదే సమయంలో తన మూవీపై నెగెటివి స్ప్రెడ్ చేసేవారి విషయంలో మాత్రం ఫైర్ అవుతాడు. తాజాగా విశ్వక్ సేన్ చేసిన ఇలాంటి ఓ ట్వీట్ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

సంస్కారం, మంచితనం అనేవి వయసుతో పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ పై విశ్వక్ సేన్ ఫైర్.. పోస్టు వైరల్! (x)
సంస్కారం, మంచితనం అనేవి వయసుతో పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ పై విశ్వక్ సేన్ ఫైర్.. పోస్టు వైరల్! (x)

విశ్వక్ సేన్ ట్వీట్

విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈఎన్ఈ రిపీట్’ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయాల్సిన టైమ్ లో విశ్వక్ సేన్ ఫుల్ కోపంతో ఊగిపోయాడు. ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. సీనియర్ జర్నలిస్ట్ వీఎస్ఎన్ మూర్తి (ఎక్స్ లో దేవి ప్రియ పేరుతో అకౌంట్)పై మండిపడ్డాడు.

సంస్కారం, మంచితనం

‘‘కుర్రాళ్ల గురించి, వాళ్ల టేస్ట్ గురించి, టెస్టోస్టిరాన్ గురించి అంచనాలు వేసేంత అప్డేటెడ్ మీరు ఉన్నారా? అని నా రివ్యూ. ఒక సినిమాను పొగడండి. కానీ మరో సినిమాను తక్కువ చేసి చూడకండి. సంస్కారం, మంచితనం అనేవి వయసుతో పెరగాలి, తరగొద్దు’’ అని విశ్వక్ సేన్ ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

ఆ ట్వీట్ కు కౌంటర్

ఈఎన్ఈ రిపీట్ సినిమాను నెగెటివ్ చేస్తూ వీఎస్ఎన్ మూర్తి పరోక్షంగా పెట్టిన ట్వీట్ కు విశ్వక్ సేన్ ఇలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోందని టాక్.

‘‘కుర్రాళ్ల సినిమా అంటే ఇది. పిచ్చి గెంతులు బూతు జోకులు కాదు. వాళ్లకు ప్రేరణ ఇచ్చే సినిమా. పెర్ ఫెక్ట్ కాస్టింగ్..విజువల్స్.. స్కోర్. రైటింగ్..ఎక్స్ ట్రా..ఎక్స్ ట్రా అంటే ఇదీ. ఇప్పుడు జనాల వంతు, మంచి సినిమా రాకపోతే రాలేదనడం కాదు మంచి వస్తే చూసి హిట్ చేయాలి’’ అని ఆకాశంలో ఒక తార సినిమాను మూర్తి పొగిడేశాడు. అదే సమయంలో పిచ్చి గెంతులు బూతు జోకులు కాదని ఈఎన్ఈ రిపీట్ గురించే అన్నారనేది సంచలనంగా మారింది.

విశ్వక్ కు సపోర్ట్

ఈ విషయంలో నెటిజన్లు విశ్వక్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ‘‘తాతకు కరెక్ట్ మొగుడివి నువ్వే’’, ‘‘విశ్వక్ భాయ్ ఫైర్’’ అంటూ ఈ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు. గురువారం (నవంబర్ 19) థియేటర్లకు వచ్చిన ఈఎన్ఈ రిపీట్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఫస్ట్ డేనే ఈ మూవీ.. ఈ నగరానికి ఏమైంది పార్ట్ 1 లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More