Ramayana Release: బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్‌బీర్ కపూర్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ విజువల్ వండర్ 'రామాయణం' రిలీజ్ ప్లానింగ్‌పై ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఒక పెద్ద బాంబు పేల్చారు. విదేశాల్లో నవంబర్ 6న రిలీజ్ అవుతున్న ఈ విజువల్ వండర్, ఇండియాలో మాత్రం రెండు రోజుల ఆలస్యంగా దీపావళి పండుగ నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెండు రోజులు ఆలస్యంగా ఇండియాలో.. ఎందుకిలా?

ఇటీవల విడుదలైన 'రామాయణం' ఇంగ్లీష్ ట్రైలర్‌లో నవంబర్ 6న థియేటర్లలోకి వస్తున్నట్లు స్పష్టంగా ప్రదర్శించారు. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ రెండు విభిన్న రిలీజ్ తేదీలపై ప్రైమ్ ఫోకస్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా తాజాగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు.
ఓవర్సీస్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 6) రిలీజ్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అంతర్జాతీయంగా శుక్రవారం రోజే గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇండియాలో మాత్రం దీపావళి పండుగ శుభదినాన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తమ మెయిన్ టార్గెట్ అని స్పష్టం చేశారు.
అయితే దీనిపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల గ్యాప్ అంటే పైరసీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఓవర్సీస్ నుంచి పైరసీ ప్రింట్ బయటకు వస్తే దాని ప్రభావం ఇండియాపై పడుతుందన్నది వాళ్ల ఆందోళనగా కనిపిస్తోంది.
వరల్డ్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ విజువల్ ఫీస్ట్
దాదాపు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ గ్లోబల్ ప్రమోషన్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా వ్యూస్ సాధించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో ఏకంగా 50,000 అంతర్జాతీయ స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించడానికి మేకర్స్ భారీ ప్లాన్ చేశారు. ఇండియాలోని స్క్రీన్లతో కలిపి మొత్తం 59,000 థియేటర్లలో గ్రాండ్‌గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్, హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్ 2' రికార్డులను కూడా దాటేశేలా కనిపిస్తోంది.
ఆస్కార్ విజేతల మ్యూజిక్.. మైండ్ బ్లాకింగ్ కాస్టింగ్
{{/usCountry}}గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో ఏకంగా 50,000 అంతర్జాతీయ స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించడానికి మేకర్స్ భారీ ప్లాన్ చేశారు. ఇండియాలోని స్క్రీన్లతో కలిపి మొత్తం 59,000 థియేటర్లలో గ్రాండ్‌గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్, హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్ 2' రికార్డులను కూడా దాటేశేలా కనిపిస్తోంది.
ఆస్కార్ విజేతల మ్యూజిక్.. మైండ్ బ్లాకింగ్ కాస్టింగ్
{{/usCountry}}ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని స్థాయిలో ఏకంగా రెండు భాగాలుగా ఈ విజువల్ సాగాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మొదటి భాగం నవంబర్ దీపావళికి రిలీజ్ అవుతుండగా, రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది.
ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ హన్స్ జిమ్మర్ కాంబినేషన్‌లో వస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలవనుంది. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ అద్భుతమైన మేకింగ్‌తో ఈ ఎపిక్‌ను ఆవిష్కరిస్తున్నారు.
నటీనటుల విషయానికి వస్తే సన్నీ డియోల్ హనుమంతుడిగా, అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కుణాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న, ఇండియాలో నవంబర్ 8న దీపావళి ధమాకాగా వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్‌లో నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.