OTT Release: 3 కోట్ల బడ్జెట్.. 150 కోట్ల కలెక్షన్స్.. సైలెంట్ గా తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ సెన్సేషనల్ సినిమా!
OTT Release: కర్ణాటకలో ఏకంగా టాక్సిక్ సినిమానే దాటేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ చిన్న చిత్రం ‘ప్రేమద ఊరలి’. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్ గా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ స్టోరీతో పాటు పూర్తి వివరాలు చూసేయండి.
OTT Release: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా 'ప్రేమద ఊరలి'. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా 2026 సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. స్టార్ కాస్ట్ లేకపోయినా, కేవలం కథాబలంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేసింది. థియేట్రికల్ రన్ లో కర్ణాటక వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఈ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చేసింది.

ప్రైమ్ వీడియోలో గ్రాండ్ ఎంట్రీ
అద్భుతమైన విలేజ్ ఫ్యామిలీ డ్రామా ‘ప్రేమద ఊరలి’ మూవీ ఇవాళ (నవంబర్ 17) పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రిలీజైంది. మన తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమింగ్ అవుతోంది. అద్భుతమైన ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే కామెడీతో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఇంట్లోనే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.
బాక్సాఫీస్ రికార్డులు
ప్రేమద ఊరలి సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచాయి. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం రూ.3 కోట్ల తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ మౌత్ టాక్ తో స్లీపర్ హిట్ గా నిలిచి ఏకంగా రూ.150 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ గా మారింది. దాదాపు 3700% పైగా లాభాలను తీసుకొచ్చి, 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన కన్నడ సినిమాల్లో రెండవ స్థానంలో నిలిచింది.
కట్టిపడేసే కథ
ఒక అందమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ ప్రేమద ఊరలి సినిమా కథ సాగుతుంది. చదువుకోని హీరో సంతోష్ (శ్రీరామ్), అతని తండ్రి నాగన్న (రంగన రఘు) మధ్య సాగే కథ ఇది. తన కొడుకు చదువుకోకపోయినా సరే, అతనికి బాగా చదువుకున్న అమ్మాయితోనే పెళ్లి చేయాలని ఆ తండ్రి పడే తపన, ఆ క్రమంలో హీరోకి ఎదురయ్యే ప్రేమకథ, ఎమోషనల్ సవాళ్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రంగన రఘు, శ్రీరామ్, తపస్విని పూనాచా, రమిక శివు తమ అద్భుతమైన నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. సునాద్ గౌతమ్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
తెలుగులోనూ
మంచి కథ, బలమైన ఎమోషన్స్ ఉంటే మన తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ చేస్తారు. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో 'ప్రేమద ఊరలి' అఫీషియల్ గా తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ కు రావడం ఫ్యామిలీ ఆడియన్స్ కు పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ, తండ్రీ కొడుకుల బంధం ఉన్న ఈ బ్లాక్ బస్టర్ సినిమాను ఈ వీకెండ్ కు తప్పకుండా మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


