Sai Pallavi: ఓం సినిమా కోసం సాయి పల్లవి చేసిన పనికి పేరెంట్స్ షాక్.. కోపంతో వీడియో కాల్ కట్ చేసిన తల్లి.. పెద్ద సాహసమే!
Sai Pallavi: రామాయణంలో సీతగా అభిమానులను అలరిస్తున్న సాయి పల్లవి.. ఇక ధనుష్ హీరోగా రాబోతున్న ‘ఓం ఛాప్టర్ 1’లో పవర్ ఫుల్ సీబీఐ ఆఫీసర్ గా కనిపించనుంది. అయితే ఈ క్యారెక్టర్ కోసం సాయి పల్లవి చేసిన ఓ పనితో ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సాయి పల్లవే వెల్లడించింది.
Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎంపిక చేసుకునే పాత్రలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. 'రామాయణం' సినిమాలో సీతగా ఆమె ఛాలెంజింగ్ రోల్ చేసింది. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఓం: చాప్టర్ 1 – ఉధిరమ్: ది బ్లడ్ వుడ్' చిత్రంలో సిబిఐ ఆఫీసర్‌గా ఆమె కనిపించనుంది. ఈ పవర్‌ఫుల్ క్యారెక్టర్ కోసం తన ట్రేడ్‌మార్క్ అయిన తన జుట్టును కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

సాయి పల్లవి పేరెంట్స్ షాక్
తాజాగా బిహైండ్‌వుడ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. "కథ విన్న తర్వాత నా పాత్రను ఎలా చూపిస్తారో అర్థం చేసుకున్నా. ఆ పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవాలనుకున్నా. నాకు ఆ కథ ఎంతగానో నచ్చడంతో నా జుట్టు కత్తిరించుకోవడానికి కూడా సిద్ధమయ్యా. కటింగ్ పూర్తయ్యాక నా కొత్త లుక్‌ను ముందుగా మా అమ్మకు వీడియో కాల్ చేసి చూపించా.
ఆమె తీవ్ర ఆశ్చర్యానికి గురై, ఎందుకిలా చేశావంటూ ప్రశ్నల వర్షం కురిపించి కాల్ కట్ చేసింది. ఆ తర్వాత మా నాన్న ఫోన్ చేసి, నువ్వు విగ్గు పెట్టుకున్నావా? అని అడిగారు. ఇది పూర్తిగా సినిమా క్యారెక్టర్ కోసమే అని వివరించా. నా కొత్త లుక్‌కి అలవాటు పడటానికి వారికి చాలా సమయం పట్టింది" అని సాయి పల్లవి నవ్వుతూ చెప్పుకొచ్చింది.
దర్శకుడిపై పూర్తి నమ్మకంతోనే..
సాయి పల్లవికి దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో ఓం రెండో సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అమరన్' ఘనవిజయం సాధించడమే కాకుండా, రాజ్‌కుమార్‌కు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఆ నమ్మకంతోనే సాయి పల్లవి ఈ రిస్క్ చేశారు.
లీక్ కాకుండా
ఓం మూవీ షూటింగ్ సమయంలో తన కొత్త లుక్ బయటకు లీక్ కాకుండా ఉండేందుకు సాయి పల్లవి ఎప్పుడూ స్కార్ఫ్ కట్టుకుని తిరిగేవారట. ఈ విషయంపై దర్శకుడు రాజ్‌కుమార్ స్పందిస్తూ.. ‘‘హీరోలు తమ పాత్ర కోసం ఎలాగైతే మేకోవర్ అవుతారో, సాయి పల్లవి కూడా ఈ సినిమా కోసం అలాంటి త్యాగమే చేసింది. కథపై ఆమెకున్న ప్రేమే ఈ మార్పునకు కారణం" అని ప్రశంసించారు.
ఓం ఛాప్టర్ 1 గురించి
ధనుష్ హీరోగా నటిస్తున్న ఓం ఛాప్టర్ 1లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో శ్రీలీల, సంజయ్ స్వరూప్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


