Ramayana Pakistan: రామాయణ ట్రైలర్ చూసి ఫిదా అయిపోయిన పాకిస్థాన్ ఆడియెన్స్.. యశ్‌ని చూసి షాక్.. ఇంత బడ్జెట్ ఎక్కడిదంటూ..

Ramayana Pakistan: రామాయణ మూవీ ట్రైలర్ చూసి ఇండియన్ ఆడియెన్సే కాదు.. పాకిస్థాన్ ఆడియెన్స్ కూడా ఫిదా అయిపోయారు. పలువురు ఇచ్చిన ఆన్‌లైన్ రివ్యూలు చూస్తుంటే.. వాళ్లకు ఈ ట్రైలర్ ఎంతలా నచ్చిందో అర్థమవుతోంది. ఇండియా దగ్గర ఇంత బడ్జెట్ ఎక్కడిదంటూ ఆశ్చర్యపోతున్నారు.

Published on: Jul 31, 2026, 14:50:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ramayana Pakistan: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్ కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించిన 'రామాయణం' (Ramayana) ట్రైలర్ సోషల్ మీడియాలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. కేవలం భారతీయ ప్రేక్షకులే కాకుండా దాయాది దేశమైన పాకిస్తాన్ యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు కూడా ఈ విజువల్ వండర్‌కు ఫిదా అయిపోతున్నారు. సరిహద్దులు దాటి పాకిస్తాన్‌లో వైరల్ అవుతున్న రియాక్షన్ వీడియోలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Ramayana Pakistan: రామాయణ ట్రైలర్ చూసి ఫిదా అయిపోయిన పాకిస్థాన్ ఆడియెన్స్.. యశ్‌ని చూసి షాక్.. ఇంత బడ్జెట్ ఎక్కడిదంటూ..
Ramayana Pakistan: రామాయణ ట్రైలర్ చూసి ఫిదా అయిపోయిన పాకిస్థాన్ ఆడియెన్స్.. యశ్‌ని చూసి షాక్.. ఇంత బడ్జెట్ ఎక్కడిదంటూ..

“భారతీయ సినిమా ఇన్ని వేల కోట్లు పెడుతోందా?”

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మావియా ఉమర్ ఫారూకీ (Maviya Umer Farooqui) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పెషల్ రియాక్షన్ వీడియోను షేర్ చేశారు. "ఒక్కసారి ఊహించండి, రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వాడటం మైండ్ బ్లాకింగ్ అనిపిస్తోంది. నేను ఒక పాకిస్తానీగా చెప్తున్నా, ఈ రామాయణ ట్రైలర్ చూశాక సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎగ్జైట్ అవుతున్నా" అని ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకురావడం, ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉండటంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రణ్‌బీర్ కపూర్, యశ్ ఇద్దరి ఎంట్రీ సీన్లు కేక పుట్టించాయని, నటన పరంగా వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడటం ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్నారు.

“రావణుడిగా యశ్ ఎంట్రీ వేరే లెవెల్!”

మరో పాకిస్తానీ యూట్యూబర్ హస్నాత్ ఖాన్ (Hasnaat Khan) కూడా ఈ ట్రైలర్‌పై స్పందించారు. "రావణాసురుడిగా యశ్ లుక్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సీజీఐ వర్క్, యానిమేషన్, స్టంట్స్ చాలా నీట్‌గా చేశారు. యాక్షన్ సీన్స్ చూస్తుంటే నిజంగా వావ్ అనిపిస్తోంది" అని ఆయన కామెంట్ చేశారు.

అలాగే పాకిస్తానీ రియాక్షన్ బాయ్, ఇమాన్ మోఅజ్జమ్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి యూట్యూబ్ ఛానెళ్లు కూడా సాయి పల్లవి ప్రదర్శించిన సీతాదేవి పాత్రపై ప్రత్యేకంగా మాట్లాడాయి. సాయి పల్లవి సహజ సిద్ధమైన లుక్, సాంప్రదాయ దుస్తులు సీతాదేవి పాత్రకి పర్‌ఫెక్ట్ సెట్ అయ్యాయని, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉందంటూ మెచ్చుకున్నారు.

రెండు భాగాలుగా రామాయణం.. దివాళీ కానుకగా గ్రాండ్ రిలీజ్

ఈ ట్రైలర్‌లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, లక్ష్మణుడిగా రవి దూబే రాక్షసులతో పోరాడే దృశ్యాలు, కైకేయి (లారా దత్తా)తో ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ల వనవాసానికి వెళ్లే ఘట్టాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ ఈ ఎపిక్ కావ్యాన్ని ప్రతి భారతీయుడు గర్వపడేలా తీర్చిదిద్దుతున్నారు.

డీఎన్‌ఈజీ (DNEG) హెడ్ నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ రూ. 4000 కోట్ల పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ మొదటి భాగం ఈ ఏడాది నవంబర్ 8న దివాళీ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక రెండో భాగం 2027లో విడుదల కాబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More