...
...
Next Story

Ramayana VFX: నెగెటివ్ పబ్లిసిటీ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్.. రణ్‌బీర్ కపూర్ రామాయణం గ్రాఫిక్స్‌పై చెలరేగిన దుమారం

Ramayana VFX: రణ్‌బీర్ కపూర్ రామాయణ మూవీపై ఇప్పుడో కొత్త దుమారం రేగుతోంది. ఈ సినిమా టీజర్లో కావాలనే నెగటివ్ పబ్లిసిటీ కోసం తక్కువ క్వాలిటీ వీఎఫ్ఎక్స్ వాడారంటూ ఓ క్రియేటర్ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

Published on: Jul 2, 2026, 15:16:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ramayana VFX: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎపిక్ మూవీ 'రామాయణం' వీఎఫ్ఎక్స్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం చెలరేగుతోంది. ఫ్రీ పబ్లిసిటీ కోసం మేకర్స్ కావాలనే రామ గ్లింప్స్‌లో చెత్త గ్రాఫిక్స్ వాడారని ఒక కంటెంట్ క్రియేటర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. నెగెటివ్ మార్కెటింగ్ కోసం ఆడియన్స్‌ను ఇలా వాడుకోవడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

యూట్యూబర్ సంచలనం

Ramayana VFX: నెగెటివ్ పబ్లిసిటీ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్.. రణ్‌బీర్ కపూర్ రామాయణం గ్రాఫిక్స్‌పై చెలరేగిన దుమారం
Ramayana VFX: నెగెటివ్ పబ్లిసిటీ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్.. రణ్‌బీర్ కపూర్ రామాయణం గ్రాఫిక్స్‌పై చెలరేగిన దుమారం

దంగల్ ఫేమ్ నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో డైరెక్ట్ చేస్తున్న రామాయణ సినిమా సెట్స్‌లో రీసెంట్‌గా 'క్రియేటర్స్ డే' నిర్వహించారు. సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు చేసే యూట్యూబర్ ధ్రువ్ దీక్షిత్ ఈ ఈవెంట్‌కు అటెండ్ అయ్యాడు.

అక్కడ డైరెక్టర్ నితీష్ తివారీ, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా సహా హీరోలు రణబీర్, యశ్‌లను కలిసిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు.

కావాలనే 'చెత్త' వీఎఫ్ఎక్స్‌ వదిలారు

ఈ పోస్ట్‌ కింద ఒక నెటిజన్ వీఎఫ్ఎక్స్ గురించి అడగగా, ధ్రువ్ ఇచ్చిన రిప్లై సెన్సేషన్‌గా మారింది. తను సెట్స్‌లో ఒక వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌తో మాట్లాడానని, ఫ్రీ పబ్లిసిటీ కోసమే మేకర్స్ కావాలని అసంపూర్తిగా ఉన్న రామ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారని బాంబు పేల్చాడు.

ఇంటర్నెట్‌లో ఎంత నెగెటివ్ డిస్కషన్స్, ట్రోల్స్ జరిగితే అంత ఫ్రీ మార్కెటింగ్ వస్తుందన్న ఉద్దేశంతోనే బెటర్ వెర్షన్స్ ఉన్నా కూడా ఈ చెత్త వీఎఫ్ఎక్స్ వెర్షన్‌ను వదిలారని క్లారిటీ ఇచ్చాడు.

నెగెటివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి చెప్పిన ఈ కామెంట్స్ వెంటనే రెడిట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో స్క్రీన్‌షాట్స్ రూపంలో వైరల్ అయ్యాయి. దీంతో కంగుతిన్న ధ్రువ్.. వెంటనే తన ఒరిజినల్ కామెంట్‌ను డిలీట్ చేసి డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేశాడు.

ఈ ఏడాది మొదట్లో రిలీజైన రామ గ్లింప్స్‌లో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నప్పటికీ, శ్రీరాముడితో రాక్షసులు పోరాడే సీన్స్‌లో సీజీఐ (CGI) చాలా నాసిరకంగా ఉందంటూ తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి. ఫ్యాన్స్ నిరాశ చెందడంతో సినిమా రిలీజ్ నాటికి ఆ లోపాలన్నీ సరిదిద్దుతామని మేకర్స్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు లీకైన మ్యాటర్ చూస్తుంటే ఇదంతా కావాలనే ప్లాన్ చేసి రిలీజ్ చేశారా అనే డౌట్స్ పెరిగిపోతున్నాయి.

పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ సెన్సేషన్ సాయి పల్లవి (Sai Pallavi) సీతాదేవిగా నటిస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా పవర్‌ఫుల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ ఎపిక్ మూవీ ఫస్ట్ పార్ట్ 2026 దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. సెకండ్ పార్ట్ 2027 దీపావళికి వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks