ENE Repeat AOT Box Office: బాక్సాఫీస్ వద్ద 'ఈఎన్ఈ రిపీట్' జాతర.. ఆకాశంలో ఒక తార వసూళ్లు ఎన్నంటే?

ENE Repeat AOT Box Office: తరుణ్ భాస్కర్ బడ్డీ కామెడీ ‘ఈఎన్ఈ రిపీట్’, దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. నవంబర్ 19న విడుదలైన 'ఈఎన్ఈ రిపీట్' నాలుగు రోజుల వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.

Published on: Nov 23, 2026, 11:45:50 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ENE Repeat AOT Box Office: తెలుగు బాక్సాఫీస్ వద్ద రెండు భిన్నమైన జానర్ సినిమాల మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది. ఒకవైపు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కల్ట్ కామెడీ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’, మరోవైపు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’థియేటర్లలో సందడి చేశాయి.

ENE Repeat AOT Box Office: బాక్సాఫీస్ వద్ద 'ఈఎన్ఈ రిపీట్' జాతర.. ఆకాశంలో ఒక తార వసూళ్లు ఎన్నంటే?
ENE Repeat AOT Box Office: బాక్సాఫీస్ వద్ద 'ఈఎన్ఈ రిపీట్' జాతర.. ఆకాశంలో ఒక తార వసూళ్లు ఎన్నంటే?

అయితే వీకెండ్ ముగిసేసరికి బాక్సాఫీస్ లెక్కలు ఆసక్తికరమైన ఫలితాన్ని ఇచ్చాయి. యూత్ అండ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ అండతో 'ఈఎన్ఈ రిపీట్' బాక్సాఫీస్ విజేతగా నిలవగా, పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ 'ఆకాశంలో ఒక తార' ఓపెనింగ్స్ విషయంలో కాస్త వెనుకబడింది.

బాక్సాఫీస్ వద్ద 'ఈఎన్ఈ రిపీట్' జాతర.. 4 రోజుల్లో రూ.35 కోట్లు

నవంబర్ 18న పెయిడ్ ప్రీమియర్లతో, నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తరుణ్ భాస్కర్ బడ్డీ కామెడీ మూవీ 'ఈఎన్ఈ రిపీట్' (విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను) నాలుగు రోజుల ఎక్స్‌టెండెడ్ వీకెండ్‌లో అదరగొట్టింది. ఈ సినిమా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.41.62 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మొత్తం వసూళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి రూ.30 కోట్ల గ్రాస్ రాగా, అందులో మెజారిటీ వాటా కేవలం హైదరాబాద్ నగరం నుంచే రావడం విశేషం. ఇక నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద 1.3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.

సినిమా బడ్జెట్, ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే 'ఈఎన్ఈ రిపీట్' ఇప్పటికే లాభాల బాట పట్టి ‘హిట్’గా నిలిచింది. ఇక సోమవారం నుంచి వీక్‌డేస్‌లో ఈ జోరు ఎంతవరకు కొనసాగుతుందనే దానిపై సినిమా ఫైనల్ రేంజ్ ఆధారపడి ఉంటుంది.

రివ్యూలు బాగున్నా.. యావరేజ్ ఓపెనింగ్స్‌తో సరిపెట్టుకున్న ‘ఆకాశంలో ఒక తార’

పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, కొత్త నటి సాత్విక వీరవల్లి నటించిన 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20న తెలుగు, మలయాళ భాషల్లో విడుదలైంది. గురువారం రాత్రి ప్రీమియర్ల నుంచే ఈ సినిమాకు ఎక్సలెంట్ రివ్యూలు రావడమే కాకుండా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు.

అద్భుతమైన మౌత్ టాక్ ఉన్నప్పటికీ, మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లో కలిపి రూ.22 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ వాటా కేవలం రూ.11.20 కోట్లు కావడం ట్రేడ్ వర్గాలను కాస్త నిరాశపరిచింది. దీనితో తొలి వీకెండ్‌ను ఈ చిత్రం యావరేజ్ స్థాయిలో ముగించింది.

అయితే శుక్ర, శనివారాలతో పోలిస్తే ఆదివారం నాడు ఈ సినిమా కలెక్షన్లలో గణనీయమైన జంప్ కనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు కదులుతుండటంతో, బలమైన మౌత్ టాక్ సాయంతో రాబోయే రోజుల్లో 'ఆకాశంలో ఒక తార' నిలకడగా వసూళ్లు రాబడుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

మొత్తానికి ఒకే వీకెండ్‌లో వచ్చిన ఈ రెండు చిత్రాల్లో 'ఈఎన్ఈ రిపీట్' మాస్ అండ్ యూత్ పల్స్ పట్టుకుని వేగంగా బ్రేక్-ఈవెన్ పూర్తి చేసుకోగా, 'ఆకాశంలో ఒక తార' లాంగ్ రన్‌పై ఆశలు పెట్టుకుంది.

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.