Sai Pallavi: రామాయణం సినిమాలో సీతమ్మగా సాయి పల్లవి.. కళ్లు చెదిరేలా రెమ్యునరేషన్.. మామూలు డిమాండ్ కాదు బాబోయ్!
Sai Pallavi Ramayana Remuneration: బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణం'లో సీతాదేవి పాత్ర కోసం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఆమె డిమాండ్ మామూలుగా లేదని బాలీవుడ్ కోడై కూస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.
Sai Pallavi Ramayana Remuneration: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రామాయణం'. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా కేజీఎఫ్ ఫేమ్ యశ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో.. సీతమ్మ పాత్రను సాయి పల్లవి పోషిస్తున్న సంగతి తెలిసిందే.

సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంత?
అందచందాల కంటే నటనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి పారితోషికం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. జాతీయ మీడియా, పలు ప్రముఖ వెబ్ సైట్ల కథనాల ప్రకారం.. రామాయణం సిరీస్ (మొత్తం భాగాలు కలుపుకుని) కోసం సాయి పల్లవి ఏకంగా రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
అంటే ఒక్కో భాగానికి సగటున రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు సాయి పల్లవి పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది. దక్షిణాది హీరోయిన్లకు ఈ స్థాయిలో బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ లభించడం చాలా అరుదైన విషయం.
సాయి పల్లవికి అంత డిమాండ్ ఎందుకు?
కమర్షియల్ సినిమాల మోజులో పడి గ్లామర్ షో చేసే ప్రస్తుత తరం హీరోయిన్లకు భిన్నంగా, సాయి పల్లవి తనదైన ముద్ర వేస్తోంది. ఆమె కథ నచ్చితేనే ఏ సినిమాకైనా ఓకే చెబుతుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. అందుకే ఆమెకు స్టార్ హీరోలతో సమానమైన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ నుంచి రీసెంట్ గా వచ్చిన 'అమరన్', 'తండేల్' వరకు ఆమె ఎంచుకున్న కథలే సాయి పల్లవి బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచేశాయి.
ఇలా ఎదిగింది?
కెరీర్ మొదట్లో సాయి పల్లవి పారితోషికం లక్షల్లో మాత్రమే ఉండేది. నైతిక విలువలకు పెద్దపీట వేసే సాయి పల్లవి.. గతంలో తాను నటించిన 'పడి పడి లేచే మనసు' సినిమా ఫ్లాప్ అయి.. నిర్మాత నష్టపోతే, తన రెమ్యునరేషన్ లోని రూ.40 లక్షలను వెనక్కి ఇచ్చేసి గొప్ప మనసు చాటుకుంది.
అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం, నటనతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. ఆమె గత సినిమాలతో పోలిస్తే రామాయణం సినిమాకు తీసుకుంటున్న పారితోషికం దాదాపు రెట్టింపు అని చెప్పవచ్చు. కేవలం అందం మాత్రమే కాదు, అద్భుతమైన టాలెంట్, క్రమశిక్షణ ఉంటే సక్సెస్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరుగుతుందని సాయి పల్లవి నిరూపించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


