Sai Pallavi: కాబోయే భర్త గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన సాయి పల్లవి.. అతనికి ఆ పని కచ్చితంగా రావాలట!

Sai Pallavi: బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ 'రామాయణం' ప్రమోషన్స్‌లో సాయి పల్లవి బిజీగా ఉంది. తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' షోలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా తన కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు, డాక్టర్ వృత్తిని వదిలి నటనవైపు రావడంపై సాయి పల్లవి కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: Oct 29, 2026, 09:31:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sai Pallavi: నేచురల్ యాక్టింగ్, తనదైన గ్రేస్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం పార్ట్ 1'లో ఆమె సీతాదేవిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

కాబోయే భర్త గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన సాయి పల్లవి.. అతనికి ఆ పని కచ్చితంగా రావాలట!
కాబోయే భర్త గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన సాయి పల్లవి.. అతనికి ఆ పని కచ్చితంగా రావాలట!

రామాయణం ప్రమోషన్స్

నవంబర్ 5న రామాయణం ఫస్ట్ పార్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ర‌ణ్‌బీర్‌ కపూర్, రవి దూబేలతో కలిసి సాయి పల్లవి ప్రముఖ టెలివిజన్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' (KBC 18)లో సందడి చేశారు.

కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు

ఈ షోలో బాలీవుడ్ మెగాస్టార్, హోస్ట్ అమితాబ్ బచ్చన్.. సాయి పల్లవిని అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "మీ జీవిత భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు కోరుకుంటున్నారు?" అని బిగ్ బీ అడగగా.. సాయి పల్లవి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

"అతను ముందుగా ఒక మంచి మనిషి అయి ఉండాలి. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించే స్వార్థపరుడు కాకూడదు. తనను తాను విశ్లేషించుకునే తత్వం ఉండాలి. ఎవరైనా తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పులను సరిదిద్దుకునే వ్యక్తిత్వం ఉండాలి.

జరిగిన తప్పునకు ఇతరులపై నిందలు వేసే రకం కాకూడదు. నా లిస్ట్ పెద్దగా ఏమీ లేదు కానీ.. అతను మంచివాడై ఉండాలి. దానికి తోడు అతనికి వంట చేయడం కూడా వస్తే మరీ మంచిది" అని నవ్వుతూ సాయిపల్లవి చెప్పింది.

డాక్టర్ నుంచి యాక్టర్

వైద్య విద్యను అభ్యసించిన మీరు, నటన వైపు ఎందుకు రావాలనుకున్నారు? అని అమితాబ్ ప్రశ్నించగా.. "నేను నటించాలని ఆ దేవుడే రాసిపెట్టాడు" అని సాయి పల్లవి బదులిచ్చింది.

ఆమె సమాధానానికి అమితాబ్ కాస్త ఆశ్చర్యపోగా.. పక్కనే ఉన్న ర‌ణ్‌బీర్‌ కపూర్ కలుగజేసుకుని.. "ఆమె నటించాలని భగవంతుడు రాసిన ప్రిస్క్రిప్షన్ అది సార్" అని సరదాగా అనడంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు.

సీతమ్మ పాత్రపై సాయి పల్లవి రియాక్షన్

రామాయణంలో సీత పాత్ర ఆఫర్ వచ్చినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉందో కూడా సాయి పల్లవి వివరించింది. "సాధారణంగా ఏదైనా పాత్ర దక్కితే, ఆ క్యారెక్టర్‌కి నేను ఏం ఇవ్వగలను అని ఆలోచిస్తాను. కానీ తొలిసారిగా.. సీతమ్మ పాత్ర ద్వారా నేను ఏం పొందగలను? ఇలాంటి గొప్ప పాత్ర ద్వారా నేను ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించగలను? అని ఆలోచించాను. సీతమ్మను ప్రార్థించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లా" అని సాయి పల్లవి ఎమోషనల్ అయింది.

భారీ బడ్జెట్‌తో రామాయణం

దాదాపు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో యష్, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ రెండు భాగాలుగా రాబోతోంది. ర‌ణ్‌బీర్‌ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా.. రాముడి తమ్ముడు లక్ష్మణుడిగా రవి దూబే, రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.

అలాగే అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణం పార్ట్ 1' నవంబర్ 5, 2026న థియేటర్లలోకి రానుండగా, రెండవ భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More