Kiran Abbavaram: సుకుమార్ శిష్యుడు వీరాతో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా..మిస్టీరియస్ కాన్సెప్ట్ తో టైటిల్ పోస్టర్..పేరు ఇదే

Kiran Abbavaram Record: కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే కిరణ్ అబ్బవరం మరో కొత్త ప్రయోగంతో రాబోతున్నారు. సుకుమారు శిష్యుడు వీరా కోగటం దర్శకుడిగా పరిచయం కాబోతున్న సినిమాలో కిరణ్ అబ్బవరం హీరో. ఈ మూవీ పూజా కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ సినిమా టైటిల్, పోస్టర్ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. 

Published on: Nov 23, 2026, 13:14:10 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తKiran Abbavaram Record: వరుసగా హిట్లతో సూపర్ జోష్ లో ఉన్న టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. సుకుమార్ శిష్యుడు వీరా కోగటం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘రికార్డు’ అనే టైటిల్ ప్రకటించారు. ఇవాళ (నవంబర్ 23) ఈ చిత్రం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.

సుకుమార్ శిష్యుడు వీరాతో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా..మిస్టీరియస్ కాన్సెప్ట్ తో టైటిల్ పోస్టర్..పేరు ఇదే
సుకుమార్ శిష్యుడు వీరాతో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా..మిస్టీరియస్ కాన్సెప్ట్ తో టైటిల్ పోస్టర్..పేరు ఇదే

కిరణ్ అబ్బవరం రికార్డు

‘క’ సినిమాతో తన కెరీర్ లో అదిరే టర్న్ తీసుకున్న కిరణ్ అబ్బవరం ఇక ఆగేదేలే అన్నట్లు స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. కొత్త డైరెక్టర్ వీరా కోగటం దర్శకత్వంలో ‘రికార్డు’ అనే మూవీని సోమవారం అనౌన్స్ చేశారు.

సుకుమార్, దిల్ రాజు సమక్షంలో

‘రికార్డు’ మూవీ పూజా కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సుకుమార్, దిల్ రాజు, ఎస్కేఎన్, బన్నీ వాసు తదితరులు గెస్ట్ లుగా వచ్చారు. సుకుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా దిల్ రాజు క్లాప్ కొట్టారు. ఫస్ట్ సీన్ కు బన్నీ వాస్ దర్శకత్వం వహించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మిస్టరీ థ్రిల్లర్ గా

రికార్డు మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తే ఇదొక మిస్టరీ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ పోస్టర్ లో కొమ్ములకు గంటలతో ఉన్న ఎద్దు ఉండటం కథపై ఆసక్తిని మరింత పెంచుతోంది. సుకుమార్ రైటింగ్స్, త్రీ స్టోరీస్, వంశీ నడిపాటి ఎంటర్ టైన్మెంట్స్ కలిసి ఈ రికార్డు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

మంచి కథతో

రికార్డు మూవీ పూజా కార్యక్రమం సందర్బంగా కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. వీరా అన్న మంచి కథతో ముందుకు వచ్చారని, కచ్చితంగా మంచి సినిమా అందిస్తామని కిరణ్ చెప్పాడు. ఇక కొండరెడ్డి బురుజు సాక్షిగా మంచి సినిమా ఇస్తామని వీరా కోగటం తెలిపాడు.

వీరా కోగటం 18 ఏళ్లుగా మీడియా రంగంలో పని చేశాడు. ఆ తర్వాత దర్శకత్వంపై పిచ్చితో సుకుమార్ దగ్గర శిష్యుడిగా చేరాడు. పుష్ప సినిమాలకు అసిస్టెంట్ గా పని చేశాడు. ఇప్పుడు రికార్డు మూవీతో దర్శకుడిగా మారాడు.

సొంత దర్శకత్వంలో

మరోవైపు కిరణ్ అబ్బవరం తన సొంత డైరెక్షన్ లో రియాలిటీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. మరోవైపు ప్రొడ్యూసర్ గానూ కిరణ్ అబ్బవరం జోరు చూపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.