...
...
Next Story

సౌందర్య పేరు వినగానే కంటతడి పెట్టిన రమ్యకృష్ణ.. జగపతి బాబు షోలో హార్ట్ టచింగ్ మూమెంట్

రమ్యకృష్ణ కంటతడి పెట్టింది. దివంగత నటి సౌందర్య పేరు వినగానే ఆమె ఏడ్చేసింది. జీ5లో వచ్చే జగపతి బాబు షో జయమ్ము నిశ్చయమ్ము రాలో గెస్ట్ గా వచ్చిన ఆమె.. సౌందర్యతో కలిసి తాను నటించిన నరసింహ మూవీ సీన్ చూడగానే కంటతడి పెట్టింది.

Published on: Oct 27, 2025, 21:00:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నటి రమ్యకృష్ణ ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ5 (Zee5) టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’కు వచ్చింది. ఆ షోలో తమ స్నేహితురాలు, దివంగత నటి సౌందర్య (Soundarya) గురించి మాట్లాడేటప్పుడు రమ్యకృష్ణ భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టింది. అమ్మోరు, నరసింహ వంటి చిత్రాల షూటింగ్ సమయంలోని జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంది.

సౌందర్యను తలచుకుని ఏడ్చేసిన రమ్యకృష్ణ

సౌందర్య పేరు వినగానే కంటతడి పెట్టిన రమ్యకృష్ణ.. జగపతి బాబు షోలో హార్ట్ టచింగ్ మూమెంట్
సౌందర్య పేరు వినగానే కంటతడి పెట్టిన రమ్యకృష్ణ.. జగపతి బాబు షోలో హార్ట్ టచింగ్ మూమెంట్

జగపతి బాబు తన జయమ్ము నిశ్చయమ్ము రా షోలో రమ్యకృష్ణతో మాట్లాడుతూ.. "మన ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న ఒక స్నేహితురాలి గురించి మాట్లాడాలనుకుంటున్నాను" అని చెప్పాడు. మొదట్లో ఉత్సాహంగా కనిపించిన రమ్యకృష్ణ.. తర్వాత సౌందర్య కనిపించగానే షాక్ తిన్నట్లుగా అనిపించింది. 1999లో వచ్చిన హిట్ మూవీ నరసింహలో తనతోపాటు నటించిన సౌందర్య క్లిప్‌ను చూసిన వెంటనే ఆమె కళ్లలో నీళ్లు తిరగడం మొదలైంది. ఆ వెంటనే ఆమె కళ్లలో నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి.

ఆమె పరిస్థితిని గమనించిన జగపతి బాబు.. "మేము ఆ క్లిప్‌ను ప్లే చేశాం, ఎందుకంటే ఇది మనం గుర్తుంచుకోవాల్సిన క్షణం. సౌందర్య పేరు లాగే ఆమె హృదయం కూడా చాలా సౌందర్యంగా ఉండేది" అని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత.. జగపతి బాబు, సౌందర్యతో తన జ్ఞాపకాలను పంచుకోమని రమ్యకృష్ణను అడిగాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె ఇలా చెప్పింది.

"నేను సౌందర్యను మొదటిసారి అమ్మోరు (1995) షూటింగ్ సమయంలో చూశాను. నరసింహ సహా నేను ఆమెతో చాలా సినిమాల్లో పనిచేశాను. అమాయకురాలైన, సహజమైన, అందమైన చిన్నారి పెరిగి పెద్దదై తనను తాను తీర్చిదిద్దుకోవడం చూశాను. ఆమె తనకు వచ్చిన కీర్తికి ఏమాత్రం లొంగిపోలేదు. ఆమె ఒక అద్భుతమైన మనిషి, మంచి స్నేహితురాలు" అని రమ్యకృష్ణ పేర్కొంది. సౌందర్యతో తన స్నేహాన్ని వివరిస్తూ.. తమ పాత ఫొటోలను చూస్తూ రమ్యకృష్ణ చాలా భావోద్వేగానికి గురయింది.

సౌందర్య గురించి..

2003 ఏప్రిల్ 27న ఆమె వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన జి.ఎస్. రఘును పెళ్లి చేసుకుంది. వారి మొదటి వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు అంటే 2004 ఏప్రిల్ 17న, సౌందర్య తన సోదరుడు అమర్‌నాథ్‌తో కలిసి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి బెంగళూరు నుంచి కరీంనగర్ కు వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe