Yash Horror Movies: నాకు భయపడటం ఇష్టం ఉండదు.. డబ్బలిచ్చి మరీ ఎందుకు భయపడాలి.. అందుకే హారర్ సినిమాలు చూడను: యశ్

Yash Horror Movies: యశ్ హారర్ సినిమాలు చూడటానికి అస్సలు ఇష్టపడరట. దీనికి కారణం తనకు భయపడటం ఇష్టం లేకపోవడమేనట. అంతేకాదు డబ్బులిచ్చి మరీ భయపడటం ఎందుకు అని కూడా అంటున్నారు.

Published on: Jul 30, 2026, 22:20:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Yash Horror Movies: 'కేజీఎఫ్' (KGF) సిరీస్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డుల సునామీ సృష్టించి, ప్రస్తుతం 'రామాయణం' (Ramayana) సినిమాలో లంకేశ్వరుడిగా రచ్చ చేస్తున్న రాకింగ్ స్టార్ యశ్ తన వ్యక్తిగత అలవాట్ల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. వెండితెరపై ఎంతటి భయంకరమైన శత్రువునైనా మట్టికరిపించే మాస్ హీరోగా కనిపించే యశ్.. రియల్ లైఫ్‌లో హారర్ సినిమాలు చూసేందుకు అస్సలు ఇష్టపడనని తెలిపారు.

Yash Horror Movies: నాకు భయపడటం ఇష్టం ఉండదు.. డబ్బలిచ్చి మరీ ఎందుకు భయపడాలి.. అందుకే హారర్ సినిమాలు చూడను: యశ్
Yash Horror Movies: నాకు భయపడటం ఇష్టం ఉండదు.. డబ్బలిచ్చి మరీ ఎందుకు భయపడాలి.. అందుకే హారర్ సినిమాలు చూడను: యశ్

ఇటీవల వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన యశ్.. తాను దెయ్యాల సినిమాలు లేదా హారర్ కంటెంట్‌కు ఎందుకు దూరంగా ఉంటారో సరదాగా వెల్లడించారు.

భయపడటం ఇష్టం ఉండదు

"నాకు భయపడటం అస్సలు ఇష్టముండదు. మనకు మనంగా థియేటర్‌కి వెళ్లి డబ్బులు ఇచ్చి మరీ ఎందుకు భయపడాలి? హారర్ సినిమాలు చూస్తే అనవసరంగా గుండె వేగం పెరుగుతుంది. అందుకే నేను ఆ జోనర్‌కి చాలా దూరంగా ఉంటాను" అని యశ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

సినిమా అంటే మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేలా, ఇన్స్‌పైర్ అయ్యేలా ఉండాలి కానీ భయంతో వణికిపోయేలా ఉండకూడదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

'కేజీఎఫ్' నుంచి 'రామాయణం', 'టాక్సిక్' వరకు..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్ ఛాప్టర్ 1', 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' చిత్రాలతో యశ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1,200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కన్నడ పరిశ్రమ రేంజ్‌ను మార్చేశాయి. రాకీ భాయ్‌గా ఆయన చూపించిన స్వైరవిహారం, డైలాగ్ డెలివరీ ప్రతీ ఒక్కరినీ కట్టిపడేసాయి.

ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రూ. 4,000 కోట్ల బడ్జెట్ విజువల్ వండర్ 'రామాయణం'లో యశ్ లంకేశ్వరుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో రాయల్ లుక్, గంభీరమైన వాయిస్‌తో రావణుడిగా యశ్ చూపించిన రాజసం చూసి సినీ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ సినిమా మొదటి భాగం నవంబర్ 8న దివాళీ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

దీనితో పాటు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-ups) అనే ఇంటెన్స్ డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌లోనూ యశ్ నటిస్తున్నారు.

ఫ్యాన్స్ మైండ్ బ్లాక్.. మాస్ హీరోలో ఈ కోణం ఉందా

స్క్రీన్ మీద కొండలనైనా పిండి చేసేంత పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపించే రాకింగ్ స్టార్, రియల్ లైఫ్‌లో హారర్ సినిమాలకు భయపడతానని చెప్పడం అభిమానులకు భలే సరదాగా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ వైరల్ అవ్వడంతో "స్క్రీన్ మీద విలన్లను భయపెట్టే రాకీ భాయ్, హారర్ సినిమాలకు భయపడతారా!" అంటూ ఫ్యాన్స్ క్యూట్ కామెంట్లు పెడుతున్నారు.

మాస్, యాక్షన్, ఎమోషనల్ కథలతో ప్రేక్షకులను మెప్పించే యశ్, భవిష్యత్తులో కూడా థ్రిల్లింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ కంటెంట్‌తోనే రాబోతున్నట్లు స్పష్టం చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More