టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో, కాస్త వైలెంట్ టచ్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 13న జపాన్‌లో భారీ ఎత్తున విడుదల కానుంది.

ప్రమోషన్లలో భాగంగా జపాన్ వెళ్ళిన యానిమల్ మూవీ టీమ్.. అక్కడ అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో రణ్‌బీర్ కపూర్ ఈ సినిమా కథ తనకు ఎందుకు అంత దగ్గరైందో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తన తరం అబ్బాయిలకు తండ్రితో ఉండే దూరం గురించి కూడా చెప్పాడు.
సందీప్ ఏం చెప్పాలనుకున్నాడో అది నచ్చింది..
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై రణ్‌బీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. "నేను సందీప్ గత చిత్రాలను (అర్జున్ రెడ్డి/కబీర్ సింగ్) బాగా ఇష్టపడ్డాను. అతనితో మొదటిసారి కలిసినప్పుడే మా మధ్య ఒక వేవ్ లెంగ్త్ కుదిరింది. చాలా అరుదుగా ఇలా జరుగుతుంది. ఒక వ్యక్తిగా సందీప్ నాకు నచ్చాడు. ఈ కథ ద్వారా అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో దానికి నేను వెంటనే కనెక్ట్ అయ్యాను" అని రణ్‌బీర్ చెప్పుకొచ్చాడు.
మా తరం అబ్బాయిలందరిదీ అదే పరిస్థితి..
సినిమాలోని తండ్రీకొడుకుల ఎమోషన్ గురించి మాట్లాడుతూ రణ్‌బీర్ తన సొంత జీవితాన్ని గుర్తుచేసుకున్నాడు. "పైకి చూడటానికి ఇదొక రక్తపాతంతో కూడిన యాక్షన్ సినిమాగా కనిపించవచ్చు. కానీ దీని అసలు స్టోరీ అంతా తండ్రీకొడుకుల ఎమోషన్‌లోనే ఉంది. నిజం చెప్పాలంటే.. మా జనరేషన్ అబ్బాయిలందరూ తండ్రితో ఒక రకమైన దూరం పాటిస్తూనే పెరిగాం. ఆ ఎమోషన్ నాకు బాగా తెలుసు. అందుకే ఈ కథ నాకు అంతగా నచ్చింది. నా కెరీర్‌లో నేను పనిచేసిన అత్యంత మధురమైన, గుర్తుండిపోయే అనుభవాల్లో సందీప్ రెడ్డితో పనిచేయడం ఒకటి" అని రణ్‌బీర్ వివరించాడు.
రూ. 900 కోట్ల రికార్డు.. త్వరలో సీక్వెల్
రణ్‌బీర్ కపూర్.. రణ్విజయ్ సింగ్‌గా నటించిన ఈ సినిమాలో అనిల్ కపూర్ తండ్రి పాత్రలో, రష్మిక మందన్న భార్యగా నటించారు. బాబీ డియోల్ విలనిజం, తృప్తి దిమ్రి నటన సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 'యానిమల్' చేరింది. త్వరలో దీనికి సీక్వెల్‌గా 'యానిమల్ పార్క్' కూడా రాబోతోంది. జపాన్ ప్రేక్షకులు ఈ వైలెంట్ ఎమోషనల్ డ్రామాను ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.
{{/usCountry}}రణ్‌బీర్ కపూర్.. రణ్విజయ్ సింగ్‌గా నటించిన ఈ సినిమాలో అనిల్ కపూర్ తండ్రి పాత్రలో, రష్మిక మందన్న భార్యగా నటించారు. బాబీ డియోల్ విలనిజం, తృప్తి దిమ్రి నటన సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 'యానిమల్' చేరింది. త్వరలో దీనికి సీక్వెల్‌గా 'యానిమల్ పార్క్' కూడా రాబోతోంది. జపాన్ ప్రేక్షకులు ఈ వైలెంట్ ఎమోషనల్ డ్రామాను ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.
{{/usCountry}}