Ameerlog Trailer: హైదరాబాద్ బస్తీ లోకల్ ఫ్లేవర్‌తో మరో మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బస్తీ పోరగాళ్లు చేసే హంగామాతో థియేటర్లలో మార్మోగనున్నాయి. దగ్గుబాటి రానా సమర్పణలో అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'అమీర్ లోగ్' మూవీ థియేట్రికల్ ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్ అయి యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గల్లీ క్రికెట్ నుంచి 'కిరాక్ బిర్యానీ' బిజినెస్ దాకా..

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. మనోహర్ రెడ్డి మంచూరి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి 'స్పిరిట్ మీడియా' పతాకంపై ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ హైదరాబాద్‌లోని ఒక లోకల్ బస్తీలో ఉండే నలుగురు యంగ్ కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. రోజూ గల్లీ క్రికెట్, ఫ్రెండ్‌షిప్, వీధి దాబాల దగ్గర హడావుడి, ఫ్యామిలీ ప్రెజర్స్, మెరుగైన భవిష్యత్తు కోసం కలలు కనడం వారి రొటీన్ లైఫ్‌గా సాగుతుంది.
అయితే ఊరికే ఒక లోకల్ విందులో అనుకోకుండా వచ్చిన చిన్న ఐడియా వాళ్ల జీవితాలను మలుపు తిప్పుతుంది. ఆ ఐడియానే 'కిరాక్ బిర్యానీ' స్టార్టప్ బిజినెస్. ఆ సాదాసీదా బిర్యానీ వ్యాపారంలోకి దిగిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి ఊహించని ట్విస్టులు వచ్చాయో చాలా ఫన్నీగా చూపించారు.
హైదరాబాద్ లోకల్ వైబ్స్.. ఎమోషనల్ సీన్స్
ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేధ జలంధర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించి స్క్రీన్ పై అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. వాళ్ల మాటలు, సరదా గొడవలు, బస్తీ యాస రియల్ లైఫ్ క్యారెక్టర్లను గుర్తుకు తెచ్చేలా ఎంతో నాచురల్‌గా కుదిరాయి.
డైరెక్టర్ రమణ రెడ్డి సోమ హైదరాబాద్ లోకల్ ఫ్లేవర్ ను పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. యూత్ ఆశయాలను, తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చే కామెడీని, ఎమోషన్‌ను సరైన పాళ్లలో మిక్స్ చేసి ప్రతి సీన్‌ను రక్తి కట్టించారు.
{{/usCountry}}డైరెక్టర్ రమణ రెడ్డి సోమ హైదరాబాద్ లోకల్ ఫ్లేవర్ ను పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. యూత్ ఆశయాలను, తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చే కామెడీని, ఎమోషన్‌ను సరైన పాళ్లలో మిక్స్ చేసి ప్రతి సీన్‌ను రక్తి కట్టించారు.
{{/usCountry}}ఎస్వీకే అందించిన విజువల్స్ హైదరాబాద్ బస్తీల రంగూ రుచీ సరికొత్తగా ప్రెజెంట్ చేశాయి. స్మరన్ సాయి అందించిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ టెంపోను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తుండటంతో 'అమీర్ లోగ్' ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. వినోదానికి ప్రాధాన్యమిస్తూ తెరకెక్కించిన ఈ యంగ్ అండ్ ఫ్రెష్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది.
అయితే అదే రోజు మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి కూడా థియేటర్లలో రిలీజ్ కానుండటంతో ఈ అమీర్ లోగ్ మూవీకి గట్టి పోటీ ఉండనుంది. ఇరుముడి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చిన నేపథ్యంలో ఈ అమీర్ లోగ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.